హ్యాపీ సవారీ.. ట్రావెల్ యారీ! | travel yaar new startup company special story | Sakshi
Sakshi News home page

హ్యాపీ సవారీ.. ట్రావెల్ యారీ!

Published Sat, Nov 19 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM

హ్యాపీ సవారీ.. ట్రావెల్ యారీ!

హ్యాపీ సవారీ.. ట్రావెల్ యారీ!

ఆన్‌లైన్‌లో బస్ టికెట్ల బుకింగ్, బస్ ఆపరేట్లకు టెక్నాలజీ సేవలు
దేశంలోని 55 శాతం బస్ ఆపరేటర్లు ట్రావెల్ యారీ కస్టమర్లే
8 వేల మంది ఆపరేటర్ల నమోదు; రోజుకు 1.5 లక్షల టికెట్ల బుకింగ్‌‌స
ప్రభుత్వ రవాణా సంస్థలకు టెక్నాలజీ సేవలు
గతేడాది రూ.450 కోట్ల జీఎంవీ; రూ.30 కోట్ల ఆదాయం
‘స్టార్టప్ డైరీ’తో ట్రావెల్ యారీ కో-ఫౌండర్ అరవింద్ లామా...

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బస్ ప్రయాణమంటే ముందుగా ఆలోచించేది సీటు దొరుకుతుందో లేదో అని! అందుకే మనలో చాలా మంది ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకొని ప్రయాణిస్తుంటారు. ఇందుకోసం దేశంలో మేక్ మై ట్రిప్, రెడ్ బస్, అభి బస్ వంటి ఎన్నో సంస్థలున్నారుు. ట్రావెల్ యారీ కూడా అలాంటి సంస్థే. అరుుతే దీని ప్రత్యేకత ఏమిటంటే... పైన చెప్పిన ఇతర సంస్థలు టికెట్లను బుక్ చేసేది ట్రావెల్ యారీ టెక్నాలజీ ద్వారానే! అంటే సంస్థ అభివృద్ధి చేసిన మన్‌టిస్ టెక్నాలజీ ఆధారంగా!! పంజాబ్, యూపీ, హిమాచల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ రవాణా సంస్థలు కూడా టికెట్ల బుకింగ్ కోసం మన్‌టిస్‌నే వినియోగిస్తున్నాయండోయ్. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశంలో జరిగే 55 శాతం బస్ టికెట్ల బుకింగ్ మన్‌టిస్ నుంచి జరుగుతున్నదే. టెక్నాలజీ వివరాలు, సంస్థ సేవల గురించి ట్రావెల్ యారీ.కామ్ కో-ఫౌండర్, సీఈఓ అరవింద్ లామా ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు.

టెక్నాలజీ ద్వారా సామాన్యుల కష్టాలకు పరిష్కారం చూపించాలనేది నా లక్ష్యం. అందుకే పేరు మోసిన టెకీ కంపెనీలో పనిచేశా.. నా ఆలోచనెప్పుడూ ప్రజల వైపే సాగేది. ఆ సమయంలో దేశంలో ఆన్‌లైన్‌లో బస్ టికెట్ల బుకింగ్ విధానం అసంఘటితంగా ఉందని తెలిసి.. రెండున్నర లక్షల పెట్టుబడితో మరో మిత్రుడు ప్రతీక్ నిగంతో కలిసి 2007లో ట్రావెల్ యారీ.కామ్‌ను ప్రారంభించా.

 టెక్నాలజీ సేవలు..
ట్రావెల్ యారీ టికెట్ల బుకింగ్ పాటూ ఇతర బస్ ఆపరేటర్లకు, ఆన్‌లైన్ సంస్థలకు, ప్రభుత్వ రవాణా సంస్థలకు టికెట్ల బుకింగ్ కోసం టెక్నాలజీ సేవలను కూడా అందిస్తుంది. దేశంలో ఆన్‌లైన్ ద్వారా 55 శాతం బస్ టికెట్ల బుకింగ్ మా టెక్నాలజీ అరుున మన్‌టిస్ ఆధారంగానే బుక్ అవుతున్నవే. ఆన్‌లైన్‌లో మేక్ మై ట్రిప్, రెడ్ బస్ వంటి కంపెనీలతో పాటూ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ రవాణా సంస్థలు కూడా మన్‌టిస్ టెక్నాలజీని ద్వారానే టికెట్లను జారీ చేస్తున్నారుు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రవాణా సంస్థలతోనూ చర్చిస్తున్నాం.

 రోజుకు 1.5 లక్షల టికెట్లు..
ప్రస్తుతం ట్రావెల్ యారీలో 8 వేల మంది బస్ ఆపరేటర్లు, ఏజెంట్లు నమోదయ్యారు. అన్ని చానల్ పార్టనర్స్ నుంచి కలిపి రోజుకు 1.5 లక్షల టికెట్లు బుక్ అవుతున్నారుు. బస్ టికెట్ల బుకింగ్‌తో పాటూ హోటల్ గదులను బుకింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఓయో, రూమ్ టు నైట్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఇటీవలే కస్టమర్ల సౌలభ్యం కోసం మొబైల్ వ్యాలెట్, క్యాష్‌బ్యాక్ రారుుతీలను ఉపయోగించుకునేందుకు వీలుగా పేటీఎం, రిలయెన్‌‌స జియోతో ఒప్పందం కుదుర్చుకున్నాం.

 హైదరాబాద్ వాటా 5 శాతం..
మా భాగస్వామ్య సంస్థలకు సంబంధించి గతేడాది రూ.450 కోట్ల గ్రాస్ మర్చంటైజ్ వాల్యూ (జీఎంవీ) వ్యాపారం జరిగింది. ఇందులో రూ.30 కోట్లు మా ఆదాయం. ఇదే మా టర్నోవర్. ఇందులో దక్షిణాది వాటా 60 శాతం. హైదరాబాద్ వాటా 5 శాతం వరకు వుంటుంది. ఈ ఏడాది రూ.600 కోట్ల జీఎంవీ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 80 శాతం చేరుకున్నాం కూడా.

రూ.60 కోట్ల నిధుల సమీకరణ..
ప్రస్తుతం ట్రావెల్ యారీలో 200 మంది ఉద్యోగులున్నారు. ఇటీవలే సిరీస్-బీ రౌండ్‌లో 7 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించాం. గుజరాత్ వెంచర్ ఫైనాన్‌‌స లిమిటెడ్ (జీవీఎఫ్‌ఎల్), బెన్నెట్ కోల్‌మెన్ అండ్ కో లి. (బీసీసీఎల్) మరియు ఇతరులు ఈ పెట్టుబడులు పెట్టారు. వీటితో కలిపి ఇప్పటివరకు రూ.60 కోట్లు నిధులను సమీకరించాం.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement