
సాక్షి, అమరావతి: కోవిడ్–19తో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటికే కోవిడ్–19తో చాలా మంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించింది. ఇంకా మిగిలిపోయిన మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున చెల్లించేందుకు జిల్లాల వారీగా రూ.10 కోట్లను విడుదల చేసింది. పరిహారం చెల్లించాక ఆ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా కలెక్టర్లకు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment