Abhi Bus
-
రూపాయికే బస్ టికెట్..అయితే ఈ చాన్స్ ఎంతమందికి దక్కుతుందో!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బస్ బుకింగ్ యాప్ అభిబస్ ఫెస్టివ్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా కస్టమర్లు ఒక్క రూపాయికే టికెట్ పొందే అవకాశం ఉంది. అయితే ఎంత మందికి ఈ చాన్స్ దక్కుతుందనేది కంపెనీ ప్రకటించలేదు. అక్టోబర్ 19 నుంచి 25 మధ్య ప్రయాణ తేదీలకు ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ దక్కని వారిలో రోజుకు 100 మంది లక్కీ విన్నర్స్‌కు బస్ టికెట్ వోచర్స్ ఇస్తారు. ఈ ఆఫర్ ప్రైవేట్ బస్‌లు, ఎంపిక చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్ బుకింగ్స్‌కు వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. -
దేశంలోనే అగ్రగామి.. ఏపీఎస్ ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ సడలింపుల అనంతరం ప్రారంభమైన ప్రజా రవాణా సదుపాయాలలో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థగా అగ్రగామిగా నిలిచినట్లు ప్రముఖ ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ అగ్రిగేటర్ అభిబస్ ఒక ప్రకటనలో తెలిపింది. అన్‌లాక్ 0.1 ప్రారంభమైన తర్వాత అంతర్రాష్ట్ర సర్వీసులలో 70 శాతం టికెట్లు బుక్ అయినట్లు సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రోహిత్‌శర్మ వెల్లడించారు. కరోనా మహమ్మారి కంటే ముందు సాధారణ రోజుల్లో ఉన్న టికెట్ బుకింగ్‌ల కంటే ఇది ఎక్కువేనని పేర్కొన్నారు. (ఏపీ నుంచి కర్ణాటకకు బస్సు సర్వీసులు) వివిధ రాష్ట్రాల్లోని రోడ్డు రవాణా సంస్థలపై జరిపిన అధ్యయనంలో ఈ అంశం వెల్లడైనట్లు చెప్పారు. 6090 బస్సులతో 137 నగరాలకు, పట్టణాలకు ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణ సదుపాయం కల్పిస్తోందన్నారు. మరో 1,445 ప్రైవేట్ బస్సులు కూడా ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ నుంచి 596 ఏపీఎస్ఆర్టీసీ బస్సులు, వైజాగ్ నుంచి 383, నెల్లూరు నుంచి 226 అంతర్రాష్ట్ర రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో 1218 బస్సులు 45 నగరాలకు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. ఎక్కువగా ఢిల్లీ–లక్నోల మధ్య నడుస్తున్నట్లు ఆయన చెప్పారు. -
పర్యాటకులకు ‘అభిబస్’ వినూత్న ఆఫర్!
దేశంలో రోజురోజుకు ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ఉల్లిని కొనాలంటే సామాన్య ప్రజలు జంకుతున్నారు. ఉల్లి కొందామని మార్కెట్‌కు వెళ్లినవారికి.. అక్కడి ధరలు చూస్తే చుక్కలు కనబడుతున్నాయి. ఇక కిలో ఉల్లి ధర డబుల్ సెంచరీ దాటడంతో సోషల్ మీడియాలో, టిక్‌టాక్‌లలో ఫన్నీ వీడియోలు, మీమ్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ పర్యాటక సంస్థ అబిబస్.కామ్ వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. తమ వెబ్సైట్ ద్వారా గోవా ట్రిప్ బుక్ చేసుకున్న వారికి 3 కిలోల ఉల్లిని బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో పర్యాటక ప్రీయులంతా ఈ ఆఫర్‌కు ఫిదా అవుతూ గోవా పర్యటనకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే గోవా టూర్‌కు అధిక డబ్బులు వెచ్చించిన వారికి ఆపిల్ ఐ ఫోన్ లేదా ఈ-బైక్‌లను గెలుచుకునే మరో ఆఫర్‌ను కూడా అబిబస్ ప్రకటించింది. అయినప్పటకీ అధిక శాతం వినియోగదారులను బుకింగ్‌లో ఉల్లిపాయ బహుమతినే ఎంచుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది. దీనిపై ఆ సంస్థ సీవోవో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. అత్యధిక వినియోగదారులు గోవా పర్యటనకంటే కూడా ఉల్లిపాయాలకే ప్రాధాన్యత ఇవ్వడం చూసి ఆశ్యర్యపోయానని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో బంగారు ఆభరణాలు, విలువలైన వస్తువుల కంటే ఉల్లికే అధిక డిమాండ్ ఉందని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని అన్నారు. ఈ ఆఫర్‌కు వచ్చిన స్పందన చూస్తే.. తాము వినియోగదారులకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఆఫర్లు అందిస్తున్నామన్న సంతృప్తి కలిగిందని చెప్పారు. తమ నిర్ణయం సరైందనే నమ్మకం వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఆఫర్ ద్వారా ప్రతి రోజు 20 మందిని విజేతలుగా ప్రకటించి.. వారికి 3 కిలోల ఉల్లిని ఇంటికి డెలివరీ చేస్తామని రోహిత్ తెలిపారు. డిసెంబర్ 10న ప్రకటించిన ఈ ఆఫర్‌కు మంచి స్పందన లభించిందని చెప్పారు. పర్యాటక ప్రదేశాల ఎంపికలో.. వెనుకంజలో ఉండే గోవా ఈ ఆఫర్‌తో మొదటి సారిగా రెండవ స్థానంలో నిలిచిందని అన్నారు. డిసెంబర్ 15 వరకు ఉండే ఈ ఆఫర్ కోసం అబిబస్ వెబ్సైట్ ద్వారా గోవా టూర్ బుక్ చేసుకోని పోటీలో నిలువవచ్చని చెప్పారు. -
వ్యూహం ఛేదించిన 'అభీ'మన్యుడు
‘‘బిట్స్ పిలానీలో నువ్వు తప్పకుండా సీట్ తెచ్చుకుంటావనుకున్నా’’.. తండ్రి నిరాశ. తనూ నమ్మాడు ఎలాగైనా పిలానీలో సీట్ కొడ్తానని. ఓన్లీ టూ పర్సెంట్ మార్క్స్‌తో మిస్ అయింది. బాధపడ్డాడు. ఏడ్చాడు. తర్వాత నిర్ణయించుకున్నాడు.. టీ సెట్ రాసి చెన్నైలో ఇంజనీరింగ్ చదవాలని. టెస్ట్ రాశాడు. ర్యాంక్ కొట్టాడు. మంచి మంచి కాలేజ్‌లలో సీట్ వచ్చింది. అలాంటి వాటిల్లో ఒకటే ఆర్.ఎం.కె. ఇంజనీరింగ్ కాలేజ్. అత్యంత క్రమశిక్షణ గల కళాశాల. అబ్బాయి అందులో చేరాడు. తండ్రీ సంతోషించాడు. కాలేజ్ వార్నింగ్ ఇచ్చింది.. జీఈ ఉద్యోగం ఇచ్చింది! రోజూ కాలేజ్‌కి నీట్‌గా షేవ్ చేసుకొని వెళ్లాలి. ఫార్మల్స్ మాత్రమే ధరించాలి. కోఎడ్యుకేషన్ కాలేజ్ అయినా అబ్బాయిలు అమ్మాయిలతో అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడకూడదు! ఇన్ని నియమాలా? బాబోయ్.. అనుకున్నాడు. మూడు నియమాలనూ తప్పాడు. మూడుసార్లు వాళ్ల నాన్నను పిలిపించింది మేనేజ్మెంట్! ‘‘మీ అబ్బాయి చదువులో జెమ్. డిసిప్లినే కొంచెం తక్కువ.. ’’ అంటూ లెక్చరర్స్ సముదాయించారు. ఈసారి చదువు గురించీ కంప్లయింట్ వెళ్లింది. ఇంటర్నల్స్ రాయలేదని. కొన్నాళ్లకు.. క్యాంపస్ సెలెక్షన్స్ జరిగాయి.. ఆ కాలేజ్‌లో ఫస్ట్ ప్లేస్మెంట్ వచ్చింది ఆ అబ్బాయికే! జీఈ (జనరల్ ఎలక్ట్రానిక్స్) సంస్థలో ఉద్యోగం. గుంటూరు దగ్గర్లోని అంకిరెడ్డిపాలెంలో ఆ తండ్రి ఓ రైతు. తన తోబుట్టువుల పిల్లల్లాగే తన కొడుకులూ ఇంజనీరింగ్ చదివి పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేయాలని కోరుకున్నాడు. ఆశ.. నిరాశ.. తర్వాత కొడుకు సాధించిన ఉద్యోగమనే విజయం ఆ తండ్రి ఉప్పొంగిపోయేలా చేసింది. ఆ అబ్బాయి పేరు సుధాకర్ రెడ్డి. తండ్రి పేరు చిర్రా రామలింగారెడ్డి. ఇష్టం లేని ఉద్యోగం... ఇష్టపడ్డ అమ్మాయి! అయితే అప్పుడే ఉద్యోగంలో చేరకూడదనుకున్నాడు సుధాకర్. నలుగురితోపాటు కాకుండా ప్రత్యేకంగా ఉండాలనైతే అనుకున్నాడు. నైన్ టు ఫైవ్ జాబ్స్ కాదు. సమ్‌థింగ్ డిఫరెంట్. క్రియేటివ్‌గా. ఏదో చేయాలనే తపన. అయితే తన కుటుంబ ఆర్థిక పరిస్థితి సుధాకర్‌పై ఉద్యోగం చేయాల్సిన ఒత్తిడిని పెట్టింది. తప్పలేదు. జాబ్‌లో చేరాడు. ఇంకోవైపు అమెరికాలో జాబ్స్ వేట ప్రారంభించాడు. హెచ్1బీ కోసం ప్రయత్నించాడు. వచ్చింది. వెళ్లలేదు. కారణం.. డిఫరెంట్‌గా ఉండాలనే తపనే. అదీగాక కాలేజ్‌లో సస్య అనే క్లాస్‌మేట్‌తో ఉన్న స్నేహం ఫైనలియర్లో ప్రేమగా మారింది. యేడాది గడిచే సరికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు. అప్పుడు తమ విషయం ఇరువైపు పెద్దలకు చెప్పక తప్పలేదు. సహజంగానే ‘నో’ అన్నారు. పిల్లలు ఒప్పించారు. కన్విన్స్ అయిన పెద్దలు వెంటనే వెడ్డింగ్ బెల్స్ మోగించారు. అతను జాబ్... ఆమె ఏంబీఏ చదువు కంటిన్యూ అవుతోంది. భార్య థమ్సప్!! ... నాన్న హ్యాండ్సప్ సుధాకర్ జాబ్ చేస్తున్నాడు కాని.. నచ్చట్లేదు. ఇంకేదో చేయాలి. ఈ క్రమంలో అతను తరచుగా చెన్నై టు గుంటూరు.. తిరుపతి వెళ్లాల్సి వచ్చింది. ట్రైన్లో వెళ్లాలంటే కనీసం పదిహేను రోజుల ముందు టికెట్ రిజర్వ్ చేయించుకుంటే కానీ ప్రయాణం సాఫీగా సాగేది కాదు. ప్రైవేట్ ట్రావెల్స్‌లో ఎప్పుడంటే అప్పుడు టికెట్స్ దొరికేవే కానీ ధరకు డిమాండ్ ఉండేది. ఒక్కోసారి అసలు టికెట్ ధరకన్నా డబుల్ వసూలు చేసేవారు. వీటితో విసిగి పోయాడు సుధాకర్. ఆన్లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్ పెడితే జనాలకు టైమ్ సేవవడమే కాక.. సౌకర్యం కూడా అనుకున్నాడు. భార్య సస్యతో చెప్పాడు. థంబ్ అప్ చూపింది. నాన్నకు చెప్పాడు. నాన్న కంగారు పడ్డాడు. ఎలాగో ఒప్పించి ఆయన దగ్గరే పది లక్షల రూపాయలను అప్పుగా తీసుకొని.. ఉద్యోగానికి రాజీనామా చేసి భార్యా సమేతంగా హైదరాబాద్‌కు మకాం మార్చాడు. పోర్టల్ స్టార్ట్ అయింది... ఘోరంగా ఫెయిలైంది ఇంకో ఫ్రెండ్ దగ్గరా అయిదు లక్షల రూపాయలు తీసుకొని మొత్తం పదిహేను లక్షల రూపాయలతో ‘అభిబస్’ పోర్టల్‌ను స్టార్ట్ చేశాడు.. చిన్న గదిని అద్దెకు తీసుకొని. అందులో టాయ్‌లెట్ కూడా లేదు. తను టికెట్లు అమ్మాలంటే ట్రావెల్ ఆపరేటర్స్ తనకు ఎన్నో కొన్ని టికెట్స్ ఇవ్వాలి కదా. ఎంతో మంది ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్స్‌ని కలిశాడు. ఒక ట్రావెల్స్ ఆఫీస్ ముందు రెండు నెలలు ఉదయం ఎనిమిది నుంచి రాత్రి తొమ్మిది వరకు పడిగాపులు కాస్తే నాలుగు టికెట్లు ఇచ్చాడు. అంత కష్టపడి తెచ్చుకుంటే ఒక్క సీటు కూడా అమ్మలేకపోయాడు. ఫెయిల్యూర్.. ఘోరమైన ఫెయిల్యూర్! కానీ వెనక్కు తగ్గలేదు. గుడ్డిగా వేసిన ఆ అడుగు తప్పు. అంతేకాని వ్యాపారం అనే ఆలోచన తప్పు కాదు. సరిదిద్దుకోవాలి అనుకున్నాడు. అప్పటికే ఓ బస్... అయినా అభీబస్ తన దగ్గర సాఫ్ట్వేర్ ఉంది సరే.. ఆపరేటర్స్ దగ్గర కూడా ఉండాలి కదా. ఏ పూచీ మీద టికెట్లు ఇస్తాడు తనకు ఏ ఆపరేటరైనా? రెండు విషయాలు తెలిశాయి. ట్రావెల్స్ ఆపరేటర్స్ కోసం సాఫ్ట్వేర్ తయారు చేయించాడు. వాటి గురించి ఆపరేటర్స్‌కు చెప్పి.. వాళ్లను కన్విన్స్ చేయగలిగాడు. ఆ సాఫ్ట్‌వేర్‌ను లీజ్‌గా ఇచ్చాడు. ఈసారి ఈజీగా టికెట్లు అమ్మడయ్యాయి. ఈ విషయం ఇంకో నలుగురు.. ఆ నలుగురు ఇంకో పది మంది ట్రావెల్స్ ఆపరేటర్‌కు తెలిసి డిమాండ్ పెరిగింది. అన్ని ట్రావెల్స్‌ను ఎకామిడేట్ చేసే శక్తి సరిపోక సర్వర్క్రాష్ అయింది. సంతోషించాలో ఏడ్వాలో తెలియని స్థితి. సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి మూడుకోట్లు కావాల్సి వచ్చాయి. ఎవరిస్తారు? సుధాకర్ రెడ్డి సామర్థ్యం మీద ఉన్న నమ్మకంతో ఆపరేటర్సే ముందుకు వచ్చారు. అభీబస్ డాట్ కామ్ అప్టేడ్ అయింది. ప్రైవేట్ ట్రావెల్సే కాదు ఏపీఎస్ఆర్టీసీ, యూపీ, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, టీఎస్ఆర్టీసీ మొదలు దేశం నలుమూలల 350 ట్రావెల్స్ అభిబస్ డాట్ కామ్‌లో చేరాయి. ఈ పదేళ్లలో అభిబస్ ప్రయాణం ఇది. సుధాకర్ రెడ్డి విజయం అది. అతను తన అభిబస్‌ను మొదలుపెట్టేటప్పటికే ఇంకో బస్ ఉంది. అయినా సొంత సాఫ్ట్వేర్ ఫార్మూలా ఉన్నది అభిబస్కే. అంతేకాదు అతిపెద్ద ట్రావెల్ పోర్టల్ కూడా ఇదే. కొట్టేద్దాం అని రావద్దు ఈ జర్నీ అంత సులువుగా సాగలేదు. సాగదు కూడా. తొలిరోజుల్లో రోజుకు పదహారు గంటలు పనిచేసేవాడిని. నెలలో 25 రోజులు ప్రయాణాల్లోనే గడిచిపోయేవి. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఈ బిజినెస్‌లోకి గొప్ప విజన్‌తో ఏమీ రాలేదు. నేను జర్నీ చేస్తున్నప్పుడు టికెట్స్, రిజర్వేషన్ విషయంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. వాటిని సాల్వ్ చేయాలనే ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను అంతే. నా ప్రోగ్రెస్ అంతా ప్రాబ్లమ్స్.. సొల్యూషన్స్.. ఈ లెర్నింగ్‌తోనే సాగింది.. సాగుతోంది కూడా. అంతకుముందు మా ఊళ్లో నా గురించి.. ఏదో ఇంటర్నెట్ కొట్టు పెట్టుకున్నాడట అనుకున్నవాళ్లు ఈ రోజు నన్ను చాలా గౌరవంగా చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ మా నాన్న కంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఈ మధ్య చాలామంది యూత్ అంట్రప్రెన్యూర్స్ కావాలనుకుంటున్నారు. మంచిదే. కాని మొదలుపెట్టగానే సక్సెస్ వస్తుంది అనే ఆలోచనతో రావద్దు. అపజయాల రహదారిలో గమ్యాన్ని చేరుకోవాల్సి ఉంటుందనే సంసిద్ధతతో రావాలి. సగటు రోజువారీ దిన చర్య గమనిస్తే.. అతని అవసరాలు ఏముంటాయో తెలుస్తుంది. వాటిని తీర్చగలిగే.. లేదంటే పరిష్కారాలు ఇవ్వగలిగే బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలు.. విజయం ఖాయం. స్విగ్గీ, బుక్ మై షో.. లాంటివన్నీ అవే’’ అంటాడు సుధాకర్‌రెడ్డి చిర్రా, అభిబస్ డాట్ కామ్ సీఈవో. – సరస్వతి రమ -
హ్యాపీ సవారీ.. ట్రావెల్ యారీ!
• ఆన్లైన్లో బస్ టికెట్ల బుకింగ్, బస్ ఆపరేట్లకు టెక్నాలజీ సేవలు • దేశంలోని 55 శాతం బస్ ఆపరేటర్లు ట్రావెల్ యారీ కస్టమర్లే • 8 వేల మంది ఆపరేటర్ల నమోదు; రోజుకు 1.5 లక్షల టికెట్ల బుకింగ్స • ప్రభుత్వ రవాణా సంస్థలకు టెక్నాలజీ సేవలు • గతేడాది రూ.450 కోట్ల జీఎంవీ; రూ.30 కోట్ల ఆదాయం • ‘స్టార్టప్ డైరీ’తో ట్రావెల్ యారీ కో-ఫౌండర్ అరవింద్ లామా... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బస్ ప్రయాణమంటే ముందుగా ఆలోచించేది సీటు దొరుకుతుందో లేదో అని! అందుకే మనలో చాలా మంది ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకొని ప్రయాణిస్తుంటారు. ఇందుకోసం దేశంలో మేక్ మై ట్రిప్, రెడ్ బస్, అభి బస్ వంటి ఎన్నో సంస్థలున్నారుు. ట్రావెల్ యారీ కూడా అలాంటి సంస్థే. అరుుతే దీని ప్రత్యేకత ఏమిటంటే... పైన చెప్పిన ఇతర సంస్థలు టికెట్లను బుక్ చేసేది ట్రావెల్ యారీ టెక్నాలజీ ద్వారానే! అంటే సంస్థ అభివృద్ధి చేసిన మన్‌టిస్ టెక్నాలజీ ఆధారంగా!! పంజాబ్, యూపీ, హిమాచల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ రవాణా సంస్థలు కూడా టికెట్ల బుకింగ్ కోసం మన్టిస్నే వినియోగిస్తున్నాయండోయ్. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశంలో జరిగే 55 శాతం బస్ టికెట్ల బుకింగ్ మన్‌టిస్ నుంచి జరుగుతున్నదే. టెక్నాలజీ వివరాలు, సంస్థ సేవల గురించి ట్రావెల్ యారీ.కామ్ కో-ఫౌండర్, సీఈఓ అరవింద్ లామా ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. టెక్నాలజీ ద్వారా సామాన్యుల కష్టాలకు పరిష్కారం చూపించాలనేది నా లక్ష్యం. అందుకే పేరు మోసిన టెకీ కంపెనీలో పనిచేశా.. నా ఆలోచనెప్పుడూ ప్రజల వైపే సాగేది. ఆ సమయంలో దేశంలో ఆన్లైన్లో బస్ టికెట్ల బుకింగ్ విధానం అసంఘటితంగా ఉందని తెలిసి.. రెండున్నర లక్షల పెట్టుబడితో మరో మిత్రుడు ప్రతీక్ నిగంతో కలిసి 2007లో ట్రావెల్ యారీ.కామ్‌ను ప్రారంభించా. టెక్నాలజీ సేవలు.. ట్రావెల్ యారీ టికెట్ల బుకింగ్ పాటూ ఇతర బస్ ఆపరేటర్లకు, ఆన్లైన్ సంస్థలకు, ప్రభుత్వ రవాణా సంస్థలకు టికెట్ల బుకింగ్ కోసం టెక్నాలజీ సేవలను కూడా అందిస్తుంది. దేశంలో ఆన్లైన్ ద్వారా 55 శాతం బస్ టికెట్ల బుకింగ్ మా టెక్నాలజీ అరుున మన్‌టిస్ ఆధారంగానే బుక్ అవుతున్నవే. ఆన్లైన్లో మేక్ మై ట్రిప్, రెడ్ బస్ వంటి కంపెనీలతో పాటూ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ రవాణా సంస్థలు కూడా మన్‌టిస్ టెక్నాలజీని ద్వారానే టికెట్లను జారీ చేస్తున్నారుు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రవాణా సంస్థలతోనూ చర్చిస్తున్నాం. రోజుకు 1.5 లక్షల టికెట్లు.. ప్రస్తుతం ట్రావెల్ యారీలో 8 వేల మంది బస్ ఆపరేటర్లు, ఏజెంట్లు నమోదయ్యారు. అన్ని చానల్ పార్టనర్స్ నుంచి కలిపి రోజుకు 1.5 లక్షల టికెట్లు బుక్ అవుతున్నారుు. బస్ టికెట్ల బుకింగ్‌తో పాటూ హోటల్ గదులను బుకింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఓయో, రూమ్ టు నైట్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఇటీవలే కస్టమర్ల సౌలభ్యం కోసం మొబైల్ వ్యాలెట్, క్యాష్‌బ్యాక్ రారుుతీలను ఉపయోగించుకునేందుకు వీలుగా పేటీఎం, రిలయెన్‌స జియోతో ఒప్పందం కుదుర్చుకున్నాం. హైదరాబాద్ వాటా 5 శాతం.. మా భాగస్వామ్య సంస్థలకు సంబంధించి గతేడాది రూ.450 కోట్ల గ్రాస్ మర్చంటైజ్ వాల్యూ (జీఎంవీ) వ్యాపారం జరిగింది. ఇందులో రూ.30 కోట్లు మా ఆదాయం. ఇదే మా టర్నోవర్. ఇందులో దక్షిణాది వాటా 60 శాతం. హైదరాబాద్ వాటా 5 శాతం వరకు వుంటుంది. ఈ ఏడాది రూ.600 కోట్ల జీఎంవీ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 80 శాతం చేరుకున్నాం కూడా. రూ.60 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం ట్రావెల్ యారీలో 200 మంది ఉద్యోగులున్నారు. ఇటీవలే సిరీస్-బీ రౌండ్లో 7 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించాం. గుజరాత్ వెంచర్ ఫైనాన్స లిమిటెడ్ (జీవీఎఫ్ఎల్), బెన్నెట్ కోల్మెన్ అండ్ కో లి. (బీసీసీఎల్) మరియు ఇతరులు ఈ పెట్టుబడులు పెట్టారు. వీటితో కలిపి ఇప్పటివరకు రూ.60 కోట్లు నిధులను సమీకరించాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
రోజుకు 50 వేల బస్ టికెట్లు
అభిబస్ ఫౌండర్ సీఈవో సుధాకర్ రెడ్డి చిర్రా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేవలం రూ.10 లక్షల పెట్టుబడితో 2007లో ప్రారంభమై రూ.200 కోట్ల కంపెనీగా ఎదగడమే కాకండా దేశీయ ఆన్లైన్ బస్‌టికెట్ వ్యాపారంలో రెడ్‌బస్ తర్వాత రెండో అతిపెద్ద సంస్థగా అభిబస్ ఎదిగింది. ఏటా 50 శాతం వృద్ధితో వేగంగా విస్తరిస్తున్న ఆన్లైన్ టికెట్ల వ్యాపారంపై ప్రైవేటు ఈక్విటీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. రెండేళ్లలో రోజుకు 50,000 టికెట్లు విక్రయిస్తామంటున్న అభిబస్ ఫౌండర్ సీఈవో సుధాకర్ రెడ్డి చిర్రాతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. ఏపీఎస్ఆర్టీసీ టికెట్లను విక్రయించే విధంగా ఈ మధ్యనే కుదుర్చుకున్న ఒప్పందం మీ ఆదాయంపై ఏ విధంగా ప్రభావం చూపనుంది? ఆన్లైన్లో టికెట్ల రిజర్వేషన్లకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ తొలిసారిగా బయట సంస్థకు అవకాశం ఇచ్చింది. రోజుకు ఏడువేలకు పైగా సర్వీసులు, రోజుకు 2.5 లక్షల టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఈ ఏడాది నుంచి వ్యాపారం బాగా పెరుగుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం రోజుకు 10,000 టికెట్లను విక్రయిస్తుండగా ఈ ఒప్పందం వలన వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్య 50,000 దాటుతుందని అంచనా వేస్తున్నాం. ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ టికెట్లకు సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను నిర్వహిస్తున్న మీకు రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల ఆర్టీసీని మీరే నిర్వహిస్తారా? నిర్వహణా వ్యయం ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ఇంకా కార్పొరేషన్‌ను చట్ట ప్రకారం విడదీయాల్సి ఉంది. విడిపోయిన తర్వాత కూడా రెండు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలకు ఆన్లైన్ టికెటింగ్ సాఫ్ట్‌వేర్‌ను అభిబసే అందిస్తుంది. పదేళ్ల పాటు సర్వీసు అందించే విధంగా ఒప్పందం కుదిరింది. కాని ఇలా రెండు రాష్ట్రాలకు ప్రత్యేక వైబ్సైట్లను నిర్వహించడం వల్ల 40 శాతం వ్యయం పెరుగుతుంది. ఈ ఖర్చును కూడా కార్పొరేషనే భరిస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ, తమిళనాడు ఆర్టీసీలతో పాటు 150కిపైగా ప్రైవేటు ఆపరేటర్లకు అభిబస్ సాఫ్ట్‌వేర్‌ను అందిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత పట్టణాల మధ్య తిరిగే ప్రయాణికుల్లో ఏమైనా హెచ్చు తగ్గులను గమనించారా? ఒక్క విజయవాడ, గుంటూరు తప్ప మిగిలిన పట్టణాల మధ్య రోజువారి ప్రయాణికుల సంఖ్యలో చెప్పుకోదగ్గ సంఖ్యలో మార్పులు లేవు. కాని హైదరాబాద్ నుంచి ఈ రెండు పట్టణాలకు ప్రయాణించే రోజు వారి సంఖ్యలో మాత్రం గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. ఈ డిమాండ్ మరో మూడు నాలుగేళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నాం. దీనికి తోడు రైల్వే టిక్కెట్ల ధరలు పెరగడం కూడా బస్సు ప్రయాణికుల సంఖ్యను పెంచుతుందని భావిస్తున్నాం. పాలెం బస్సు దుర్ఘటన తర్వాత ప్రయాణికుల ఆలోచనల్లో ఏమైనా మార్పులు కనిపించాయా? ప్రైవేటు ఆపరేటర్ల ఆన్లైన్ రిజర్వేషన్ల మార్గదర్శకాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఆ సంఘటన జరిగిన తర్వాత ప్రైవేటు ఆపరేటర్లపై ప్రభావం బాగా కనిపించినప్పటికీ, ఇప్పుడు పరిస్థితులు సద్దుమణిగాయి. దీని తర్వాత ప్రయాణికులు బాగా పేరొందిన ప్రైవేటు ఆపరేటర్ల బస్సుల్లో ప్రయాణించడానికే ఇష్టపడుతున్నారు. ప్రైవేటు ఆపరేటర్ల ఆన్లైన్ రిజర్వేషన్లకు సంబంధించి చట్టంలో సరైన నిబంధనలు లేవు. దీనిపై ఇప్పటికే గత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. త్వరలోనే కొత్త ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లే ప్రయత్నంలో ఆపరేటర్లను ఉన్నారు. దేశీయంగా బస్సు టిక్కెట్ల వ్యాపార పరిమాణం, వృద్ధి ఏ విధంగా ఉంది? దేశ వ్యాప్తంగా ఏటా రూ.40,000 కోట్ల టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఇందులో ప్రైవేటు బస్సుల వ్యాపార పరిమాణం రూ.15,000 కోట్లుగా ఉంటే, ఆర్టీసీల వాటా రూ.25,000 కోట్లుగా ఉంది. గత కొంతకాలంగా ప్రైవేటు బస్సు టికెట్ల వ్యాపారం స్థిరంగా ఉంది. కాని ఇదే సమయంలో ఆన్లైన్ ద్వారా టికెట్ల బుకింగ్‌లో మాత్రం ఏటా 50 శాతం వృద్ధి నమోదవుతోంది. మొత్తం టికెట్ల విక్రయాల్లో ప్రస్తుతం 15 శాతంగా ఉన్న ఆన్లైన్ టికెట్ల వ్యాపారం ఈ ఏడాది 25 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం అభిబస్ వ్యాపార పరిమాణం, వృద్ధి గురించి వివరిస్తారా? గతేడాది వరకు ప్రధానంగా ఆన్లైన్ టికెటింగ్ సాఫ్ట్వేర్ వ్యాపారంపైనే దృష్టిపెట్టాం. ఇప్పుడు నేరుగా ఆన్లైన్ టికెట్లను కూడా విక్రయిస్తున్నాం. గతేడాది రూ.165 కోట్ల వ్యాపారం నమోదు చేశాం. ఈ ఏడాది రూ.280 కోట్లకు వచ్చే ఐదేళ్లలో రూ.2,000 కోట్లకు చేర్చాలన్నది లక్ష్యం. అభిబస్ అనగానే ఇప్పటికే చౌక టికెట్లను ఇచ్చే డీల్స్ సైట్‌గా పేరొచ్చింది. ఏటా 150 రోజులు తక్కువ కాకుండా చౌక రేట్లను ఆఫర్లు చేసే విధంగా రూపొందించుకుంటున్నాం. ఆన్లైన్ పోర్టల్స్, ఈ-కామర్స్ రంగాల్లో పెట్టుబడులు చేయడానికి పీఈ, వీసీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నట్లే అభిబస్‌లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఎవరైనా ముందుకొస్తున్నారా? వచ్చే రెండేళ్ల వ్యాపార విస్తరణకు రూ.50 కోట్ల నిధులను సమీకరిస్తున్నాము. ఇందుకోసం కొటక్ బ్యాంక్‌ను ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌గా నియమించుకున్నాం. నాలుగు ప్రైవేటు ఈక్విటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నాం. ఏ సంస్థ నుంచి పెట్టుబడి వస్తుందన్నది ఆగస్టు నెలాఖరుకు స్పష్టత వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కంపెనీ విలువను రూ200 కోట్లుగా మదింపు చేసింది.