భారత్‌పై తీవ్రంగా స్పందించిన మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(కాయిట్) కీలక నిర్ణయం ప్రకటించింది. మాల్దీవ్స్–ఇండియా మధ్య ఇటీవల నెలకొన్న సంఘటనల నేపథ్యంలో ఆ దేశంతో భారత్ వాణిజ్యం తగ్గించుకోవాలని ట్రేడర్ల అసోసియేషన్ కాయిట్ పిలుపిచ్చింది. భారతప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్లు సహించబోమని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు.
ఇందుకు నిరసనగా మాల్దీవ్స్‌ను బాయ్‌కాట్ చేయాలని బిజినెస్ వర్గాలను కోరారు. ఆ దేశానికి బలమైన మెసేజ్ పంపాలంటే బిజినెస్ కమ్యూనిటీ కలిసి ఉండాలని ఖండేల్వాల్ అన్నారు. ఇరు దేశాలు ఒకరినొకరు గౌరవించుకోవాలని చెప్పారు. మరోవైపు ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) కూడా మాల్దీవ్స్‌ను ప్రమోట్ చేయొద్దని ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లను కోరింది.
ఇదీ చదవండి: రూ.45 వేలకోట్లతో రివర్‌క్రూజ్ టూరిజం.. ఏం చేస్తారో తెలుసా..
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల లక్ష్యదీప్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన పోస్ట్ చేసిన వీడియోపై మాల్దీవులు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ దేశ ప్రభుత్వం వారిపై వేటు వేసింది. ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment