
టీ.నగర్: రాష్ట్రంలోని మదురై, తిరుప్పరంగుండ్రం, కడలూరులలో శుక్రవారం ఒకే రోజు రెండు వందల వివాహాలు జరిగాయి. మీనాక్షి అమ్మవారి ఆలయం, తల్లాకుళం పెరుమాళ్ ఆ లయం, తిరుప్పరంకుండ్రం మురుగన్ ఆలయాల ఎదుట వందకు పైగా వివాహాలు జరిగా యి. అదేవిధంగా శుక్రవారం తిరుప్పరంగుండ్రం మురుగన్ ఆలయంలో 50 పెళ్లిళ్లు జరిగా యి. కడలూరు సమీపంలోగల తిరువందిపురం ప్రాంతంలోని కల్యాణ మండపంలో 50కి పైగా వివాహాలు శుక్రవారం తెల్లవారుజాము నుంచి జరిగాయి. ఒక్కో వివాహాన్ని నిర్ణీత సమయంలో ముగించడంతో వరుసగా వివాహ కార్యక్రమాలు సాగాయి. వివాహానంతరం నూతన జంటలు కుటుంబ సభ్యులు, బంధువులతో తిరు వందిపురం దేవనాదస్వామి దర్శనం చేసుకున్నారు.