సీమ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే ‘ప్రత్యేక’ ఉద్యమం | If the neglect of the development of Seema 'special' movement will come | Sakshi
Sakshi News home page

సీమ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే ‘ప్రత్యేక’ ఉద్యమం

Published Sun, May 17 2015 4:09 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM

If the neglect of the development of Seema 'special' movement will come

కర్నూలు(అర్బన్) : రాయలసీమ అభివృద్ధిని పాలకులు నిర్లక్ష్యం చేస్తే ప్రత్యేక  ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల ఐక్య వేదిక వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ హెచ్చరించారు. శనివారం రాయలసీమ హక్కుల ఐక్య వేదిక 12వ వార్షికోత్సవం  స్థానిక మౌర్యా ఇన్ హోటల్‌లోని శ్రీ ఆర్య వైశ్య కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ హక్కుల ఐక్యవేదికను రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల ఐక్య వేదికగా విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. రాజధాని అమరావతితో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలంటే రాయలసీమలో సమ్మర్, ఉత్తరాంధ్రలో వింటర్ రాజధానులను ఏర్పాటు చేయాలన్నారు.

అలాగే ఆయా ప్రాంతాల్లో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.రాయలసీమలోని నాలుగు జిల్లాలను 8, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను 6 జిల్లాలుగా పెంచాలన్నారు. కార్యక్రమానికి రాయలసీ మ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన సుబ్రమణ్యం రెడ్డి, ఎమ్మెల్సీ ఎం. సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు లబ్బి వెంకటస్వామి, మదనగోపాల్, వరదరాజులురెడ్డి (కడప),మాజీ మేయర్ ఎస్. రఘురామిరెడ్డి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి, బీజేపీ కర్నూలు పార్లమెంట్ ఇంచార్జి నక్కలమిట్ట శ్రీనివాసులు, జిల్లా ఎన్‌జీఓల సంఘం అధ్యక్షుడు సీహెచ్ వెంగళ్‌రెడ్డి, విద్యా సంస్థల అధినేతలు వి. జనార్దన్‌రెడ్డి, పుల్లయ్య, రిటైర్డు డీఎస్‌పీ రామ్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.

సామూహిక వివాహాలు...
 వార్షికోత్సవం సందర్భంగా  సామూహిక వివాహాలు జరిపించారు.  మౌర్య హోటల్ 27 హిందువులు, 3 ముస్లిం, 11 క్రిస్టియన్ జంటలకు వివాహం జరిపించారు. టీజీ కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డా.కేజీ గోవిందరెడ్డి హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement