విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో యథావిధిగా పెళ్లిళ్లు చేసుకోవచ్చని దుర్గగుడి ఈవో ఎస్.ఎస్.చంద్రశేఖర్ ఆజాద్ శనివారం ప్రకటించారు.
విజయవాడ (ఇంద్రకీలాద్రి): విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో యథావిధిగా పెళ్లిళ్లు చేసుకోవచ్చని దుర్గగుడి ఈవో ఎస్.ఎస్.చంద్రశేఖర్ ఆజాద్ శనివారం ప్రకటించారు. గతంలో ఆలయ ప్రాంగణంలో పెట్టిన అన్ని నిబంధనలను రద్దుచేస్తూ ఆదేశాలు జారీచేశారు.
అమ్మవారి సన్నిధిలో వివాహం జరుపుకున్నవారు పసుపు బట్టలతో అమ్మవారి దర్శనానికి వస్తే వారితోపాటు మరో నలుగురికి ఉచితంగా అంతరాలయ దర్శనానికి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. అమ్మ సన్నిధిలో వివాహాలు జరుపుకొనేవారు సన్నాయి మేళంతోనే చేసుకోవాలని, పూర్తి బ్యాండ్ పెట్టవద్దని సూచించారు. అమ్మవారి మెట్ల పూజలు యథావిధిగా చేసుకోవచ్చునని ప్రకటించారు.