ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్షద్వీప్‌లో పర్యటించడం వల్ల అక్కడి దీవుల్లో పర్యాటకానికి ఊతం లభించిందని మేక్‌మైట్రిప్ సంస్థ పేర్కొంది. లక్షద్వీప్ టూర్ కోసం తమ ఆన్-ప్లాట్‌ఫారమ్ సెర్చ్‌లో 3,400 శాతం పెరిగిందని తెలిపింది. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల రాజకీయ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వివాదం చెలరేగిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
భారత్-మాల్దీవుల మధ్య వివాదం చెలరేగడంతో మాల్దీవులకు విమానాల బుకింగ్‌లను నిలిపివేసినట్లు భారతీయ ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ అయిన EaseMyTrip ఇప్పటికే ప్రకటించింది. మన దేశానికి సంఘీభావంగా నిర్ణయం తీసుకున్నామని EaseMyTrip వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు.
ఇది ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. మాల్దీవుల పర్యాటకంపై ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. బైకాట్ మాల్దీవులు అంటూ నినాదాలు విస్తృతంగా వ్యాప్తి చేశారు. ఈ వివాదంపై ఇరుదేశాలు ఇప్పటికే హైకమిషనర్లకు సమన్లు జారీ చేశారు.
ఇదీ చదవండి: లక్షద్వీప్‌తో మాల్దీవులకు సమస్య ఏంటి?.. స్థానిక ఎంపీ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment