make my trip
-
నవజంట కలల పంట..థాయ్‌లాండ్!
సాక్షి, అమరావతి : ఇంతకాలం బ్యాచిలర్స్ డెస్టినేషన్‌గా పేరొందిన థాయిలాండ్ ఇప్పుడు పెళ్లయిన కొత్త జంటలకు హానీమూన్ స్పాట్‌గా మారింది. ఇప్పటి వరకు హానీమూన్ డెస్టినీగా ఉన్న మాల్దీవుల కంటే అత్యధికంగా థాయ్‌లాండ్‌కు వెళ్లినట్టు మేక్ మై ట్రిప్ హానీమూన్–2024 నివేదిక వెల్లడించింది. గడిచిన ఏడాది కాలం(అక్టోబర్ 23 నుంచి సెప్టెంబర్–24)లో కొత్తగా పెళ్లయిన జంటలు హనీమూన్ కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లినట్టు పేర్కొంది. ఈ ఏడాదిలో థాయ్‌లాండ్ కు వెళ్లిన కొత్త జంటల్లో 5.2 శాతం వృద్ధి నమోదయితే.. అదే సమయంలో మాల్దీవుల బుకింగ్స్ 16.2 శాతం పడిపోయినట్లు పేర్కొంది. మాల్దీవుల పర్యాటక మంత్రి ఇండియన్ బీచ్‌లను కించపరుస్తూ మాట్లాడటం, ఆ తర్వాత బ్యాన్ మాల్దీవ్స్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రచారం జరగడమే దీనికి ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. థాయ్‌లాండ్, మాల్దీవుల తర్వాత ఇండోనేషియా, మారిషస్, వియత్నాంలకు ఎక్కువ మంది జంటలు వెళుతున్నట్టు నివేదిక పేర్కొంది. ఇండియా నుంచి అత్యధికంగా వెళ్లే ఐదు దేశాల్లో ఒక్క మాల్దీవులు తప్ప మిగిలిన నాలుగు దేశాలు వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ప్రస్తుత యువత హానీమూన్ కోసం దగ్గర ప్రాంతాలనే కాకుండా ఎక్కువ రోజులు గడిపేలా సుదీర్ఘ ప్రాంతాలైన జపాన్, స్కాండినేవియా, యునైటెడ్ స్టేట్స్, దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు వెళ్లేందుకు కూడా అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ ఏడాది జపాన్ బుకింగ్స్‌లో ఏకంగా 388 శాతం వృద్ధి నమోదైంది. కేరళను అధిగమించిన అండమాన్ ఇక దేశీయంగా చూస్తే కొత్త జంటలు అండమాన్ నికోబార్ దీవుల్లో గడపడానికి ఇష్టపడుతున్నారు. తొలిసారిగా హానీమూన్ ప్యాకేజీల్లో కేరళను అధిగమించి అండమాన్ ముందుకొచ్చినట్టు నివేదిక పేర్కొంది. అండమాన్‌లో నీలి రంగు సముద్రంతో బీచ్‌లు పరిశుభ్రంగా ఉండటంతో పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గతేడాదితో పోలిస్తే అండమాన్ బుకింగ్స్‌లో 6.9 శాతం వృద్ధి నమోదైంది. అండమాన్, కేరళ తర్వాత కశ్మీర్, గోవా, హిమాచల్ ప్రదేశ్లు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. కొత్తగా హనీమూన్ పర్యాటక ప్రాంతాలుగా ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాలు ఎదుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. అస్సలు తగ్గడం లేదు.. హనీమూన్ ఖర్చు విషయంలో యువత వెనుకాడటం లేదు. హానీమూన్ ప్యాకేజీల్లో అత్యధికంగా ఫోర్స్టార్, ఫైవ్‌స్టార్ హోటల్స్‌లోనే బస చేసేందుకే ఇష్టపడుతున్నారట. గతేడాది మొత్తం జంటల్లో 68 శాతం మంది స్టార్ హోటల్స్‌లోనే బస చేయడమే కాకుండా, సగటు ఖర్చులో 13 శాతం వృద్ధి నమోదైంది. కేవలం ఒక ఊరు, ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా రెండు మూడు ప్రాంతాలు తిరగడానికి జంటలు ఎక్కువగా ఇష్టపడుతున్నాయి. అంతర్జాతీయంగా రెండు మూడు దేశాలకు వెళ్లే వారి సంఖ్య 32 శాతం నుంచి 47 శాతానికి పెరిగితే, దేశంలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ నగరాలను సందర్శించే జంటల సంఖ్య 35 శాతం నుంచి 39 శాతానికి పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. -
మోదీ పర్యటన తర్వాత లక్షద్వీప్ వైపే అందరి చూపు!
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్షద్వీప్‌లో పర్యటించడం వల్ల అక్కడి దీవుల్లో పర్యాటకానికి ఊతం లభించిందని మేక్మైట్రిప్ సంస్థ పేర్కొంది. లక్షద్వీప్ టూర్ కోసం తమ ఆన్-ప్లాట్‌ఫారమ్ సెర్చ్‌లో 3,400 శాతం పెరిగిందని తెలిపింది. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల రాజకీయ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వివాదం చెలరేగిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత్-మాల్దీవుల మధ్య వివాదం చెలరేగడంతో మాల్దీవులకు విమానాల బుకింగ్‌లను నిలిపివేసినట్లు భారతీయ ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ అయిన EaseMyTrip ఇప్పటికే ప్రకటించింది. మన దేశానికి సంఘీభావంగా నిర్ణయం తీసుకున్నామని EaseMyTrip వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. మాల్దీవుల పర్యాటకంపై ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. బైకాట్ మాల్దీవులు అంటూ నినాదాలు విస్తృతంగా వ్యాప్తి చేశారు. ఈ వివాదంపై ఇరుదేశాలు ఇప్పటికే హైకమిషనర్లకు సమన్లు జారీ చేశారు. ఇదీ చదవండి: లక్షద్వీప్‌తో మాల్దీవులకు సమస్య ఏంటి?.. స్థానిక ఎంపీ ఫైర్ -
ODI World Cup 2023: ఆ పట్టణాల్లో హోటళ్లకు డిమాండ్
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చే పట్టణాల్లో హోటల్ సేవలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. దీంతో ఆన్లైన్ ట్రావెల్, హోటల్ బుకింగ్ సేవలు అందించే సంస్థలు డిమాండ్‌ను చేరుకునే వ్యూహాలపై దృష్టి సారించాయి. హోటల్ బుకింగ్ సేవల సంస్థ ఓయో ఈ పట్టణాల్లో 500 హోటళ్లను అదనంగా తన నెట్వర్క్ కిందకు తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఈ పట్టణాల్లో మ్యాచ్‌లను చూసేందుకు వచ్చే వీక్షకుల నుంచి హోటల్ బుకింగ్‌కు డిమాండ్ ఉంటుందన్న అంచనాలతో, వచ్చే మూడు నెలల్లో కొత్త హోటళ్లను చేర్చుకోనున్నట్టు తెలిపింది. కొత్త హోటళ్లు స్టేడియంలకు దగ్గర్లో ఉండేలా చూస్తామని, దాంతో క్రికెట్ అభిమానులు స్టేడియంలు చేరుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఓయో అధికార ప్రతినిధి ప్రకటించారు. సుదూర ప్రాంతాల నుంచి తమ అభిమాన జట్ల ఆటను చూసేందుకు వచ్చే వారికి సౌకర్యవంతమైన, అందుబాటు ధరలకు ఆతిథ్యం అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ పోటీలు మొదలు కానున్నాయి. దీనికి మూడు నెలల ముందుగానే ఆతిథ్య పట్టణాల్లో హోటళ్ల టారిఫ్‌లు (రూమ్ చార్జీలు) అధిక డిమాండ్ కారణంగా పెరిగినట్టు ఓయో తెలిపింది. నవంబర్ 19తో వన్డే ప్రపంచకప్ ఛాంపియన్íÙప్ ముగుస్తుంది. హైదరాబాద్, అహ్మ దాబాద్, ఢిల్లీ, ధర్మశాల, చెన్నై, లక్నో, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, పుణెలో మ్యాచ్‌లు జరగనున్నా యి ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది. మేక్ మైట్రిప్ ఆఫర్.. ఆన్లైన్ ట్రావెల్ సేవలు అందించే మేక్ మై ట్రిప్ కూడా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆతిథ్య పట్టణ వాసులు తమ ప్రాపరీ్టలను తన ప్లాట్‌ఫామ్‌పై నమోదు చేసుకోవాలని కోరింది. అహ్మదాబాద్, ధర్మశాల, కీలక మెట్రోల్లో గృహ ఆతిథ్యాలకు డిమాండ్ పెరిగినట్టు ఈ సంస్థ ప్రకటించింది. ‘‘దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పట్టణాల్లో అక్టోబర్, నవంబర్ నెలల్లో గృహ ఆతిథ్యానికి డిమాండ్ గణనీయంగా పెరగడాన్ని గుర్తించా. క్రికెట్ అభిమానులు ఇంతకుముందు లేనంతగా గృహ ఆతిథ్యానికి ప్రాధాన్యం ఇస్తుండడం మంచి సంకేతం’’అని మేక్‌మై ట్రిప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పరీక్షిత్ చౌదరి తెలిపారు. క్రికెట్ స్టేడియం నుంచి వసతి ఎంత దూరంలో ఉందో చూపించే సదుపాయాన్ని తన ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసినట్టు చెప్పారు. అభిమానులకు అనుకూలమైన వసతిని బుక్ చేసుకోవడానికి వీలుంటుందన్నారు. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే పట్టణాల్లో అందుబాటు ధరలకే గృహవసతి అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. -
జొమాటో.. పబ్లిక్ ఇష్యూ బాట
ముంబై: ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. తద్వారా దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో తొలిసారి లిస్టయిన ఆధునిక ఇంటర్నెట్ వినియోదారు కంపెనీగా నిలిచే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇంతక్రితం 2019 జూన్‌లో బీటూబీ ఆన్లైన్ కంపెనీ ఇండియామార్ట్ ఇంటర్మెష్ మార్కెట్లలో లిస్టయ్యింది. ఇంటర్నెట్ ఆధారిత సేవలందించే ఇతర కంపెనీలను పరిగణిస్తే.. 2006లో ఇన్ఫో ఎడ్జ్, 2013లో జస్ట్ డయల్ పబ్లిక్ ఇష్యూలను విజయవంతంగా ముగించాయి. జొమాటోలో ఇన్ఫో ఎడ్జ్ ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. కాగా.. 2010లో ఆన్ లైన్ ట్రావెల్ సేవల కంపెనీ మేక్ మై ట్రిప్.. నాస్డాక్ లో లిస్టింగ్ సాధించింది. కొటక్ మహీంద్రా.. పబ్లిక్ ఇష్యూకి మర్చంట్ బ్యాంకుగా కొటక్ మహీంద్రాను జొమాటో ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇష్యూకి న్యాయ సలహాదారులుగా సైరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్, ఇండస్ లా సేవలందించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. దేశీయంగా దిగ్గజ కంపెనీలుగా ఆవిర్భవించిన ఫ్లిప్ కార్ట్, పేటీఎమ్, బిగ్ బాస్కెట్ సైతం భవిష్యత్ లో పబ్లిక్ ఇష్యూలు చేపట్టే యోచనలో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోలో.. ఇప్పటికే ఇన్ఫో ఎడ్జ్, టెమాసెక్, యాంట్ ఫైనాన్షియల్, టైగర్ గ్లోబల్ తదితర సంస్థలు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. దేశీ మార్కెట్ ఓకే విదేశీ లిస్టింగ్ కాకుండా దేశీయంగానే ఐపీవో చేపట్టాలని జొమాటో నిర్ణయించుకున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దేశీయంగానూ విజయవంతమైన కంపెనీలకు తగిన ధర లభిస్తుండటమే దీనికి కారణమని వివరించారు. టెక్నాలజీ, ఇంటర్నెట్ కంపెనీల పట్ల పలు దేశాల ఇన్వెస్టర్లు సైతం ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. 2019 జులైలో రూ. 973 ధరలో ఐపీవోకు వచ్చిన ఇండియామార్ట్ ఇంటర్మెష్ ప్రస్తుతం రూ. 4891కు చేరిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 14,240 కోట్లను తాకడం గమనార్హం. కాగా.. చివరిసారిగా నిధుల సమీకరణను పరిగణిస్తే జొమాటో విలువ 3.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అయితే హెచ్ ఎస్బీసీ 5 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. -
మేక్మైట్రిప్, ఓయోలకు సీసీఐ షాక్
న్యూఢిల్లీ: అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ మేక్మైట్రిప్ (ఎంఎంటీ), హోటల్ సేవల సంస్థ ఓయోలపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలంటూ కంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆదేశించింది. ఓయో ప్రత్యర్థి ట్రీబో హోటల్స్ మాతృసంస్థ రబ్టబ్ సొల్యూషన్స్ ఫిర్యాదు మేరకు సీసీఐ ఈ మేరకు ఆదేశాలిచ్చింది. పోటీ నిబంధనలను ఉల్లంఘించాయన్న ప్రాథమిక ఆధారాలతో ఈ రెండు సంస్థల మీద సీసీఐ విచారణకు ఆదేశించడం ఆరు నెలల వ్యవధిలో ఇది రెండోసారి. ఓయోతో ఒప్పందం కుదుర్చుకున్న ఎంఎంటీ.. తన పోర్టల్‌లో ట్రీబో భాగస్వామ్య హోటళ్లను లిస్ట్ చేయకుండా మినహాయించడం, పోర్టల్‌లో చార్జీలపరంగా పరిమితులు విధించడం తదితర అంశాలపై ట్రీబో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన సీసీఐ.. మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని ఎంఎంటీ దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రాథమిక ఆధారాల బట్టి తెలుస్తోందని 13 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది. -
భారత్‌లోకి చైనా పెట్టుబడుల వెల్లువ
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లోని ఆన్లైన్ ట్రావెల్, హోటల్ వ్యాపార రంగాల్లోకి చైనా నుంచి పెట్టుబడులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. భారత్‌కు చెందిన అతిపెద్ద ఆన్లైన్ ట్రావెల్ సంస్థ ‘మేక్ మై ట్రిప్’లో 42.5 శాతం వాటాను చైనాకు చెందిన ఆన్లైన్ ట్రావెల్ సంస్థ ‘సీట్రిప్’ ఇటీవల కొనుగోలు చేసింది. దీంతో ‘మేక్ మై ట్రిప్’లో దాదాపు సగం వాటా సీట్రిప్ కైవసం అయింది. 2016లోనే మేక్ మై ట్రిప్‌లో 18 కోట్ల డాలర్ల పెట్టుబడులను పెట్టి కొంత వాటాను కొనేసింది. 2017లో దక్షిణాఫ్రికాకు చెందిన కాస్పర్స్ కంపెనీకి మేక్ మై ట్రిప్ విక్రయించిన వాటాను ఇప్పుడు సీట్రిప్ కొనుగోలు చేసింది. 2020కి ఆన్లైన్ ట్రావెల్ వ్యాపారం 3.3 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో ఈ డీల్ కుదిరింది. భారత్‌లోనే అతిపెద్ద బడ్జెట్ హోటళ్ల చైన్‌ను కలిగిన ‘ఓయో’, దాని ప్రత్యర్థి ‘ట్రీబో’లోకి ఇప్పటికే చైనా పెట్టుబడుదారులు ప్రవేశించారు. గురుగావ్ కేంద్రంగా పనిచేస్తున్న ‘హాపీ ఈజీ గో’ లాంటి చిన్న ట్రావెల్ కంపెనీలోకి కూడా చైనా పెట్టుబడులు వస్తున్నాయంటే ఆశ్చర్యం కలుగుతోంది. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అవడం వల్ల, సమీప భవిష్యత్‌లో చైనా తర్వాత, అంతటి బలమైన ఆర్థిక వ్యవస్థ తయారవుతుందన్న అంచనాలతో ముందస్తుగానే చైనా పెట్టుబడులు వచ్చి పడుతున్నాయని ‘సెక్యూర్లీషేర్’ కంప్యూటర్ సాఫ్ట్వేర్ సంస్థ ‘స్ట్రాటజీ, పాలసీ అండ్ కార్పొరేట్ డెవలప్మెంట్’ విభాగం అధిపతి విద్యా శంకర్ సత్యమూర్తి తెలిపారు. ‘మేక్ మై ట్రిప్’ ట్రావెల్ సంస్థ 2000 సంవత్సరంలో ఏర్పడింది. అది అప్పుడు కేవలం అమెరికా, భారత్ మధ్య పర్యటలపైనే దృష్టిని కేంద్రీకరించింది. మెల్లమెల్లగా మధ్య తరగతికి చెందిన భారతీయులు ఇతర విదేశీ పర్యటనలపై ఆసక్తి చూపిస్తుండడంతో వాటిపైనా దృష్టిని కేంద్రీకరించింది. దేశంలో అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఇదొకటి. -
పేటీఎం, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీలకు భారీ నష్టాలు
సాక్షి, న్యూఢిల్లీ : పేటీఎం, ఫ్లిప్‌కార్ట్, మేక్‌మై ట్రిప్ ఇండియా, స్విగ్గీ, జొమాటో కంపెనీల పేర్లు మనం నిత్యం వింటూనే ఉంటాం. ఈ కంపెనీలు తమ తమ రంగాల్లో ప్రసిద్ధి చెందిన దిగ్గజ కంపనీలే. కనుక ఈ కంపెనీలకు భారీ ఎత్తున లాభాలు వస్తాయని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అది పొరపాటు. ప్రతి ఏటా ఈ కంపెనీలకు నష్టాలే వస్తున్నాయి. ఈ కంపెనీలన్నింటికీ కలిపి ఉమ్మడిగా ఈ ఏడాదిలో అంటే, ఆర్థిక సంవత్సరం ముగిసే 2018, మార్చి నెల నాటికి 7,800 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఒక్క జొమాటో కంపెనీకి మినహా మిగతా అన్ని కంపెనీలకు గతేడాదితో పోలిస్తే భారీ నష్టాలు సంభవించాయని బిజినెస్ రీసర్చ్ ఫ్లాట్‌ఫామ్ ‘టోఫ్లర్’ డేటా తెలియజేస్తోంది. పేటీఎం, దాని మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్లు, పేటీఎం నుంచి విడిపోయిన పేటీఎం మాల్ కంపెనీలకు కలిపి ఈ ఏడాది 3,393 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. మార్కెట్ వృద్ధి రేటు గణనీయంగా పెరిగే వరకు ఈ కంపెనీల పరిస్థితి ఇంతే. అది ఇప్పట్లో జరుగుతుందన్న సూచనలు లేవు. లాభాల మీద దృష్టిని కేంద్రీకరించకుండా, ఖర్చులకు వెరియకుండా ముందుగా మార్కెట్లోకి దూసుకపోయి, మంచి గుర్తింపు పొందడమే లక్ష్యంగా ఈ కంపెనీలు పనిచేయడంతో లాభాల జాడ కనిపించడం లేదని నిపుణులు తెలియజేస్తున్నారు. అమెజాన్‌తో పోలిస్తే ఫ్లిప్‌కార్ట్ అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. అలాగే ఉబర్ కన్నా ఓలా పెద్దిదిగా ఎదిగింది. పోటీ కంపెనీలను అధిగమించి మార్కెట్లోకి తాము దూసుకుపోవాలనే తాపత్రయం కారణంగానే ఈ కంపెనీలు మార్కెట్లో మంచి పేరు తెచ్చుకున్నాయిగానీ, పేరుకు తగ్గట్లు లాభాలు గడించలేకపోయాయి. పైగా పెద్ద ఎత్తున నష్టాలను పోగుచేసుకున్నాయ. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుదారులు ఉండడం వల్ల ఎంత నష్టాలొచ్చినా ఈ కంపెనీలు ప్రస్తుతం మనుగడ సాగించకలుగుతున్నాయి. ఆసియా నుంచి కొత్త తరానికి చెందిన ‘బైడు, టెన్సెంట్, సాఫ్ట్‌బ్యాంక్’ పెట్టుబడిదారులు రావడం ఈ సంస్థలకు కలిసి వస్తోంది. (ఫ్లిప్‌కార్ట్ బిన్నీ రాజీనామా!!) ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఓయో, ఓలా కంపెనీలు, అమెజాన్‌కు పోటీగా డిస్కౌంట్లతో ముందుకు పోయినంత కాలం ఈ కంపెనీల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ‘ఎవరెస్ట్’ గ్రూపునకు చెందిన కన్సల్టింగ్, మార్కెటింగ్ పరిశోధనా సంస్థ ఉపాధ్యక్షుడు యుగల్ జోషి హెచ్చరించారు. ఎక్కడోచోట లాభాలకు బాట వేయకపోతే కంపెనీలతోపాటు పెట్టుబడిదారులు దారుణంగా మునిగిపోతారని నిపుణులు చెబుతున్నారు. -
హ్యాపీ సవారీ.. ట్రావెల్ యారీ!
• ఆన్లైన్లో బస్ టికెట్ల బుకింగ్, బస్ ఆపరేట్లకు టెక్నాలజీ సేవలు • దేశంలోని 55 శాతం బస్ ఆపరేటర్లు ట్రావెల్ యారీ కస్టమర్లే • 8 వేల మంది ఆపరేటర్ల నమోదు; రోజుకు 1.5 లక్షల టికెట్ల బుకింగ్స • ప్రభుత్వ రవాణా సంస్థలకు టెక్నాలజీ సేవలు • గతేడాది రూ.450 కోట్ల జీఎంవీ; రూ.30 కోట్ల ఆదాయం • ‘స్టార్టప్ డైరీ’తో ట్రావెల్ యారీ కో-ఫౌండర్ అరవింద్ లామా... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బస్ ప్రయాణమంటే ముందుగా ఆలోచించేది సీటు దొరుకుతుందో లేదో అని! అందుకే మనలో చాలా మంది ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకొని ప్రయాణిస్తుంటారు. ఇందుకోసం దేశంలో మేక్ మై ట్రిప్, రెడ్ బస్, అభి బస్ వంటి ఎన్నో సంస్థలున్నారుు. ట్రావెల్ యారీ కూడా అలాంటి సంస్థే. అరుుతే దీని ప్రత్యేకత ఏమిటంటే... పైన చెప్పిన ఇతర సంస్థలు టికెట్లను బుక్ చేసేది ట్రావెల్ యారీ టెక్నాలజీ ద్వారానే! అంటే సంస్థ అభివృద్ధి చేసిన మన్‌టిస్ టెక్నాలజీ ఆధారంగా!! పంజాబ్, యూపీ, హిమాచల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ రవాణా సంస్థలు కూడా టికెట్ల బుకింగ్ కోసం మన్టిస్నే వినియోగిస్తున్నాయండోయ్. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశంలో జరిగే 55 శాతం బస్ టికెట్ల బుకింగ్ మన్‌టిస్ నుంచి జరుగుతున్నదే. టెక్నాలజీ వివరాలు, సంస్థ సేవల గురించి ట్రావెల్ యారీ.కామ్ కో-ఫౌండర్, సీఈఓ అరవింద్ లామా ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. టెక్నాలజీ ద్వారా సామాన్యుల కష్టాలకు పరిష్కారం చూపించాలనేది నా లక్ష్యం. అందుకే పేరు మోసిన టెకీ కంపెనీలో పనిచేశా.. నా ఆలోచనెప్పుడూ ప్రజల వైపే సాగేది. ఆ సమయంలో దేశంలో ఆన్లైన్లో బస్ టికెట్ల బుకింగ్ విధానం అసంఘటితంగా ఉందని తెలిసి.. రెండున్నర లక్షల పెట్టుబడితో మరో మిత్రుడు ప్రతీక్ నిగంతో కలిసి 2007లో ట్రావెల్ యారీ.కామ్‌ను ప్రారంభించా. టెక్నాలజీ సేవలు.. ట్రావెల్ యారీ టికెట్ల బుకింగ్ పాటూ ఇతర బస్ ఆపరేటర్లకు, ఆన్లైన్ సంస్థలకు, ప్రభుత్వ రవాణా సంస్థలకు టికెట్ల బుకింగ్ కోసం టెక్నాలజీ సేవలను కూడా అందిస్తుంది. దేశంలో ఆన్లైన్ ద్వారా 55 శాతం బస్ టికెట్ల బుకింగ్ మా టెక్నాలజీ అరుున మన్‌టిస్ ఆధారంగానే బుక్ అవుతున్నవే. ఆన్లైన్లో మేక్ మై ట్రిప్, రెడ్ బస్ వంటి కంపెనీలతో పాటూ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ రవాణా సంస్థలు కూడా మన్‌టిస్ టెక్నాలజీని ద్వారానే టికెట్లను జారీ చేస్తున్నారుు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రవాణా సంస్థలతోనూ చర్చిస్తున్నాం. రోజుకు 1.5 లక్షల టికెట్లు.. ప్రస్తుతం ట్రావెల్ యారీలో 8 వేల మంది బస్ ఆపరేటర్లు, ఏజెంట్లు నమోదయ్యారు. అన్ని చానల్ పార్టనర్స్ నుంచి కలిపి రోజుకు 1.5 లక్షల టికెట్లు బుక్ అవుతున్నారుు. బస్ టికెట్ల బుకింగ్‌తో పాటూ హోటల్ గదులను బుకింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఓయో, రూమ్ టు నైట్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఇటీవలే కస్టమర్ల సౌలభ్యం కోసం మొబైల్ వ్యాలెట్, క్యాష్‌బ్యాక్ రారుుతీలను ఉపయోగించుకునేందుకు వీలుగా పేటీఎం, రిలయెన్‌స జియోతో ఒప్పందం కుదుర్చుకున్నాం. హైదరాబాద్ వాటా 5 శాతం.. మా భాగస్వామ్య సంస్థలకు సంబంధించి గతేడాది రూ.450 కోట్ల గ్రాస్ మర్చంటైజ్ వాల్యూ (జీఎంవీ) వ్యాపారం జరిగింది. ఇందులో రూ.30 కోట్లు మా ఆదాయం. ఇదే మా టర్నోవర్. ఇందులో దక్షిణాది వాటా 60 శాతం. హైదరాబాద్ వాటా 5 శాతం వరకు వుంటుంది. ఈ ఏడాది రూ.600 కోట్ల జీఎంవీ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 80 శాతం చేరుకున్నాం కూడా. రూ.60 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం ట్రావెల్ యారీలో 200 మంది ఉద్యోగులున్నారు. ఇటీవలే సిరీస్-బీ రౌండ్లో 7 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించాం. గుజరాత్ వెంచర్ ఫైనాన్స లిమిటెడ్ (జీవీఎఫ్ఎల్), బెన్నెట్ కోల్మెన్ అండ్ కో లి. (బీసీసీఎల్) మరియు ఇతరులు ఈ పెట్టుబడులు పెట్టారు. వీటితో కలిపి ఇప్పటివరకు రూ.60 కోట్లు నిధులను సమీకరించాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
మేక్ మైట్రిప్ చేతికి ‘ఐబిబో’..
న్యూఢిల్లీ: ఆన్లైన్ పర్యాటక సేవల సంస్థ మేక్మైట్రిప్ తన ప్రత్యర్థి సంస్థ ఐబిబోను కొనుగోలు చేయనుంది. ఈక్విటీ రూపంలో ఈ డీల్ జరగనుంది. దీంతో ఈ విభాగంలో మేక్‌మై ట్రిప్ ప్రధాన సంస్థగా అవతరించనుంది. ఐబిబోను దాని వాటాదారులైన దక్షిణాఫ్రికాకు చెందిన నాస్పర్స్, చైనాకు చెందిన టాన్సెంట్ హోల్డింగ్స్ మేక్ మైట్రిప్కు విక్రయించేందుకు ముందుకు రాగా, దీనికి ప్రతిగా మేక్ మై ట్రిప్ ఆయా సంస్థలకు తాజా వాటాలను జారీ చేయనుంది. ఈ మేరకు మేక్ మై ట్రిప్ ఓ ప్రకటన విడుదల చేసింది. డీల్ పూర్తయితే ఐబిబో పూర్తిగా మేక్ మైట్రిప్ పరం అవుతుంది. అదే సమయంలో నాస్పర్స్, టాన్సెంట్ హోల్డింగ్స్ కలసి మేక్ మై ట్రిప్‌లో 40 శాతం వాటాను కలిగి ఉంటారు. ఇందుకు అనుగుణంగా మూలధన నిధులను సైతం అందించనున్నట్టు మేక్ మైట్రిప్ సంస్థ తెలిపింది. మేక్ మైట్రిప్ గతంలో సీట్రిప్ డాట్ కామ్‌కు జారీ చేసిన కన్వర్టబుల్ నోట్స్‌ను సాధారణ ఈక్విటీ కిందకు మార్చనున్నట్టు దీంతో ఈ సంస్థకు 10 శాతం వాటా ఉంటుందని వెల్లడించింది. మేక్మైట్రిప్ వాటాదారులతోపాటు నియంత్రణ సంస్థల అనుమతి అనంతరం ఈ డీల్ డిసెంబర్‌లోపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. మేక్ మై ట్రిప్ నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ. కాగా, తాజా డీల్ నేపథ్యంలో కంపెనీ షేరు ధర మంగళశారం ఇంట్రాడేలో దాదాపు 50% ఎగసి 31 డాలర్లను తాకడం గమనార్హం. -
పీఎఫ్ బ్రీఫ్స్
ఇక ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ ఎల్ఐసీ నొమూరా మ్యూచువల్ ఫండ్ సంస్థ పేరు మారింది. ఇక నుంచి దీన్ని ఎల్‌ఐఈసీ మ్యూచువల్ ఫండ్‌గా పిలుస్తారు. భాగస్వామ్య కంపెనీ నొమూరా స్థానంలో కార్పొరేషన్ బ్యాంక్, జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు వాటాదారులుగా చేరినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ కొత్త లోగోను ఆవిష్కరించారు. మేక్‌మై ట్రిప్‌తో బుక్‌మై ఫారెక్స్ జట్టు ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ మేక్ మై ట్రిప్‌తో విదేశీ మారకద్రవ్య సంస్థ బుక్ మై ఫారెక్స్ చేతులు కలిపింది. ఈ ఒప్పందం ద్వారా మేక్ మై ట్రిప్ ఆన్లైన్ ద్వారా బుక్ మై ఫారెక్స్ సేవలను పొందవచ్చు. దీనివల్ల 200 దేశాలకు మేక్ మై ట్రిప్ ఖాతాదారులు సులభంగా నగదును పంపించుకునే వెసులుబాటు లభించనుంది. -
హాలిడే ఐక్యూలో వాటా కొనుగోలు చేసిన మేక్మైట్రిప్
28% వాటాను రూ.95కోట్లతో కొనుగోలు న్యూఢిల్లీ : ఆన్లైన్ ట్రావెల్ సంస్థ మేక్మైట్రిప్ హోటళ్లు, పర్యాటక అనుభవాలకు సంబంధించిన సమీక్షలు, సమాచారముండే ఆన్లైన్ పోర్టల్ హాలిడేఐక్యూలో 28 శాతం వాటాను కొనుగోలు చేయనున్నది. ఈ వాటాను రూ.95 కోట్లకు కొనుగోలు చేయనున్నామని మేక్‌మైట్రిప్‌డాట్‌కామ్ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈఓ దీప్ కల్రా చెప్పారు. మేక్మైట్రిప్ అందిస్తున్న పెట్టుబడులతో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తామని హాలిడేఐక్యూ వ్యవస్థాపకుడు, సీఈఓ హరి నాయర్ వివరించారు. గతంలో టైగర్ గ్లోబల్, యాక్సెల్ పార్ట్నర్స్ల నుంచి నిధులు సమీకరించామని పేర్కొన్నారు. భారత పర్యాటకులు హోటళ్లు, పర్యాటక అనుభవాలకు సంబంధించిన సమీక్షలు పదిలక్షలకు పైగా హాలిడేఐక్యూలో ఉన్నాయి. -
ఫార్చూన్ ఇండియా లిస్టులో ఐఆర్సీటీసీ
నెక్ట్స్ 500 జాబితాలో మేక్మైట్రిప్, ఆర్బీఎల్ బ్యాంకులకు చోటు న్యూఢిల్లీ : ఫార్చూన్ ఇండియా నెక్స్ట్ 500 జాబితాలో ఐఆర్సీటీసీ సహా మేక్మైట్రిప్, ఆర్బీఎల్ బ్యాంక్, ఐనాక్స్ విండ్ తదితర సంస్థలు చోటు దక్కించుకున్నాయి. రాబోయే రోజుల్లో ఇండియా 500 లిస్టులో చోటు దక్కించుకోగలిగే సత్తా ఉన్న మధ్య స్థాయి కంపెనీలతో ఫార్చూన్ మ్యాగజైన్ ఈ జాబితాను రూపొందించింది. సుమారు రూ. 1,690 కోట్ల వార్షిక ఆదాయాలతో ఐఫోన్ల పంపిణీ సంస్థ రెడింగ్టన్ ఇండియా ఈ లిస్టులో టాప్‌లో నిల్చింది. ఐనాక్స్ విండ్(రూ.1,689 కోట్ల ఆదాయం), ఐఎస్ఎంటీ (రూ.1,685 కోట్లు), ఎమ్క్యూర్ ఫార్మా(రూ. 1,683.5 కోట్లు), ఓరియంట్క్రాఫ్ట్ (రూ.1,683 కోట్లు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. లిస్టింగ్ సన్నాహాల్లో ఉన్న ఆర్బీఎల్ బ్యాంక్(గతంలో రత్నాకర్ బ్యాంక్) 31వ స్థానంలో, ఆన్లైన్ ట్రావెల్ సంస్థ మేక్మైట్రిప్ 122వ స్థానం, భారతీయ రైల్వే టూరిజం, కేటరింగ్ విభాగం ఐఆర్సీటీసీ 328వ స్థానంలో ని ల్చాయి. మొత్తం 500 కంపెనీల్లో 434 సంస్థలు ప్రైవేటువి కాగా, 31 సంస్థలు ప్రభుత్వ రంగంలోనివి.