పెళ్లెప్పుడవుతుంది బాబూ! | Young people who are not married despite increasing age | Sakshi
Sakshi News home page

పెళ్లెప్పుడవుతుంది బాబూ!

Published Sun, Jan 19 2025 11:59 AM | Last Updated on Mon, Jan 20 2025 2:41 PM

Young people who are not married despite increasing age

ముదిరిపోతున్న పెళ్లికాని ప్రసాద్‌లు! 

ఏళ్లపాటు సంబంధాలు చూస్తున్నా.. జరగని పెళ్లిళ్లు  

సంబంధాల వేటలో పెరుగుతున్న అబ్బాయిల వయసు  

ఉద్యోగం, సంపాదన ఉన్నా అమ్మాయి దొరకలే! 

కొడుక్కి పెళ్లెప్పుడవుతుందోనని  తల్లిదండ్రుల ఆవేదన 

కొడుకంటే మమకారం.. వంశోద్ధారకుడు కావాలన్న ఆశయం.. ఫలితం సమాజంలో తగ్గుతున్న అమ్మాయిల జననం.. దీనికితోడు గొంతెమ్మ కోర్కెలు.. సాఫ్ట్‌వేర్లు.. మన కనుసైగల్లో మసలుకునే వారు కావాలన్న ఆశలు.. కూతురు,  అల్లుడు ఒంటరిగా ఉండాలన్న వధువు తల్లిదండ్రుల షరతులు.. వెరసి పలువురు యువకులు పెళ్లికానీ ప్రసాద్‌లుగా మారుతున్నారు.

పలమనేరు: అబ్బాయికి ఆస్తి పాస్తులు.. మంచి ఉద్యోగం.. అందం అన్నీ ఉన్నాయి. వివాహం చేయడానికి వందలాది సంబంధాలు చూస్తున్నారు..అయినా అమ్మాయిలు దొరకడం లేదు. దీంతో 30 ఏ ళ్లు దాటిపోతోందని, అబ్బాయి పెళ్లి జరుగుతుందోలేదోనని అతడి తల్లిదండ్రులు ఎవరికీ చెప్పుకోలేక మద‌నపడుతున్నారు. గతంలో అమ్మాయి తరఫువారే వరసైన వారికి పెళ్లి చేయించేలా పెద్దలు మాటిచ్చేవారు. ఇక బావా, మరదళ్లు అయితే చెప్పాల్సిన అవసరం ఉండేదికాదు. కట్నకానుకలపై పెద్దగా పట్టింపులుండేవి కాదు. కానీ రెండు దశాబ్ధాలుగా వ్యవస్థ  మారిపోయింది. ప్రస్తుతం పెళ్లి సంబంధాలు కుదరడం ఆషామాషీ కాదు. 

అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఏం ఉద్యోగం, ఎంత జీతం, ఆస్తిపాస్తులు, సెల్ఫ్‌ అకౌంట్‌లో సేవింగ్స్‌ ఎంత, సొంతంగా సైట్‌ లేదా  సొంత ఇ ల్లు, కారుందా? అనే మాట వినిపిస్తోంది. వివాహానంతరం వారిద్దరే వేరుగా ఉండాలనే మాట అమ్మాయి, వారి తల్లిదండ్రు ల్లో వినిపిస్తోంది. దీంతోపాటు జాతకాలు, అబ్బాయిల వ్యక్తిగత విషయాలపై వే గుల విచారణ ఎక్కువైంది. వీరు అబ్బాయి ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రా, ఎక్స్‌తోపాటు జీమెయిల్‌లో సెర్చింగ్‌ ఆధారంగా గర్ల్‌ ఫ్రెండ్స్, వారి అలవాట్లను కనుక్కుని పెళ్లి చేసుకోవాలా? వద్దా అని నిర్ణయించుకుంటున్నా రు. దీంతో అబ్బాయిలకు అన్నీ ఉండీ మూడు పదులు దాటినా అమ్మాయిలు దొరక్క వారు పడుతున్న కష్టం కంటే వారి తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన వర్ణనాతీతంగా మారింది. 

5 వేల మంది పెళ్లిళ్ల పేరయ్యలు  
మ్యాట్రిమోనియల్‌ సైట్లు, ఆయా కులాలకు చెందిన ప్రత్యేక సైట్లుతోపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 5వేల మందికిపైగా పెళ్లిళ్ల పేరయ్య లున్నారు. వీరందరూ తమ వద్ద వేలాది మంది అబ్బాయిలు, అమ్మాయిల ఫ్రొఫైళ్లు పెట్టుకుని ఇరువర్గాలకు చూపుతున్నా పెళ్లిళ్లు మాత్రం సెట్‌ కావడం లేదు.

కర్షకుడా..? అయితే వద్దులే! 
సేద్యం చేసుకునే వారికి ఆడబిడ్డ దొరకడం చాలా కష్టంగా మారింది. మరికొన్ని వృత్తి పనులు చేసేవారికి సైతం ఈ సమస్య తప్పడం లేదు. కొన్ని ఉన్నత కులాల్లోనూ అమ్మాయిల దొరకడం కష్టంగా మారింది. ఇంకొందరికి జాతకాలు సెట్‌కాలేదనే కారణం కనిపిస్తోంది. గతంలో అమ్మాయిలు, అబ్బాయిల సగటు సమానంగా ఉండేది. కానీ ఇప్పుడు లింగవివక్ష కారణంగా అబ్బాయిల కంటే అమ్మాయిల సగటు తగ్గుతోంది.  

నిఘా వర్గాలతో కొన్ని సంబంధాలు విఫలం  
తమ పిల్లను పలానా వాళ్లు అడిగారు, వారి అబ్బాయి మంచోడేనా కనుక్కోవాలని పెళ్లి కుమార్తె తరఫువారు తెలిసిన వారిని ఆరా తీస్తున్నారు. దీంతో వారు ఓకే అంటే పర్వాలేదు గానీ.. అబ్బాయికి ఎదో అలవాట్లున్నాయని, లేదా చెప్పిన జీతం అంత లేదని, అసలు సాఫ్ట్‌వేర్‌ కాదని, ఏదో విషయంలో తప్పులు చెప్పారని సమాచారం ఇస్తే ఇక పెళ్లి కథ కంచికి చేరుతోంది.  

మూడు పదులు దాటిన పెళ్లి కాలే!
గతంలో అబ్బాయికి 21, అమ్మాయికి 18 వచ్చిందంటే పెళ్లిళ్లు జరిగేవి. ఇప్పుడు 30 ఏళ్లు దాటిన అమ్మాయిలు, 35 దాటిన అబ్బాయిల సంఖ్య పెరుగుతోంది. గతంలో పెళ్లిళ్లకు కుటుంబసమేతంగా హాజరయ్యేవారు. పెళ్లిళ్లలోనే అమ్మాయిని చూసి, పెళ్లి విషయాలు మా ట్లాడుకుని వివాహాలు జరిపించేవారు. కానీ నేడు పెళ్లళ్లకు ఇంటికొకరు మాత్రమే హడావుడిగా రిసెప్షన్‌కు వచ్చి వెళ్లిపోతున్నారు. దీంతో ఆ పెళ్లికి వచ్చిన వారిలో బంధువుల ఉన్నప్పటికీ మాట మంచీ లేకుండా పోతోంది.

చ‌ద‌వండి: లైవ్‌’ కోడి స్పెషల్‌!

పెళ్లిళ్లు సెట్‌ చేయడం చాలా కష్టం  
గతంలో ఎన్నో పెళ్లిళ్లు సెట్‌ చేశాం. ఇప్పుడు తల్లిదండ్రులు కాదు పెళ్లి చేసుకునే అమ్మాయిలు ఎన్నో షరతులు పెడుతున్నారు. గతంలో అబ్బాయి, అమ్మాయి ఫొటోలు చూసి పెళ్లికి ఒప్పుకొనేవారు. ఇప్పుడలా కాదు ఇరువర్గాలు మొత్తం విచారించుకుని, నచ్చితేనే ఓకే అంటున్నారు. నేడు పెళ్లి కుమా ర్తె డిమాండ్లను తీర్చడం ఆషామాషీ కాదు.
 –త్యాగరాజులు, ఎస్‌ఎల్‌వీ మ్యారేజి లింక్స్‌ నిర్వాహకులు, పలమనేరు

అమ్మాయిల సంఖ్య తక్కువ 
అబ్బాయిలు ఎక్కువగా ఉన్నారు. వారికి కావాల్సిన మేరకు అ మ్మాయిలు దొరకడం లేదు. ఇంతకుముందు తల్లిదండ్రులు ఒ ప్పుకుంటే పెళ్లి ఠక్కున జరిగేవి. ఇప్పుడలాకాదు అమ్మాయి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలంటే ఎన్నో డిమాండ్లు పెడుతోంది. అంతా సాఫ్ట్‌వేర్లే కావాలంటున్నారు. సేద్యం చేసుకునే వాడిని పెళ్లి చేసుకొనేవాళ్లెవరో అర్థం కాలేదు. గొంతెమ్మ కొర్కెలతో ముదిరిపోతున్నారు. 
– లక్ష్మీపతినాయుడు, మ్యారేజి బ్రోకర్,బురిశెట్టిపల్లి, బైరెడ్డిపల్లి మండలం   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement