
శ్రీరస్తూ.. శుభమస్తూ..
తిరుమలలో రెండు రోజులుగా పెళ్లిళ్లు జోరుగా సాగుతున్నాయి. మాఘమాసం ఉత్తరాభాద్ర కన్యలగ్నమయిన గురువారం రాత్రి 9.13 గంటలకు అధిక సంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయి. ఇక్కడి టీటీడీ పౌరోహిత సంఘంలోనూ, కాటేజీల కల్యాణ మండపాలు, ప్రైవేట్ మండపాల్లోనూ సుమారు వంద దాకా పెళ్లిళ్లు జరిగాయి.
ఇక శుక్రవారం తెల్లవారుజాము 4.11 ధనుర్లగ్నంలోనూ, రాత్రి 9.09 గంటలకు రేవతి నక్షత్రం కన్యాలగ్నంలోనూ పెళ్లి ముహూర్తాలున్నాయి. శనివారం తెల్లవారుజామున 4.07 గంటల ధనుర్లగ్నంలోనూ పెళ్లిళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కల్యాణ మండపాలతోపాటు పౌరోహితులు, నాయీబ్రాహ్మణులు, పెళ్లి సామగ్రికి గిరాకీ పెరిగింది.
- సాక్షి, తిరుమల