సాక్షి, విజయవాడ: దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. ఏపీ ప్రభుత్వం కేంద్రం సూచనలతో ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. సీజనల్‌గా ఇప్పటికే రెగ్యులర్‌గా ఫీవర్సర్వేను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ సన్నద్ధతపై ఉన్నతాధికారులతో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు సమీక్షించారు. గ్రామస్థాయిలో ర్యాపిడ్ కిట్లతో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
సెకండ్ వేవ్ సమయంలోనే ముందస్తు చర్యలను ఏపీ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వ చర్యలతో రాష్డ్ర వ్యాప్తంగా 40 వేలకి పైగా ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి వచ్చాయి. రోజుకి 60 వేలకి పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించే సామర్థ్యానికి ఏపీ చేరుకుంది. మరోసారి ఆసుపత్రులలో ఆక్సిజన్ బెడ్స్, పనితీరు, మందులు సమీక్షించుకుని ముందస్తు జాగ్రత్తలు చేపట్టనున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.
కోవిడ్ విషయంతో అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం రాష్ట్రాలకి హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్డ్రాలకి కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సుదాన్ష్ పంత్ సోమవారం లేఖ రాశారు. కేరళలో వెలుగుజూసిన కోవిడ్ కొత్త సబ్ వేరియంట్ జెఎన్1పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిన్న(సోమవారం) ఒక్కరోజే కోవిడ్‌తో దేశవ్యాప్తంగా ఐదుగురు మృతి చెందారు.
చదవండి: 8 వేల టన్నుల కందిపప్పు సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment