మేకప్ పై పెరుగుతున్న వ్యామోహం..!
భారత్ లో సంప్రదాయ వివాహాల్లో ఇటీవల మేకప్ పై తీవ్ర వ్యామోహం పెరుగుతున్నట్లు మేకప్ పరిశ్రమ నిపుణులు పనాజీ వెల్లడించారు. దేశంలో మేకప్ ఇండస్ట్రీరీ ప్రతి సంవత్సరం ఇరవై శాతం చొప్పున అభివృద్ధి చెందేందుకు ఈ వివాహాలు దోహదం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత ప్రజలు సౌందర్యానికి అత్యధికంగా ఖర్చు చేస్తున్నారని ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా భారత వివాహాలు పరిశ్రమకు మంచి అభివృద్ధి సాధకాలుగా మారుతున్నాయని, ముంబైలోని బాలీవుడ్, హాలీవుడ్ ఇంటర్నేషనల్(BHI), మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్ అకాడమీ నిపుణుడు వివేక్ భారతీ వివరించారు. ముంబైలో ప్రారంభమైన ఓ అంతర్జాతీయ వర్క్ షాప్ సందర్భంగా మాట్లాడిన ఆయన... ఈ విషయాన్ని వెల్లడించారు. హాలీవుడ్ ప్రముఖ మేకప్ కళాకారుడు డోనాల్డ్ సిమ్ రాక్ ఈ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా హజరయ్యారు.
అభివృద్ధి చెందిన, అత్యంత సంపన్నదేశమైన అమెరికా చుట్టుపక్కల ప్రాంతాల్లో వివాహ సందర్భాల్లో మేకప్ కు సుమారు 150 నుంచి 200 డాలర్లను ఖర్చు పెడుతుంటే... ఇండియాలో మాత్రం బ్రైడల్ మేకప్ కు సుమారు 14 నుంచి 15 వేల రూపాయలు దాకా ఖర్చు చేయడం పెద్ద విషయంగా భావించడం లేదని నిపుణులు అంటున్నారు. కొన్ని ప్రత్యేక వివాహ వేడుకల్లో లక్షలకొద్దీ మేకప్ కోసం ఖర్చుచేసిన దాఖలాలు ఉన్నాయంటున్నారు. వివాహాన్ని ఓ చిరస్మరణీయ వేడుకగా జరుపుకునేందుకు భారతీయులు ఎంతో ఖర్చు పెడతారని ఈ సందర్భంగా భారతీ వివరించారు.
వివాహం అనేది భారత కుటుంబాల్లో ఓ ప్రత్యేక కార్యక్రమం అని, ఇందులో వధువు దుస్తులతోపాటు, అలంకరణ, మేకప్ ఆకర్షణీయంగా ఉండేందుకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారని భారతీ అన్నారు. పెళ్ళి సందర్భంలో వధువు అత్యంత ఆకర్షణీయంగా కనిపించడం వారి ఐశ్వర్యాన్ని సూచిస్తుందని, ఆ సన్నివేశంలోని చిత్రాలను తరతరాలపాటు భద్రపరచుకొంటారని సూచించారు. బ్యూటీ ఇండ్రస్ట్రీ సంవత్సరానికి ఇరవై శాతం అభివృద్ధి చెందుతుండగా మేకప్ పై జనంలో ఏభైశాతం అవగాహన కూడ పెరుగిందని అయన తెలిపారు.
ముఖ్యంగా పరిశ్రమ అభివృద్ధి భారతీయ సెలూన్లలో చూస్తే తెలుస్తుందని, గతంలో బ్యూటీ ఇండస్ల్రీపై అవగాహన అంతగా ఉండేది కాదని, నిరక్షరాస్యులే ఇందులో పనిచేసేందుకు ముందుకొచ్చేవారని అన్నారు. ఇప్పుడు ఉన్నత కుటుంబాల్లోని పిల్లలు బ్యూటీ పరిశ్రమలో అడుగిడి, దాన్ని ఉద్యోగంగా మార్చుకుంటున్నారన్నారు. అంతేకాక ఎక్కువ మొత్తంలో చెల్లింపులు పొందే ఉద్యోగంగా మేకప్ ఉద్యోగం మారుతోందని, మంచి మేకప్ ఆర్టిస్ట్ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో సంపాదిస్తున్నాడని ఆయన వివరించారు.