దేశంలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుంది. దేశంలోని వివిధ నగరాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. నవంబర్ 23న పునఃప్రారంభమై 2024 మార్చి మొదటి వారం వరకు మొత్తం 38 లక్షలకు పైగా వివాహాలు జరుగనున్నాయి. వీటి కోసం 4.74 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనున్నారు.
ఈ సంవత్సరం రికార్డ్ స్థాయిలో వివాహాలు జరుగుతుండడంతో.. వ్యాపారం సైతం అదే స్థాయిలో జరుగుతుందని వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2022తో పోలిస్తే ఈ ఏడాది 26 శాతం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
దేశంలోని వ్యాపారులు, రిటైలర్ల నుంచి సేకరించిన సమాచారంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) పెళ్లిళ్ల వ్యాపారం గరిష్టంగా రూ. 4.74 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. ఇక, గత సీజన్‌లో జరిగిన మొత్తం పెళ్లిళ్ల సీజన్ వ్యాపారం కంటే ఈ సంఖ్య దాదాపు 26 శాతం ఎక్కువ. గత ఏడాది ఇదే కాలంలో దాదాపు 3.2 మిలియన్ల వివాహాలు జరగ్గా.. తద్వారా జరిగిన వ్యాపారం విలువ రూ. 3.75 లక్షల కోట్లు.
ఢిల్లీలోనే అత్యధికంగా
దేశ రాజధాని ఢిల్లీలో ఈ సీజన్ లో 4 లక్షలకు పైగా వివాహాలు జరగనున్నాయని, దీంతో దాదాపు రూ.1.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో సుమారు 7 లక్షల వివాహాలు జరగ్గా.. ఒక్కొక్క పెళ్లి రూ. 3 లక్షలు, రూ.6 లక్షలు, రూ.8లక్షల ఖర్చవుతుంది.
రూ.కోటి కంటే ఎక్కువ ఖర్చుతో
దాదాపు 10 లక్షల వివాహాలకు ఒక్కోదానికి రూ. 10 లక్షల చొప్పున ఖర్చు కాగా.. రూ.15 లక్షలతో 7 లక్షల పెళ్లిళ్లు, రూ.25 లక్షలతో 5 లక్షల పెళ్లిళ్లు. రూ. 50 లక్షలతో 50 వేల వివాహాలు, రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ ఖర్చుతో 50 వేల వివాహాలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment