లక్షద్వీప్‌ వర్సెస్‌ మాల్దీవ్స్‌.. పనిచేస్తున్న పర్యాటక దేశ వెబ్‌సైట్లు | Maldives Government Websites Restored After Few Hours | Sakshi
Sakshi News home page

లక్షద్వీప్‌ వర్సెస్‌ మాల్దీవ్స్‌.. పనిచేస్తున్న పర్యాటక దేశ వెబ్‌సైట్లు

Published Sun, Jan 7 2024 7:43 AM | Last Updated on Sun, Jan 7 2024 10:44 AM

Maldives Government Websites Restored After Few Hours - Sakshi

మాలె: మాల్దీవులకు చెందిన ప్రభుత్వ ప్రధాన వెబ్‌సైట్‌లు మళ్లీ పనిచేయడం ప్రారంభించాయి. సాం‍కేతిక సమస్యతో శనివారం రాత్రి కొంత సమయం పాటు పనిచేయకుండా పోయిన మాల్దీవుల అధ్యక్ష కార్యాలయ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, టూరిజం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లను కొన్ని గంటల తర్వాత పునరుద్ధరించారు.

ప్రభుత్వ ప్రధాన వెబ్‌సైట్‌లు సాంకేతిక సమస్య తలెత్తి కొంత సేపు డౌన్‌ అయ్యాయని దేశ ప్రెసిడెంట్‌ ఆఫీసు ఎక్స్‌లో పోస్టు చేసింది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఎన్‌ఎస్‌ఐటీ) వెబ్‌సైట్‌ల పూర్తిస్థాయి పునరుద్ధరణ కోసం పనిచేస్తోందని ప్రెసిడెంట్‌ ఆఫీసు తెలిపింది. ఈ అంతరాయం వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్తున్నామని ప్రకటించింది.  

మరోపక్క ప్రధాని మోదీ లక్షద్వీప్‌ను ఇటీవల సందర్శించిన తర్వాత ఆయన ఫొటోలపై మాల్దీవుల ప్రోగ్రెసివ్‌ పార్టీ మెంబర్‌ జహీద్‌ రమీజ్‌ ఎక్స్‌లో చేసిన పోస్టులు దుమారం రేపాయి. రమీజ్‌ పోస్టులపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్‌లో లక్షద్వీప్‌ వర్సెస్‌ మాల్దీవ్స్‌గా మారింది.

ఇక నుంచి టూర్లకు మాల్దీవులకు వెళ్లకుండా లక్షద్వీప్‌కు వెళ్లాలని పిలుపునిస్తున్నారు. దీంతో ఎక్స్‌లో బాయ్‌కాట్‌ మాల్దీవ్స్‌ ట్రెండింగ్‌గా మారింది. చాలా మంది భారత పర్యాటకులు తమ మాల్దీవుల టికెట్లను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నారు. అయితే ఈ వివాదానికి మాల్దీవుల వెబ్‌సైట్‌లు డౌన్‌ అవడానికి సంబంధం లేదని తెలుస్తోంది. 

ఇదీచదవండి..అమెరికా రక్షణ మంత్రికి అనారోగ్యం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement