సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ నియంత్రణలో భాగంగా పెళ్లిళలకు గరిష్టంగా 150 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. పెళ్లిళ్లతో పాటు ఏదైనా ఫంక్షన్లు, ప్రార్థనలు ఏదైనా సరే 150 మందికి మించి గుమికూడ వద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని, మాస్కులు ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. సినిమాహాళ్లలో సీటు మార్చి సీటు ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. తాజా నిబంధనలను జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment