న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చే పట్టణాల్లో హోటల్ సేవలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. దీంతో ఆన్‌లైన్ ట్రావెల్, హోటల్ బుకింగ్ సేవలు అందించే సంస్థలు డిమాండ్‌ను చేరుకునే వ్యూహాలపై దృష్టి సారించాయి. హోటల్ బుకింగ్ సేవల సంస్థ ఓయో ఈ పట్టణాల్లో 500 హోటళ్లను అదనంగా తన నెట్‌వర్క్ కిందకు తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఈ పట్టణాల్లో మ్యాచ్‌లను చూసేందుకు వచ్చే వీక్షకుల నుంచి హోటల్ బుకింగ్‌కు డిమాండ్ ఉంటుందన్న అంచనాలతో, వచ్చే మూడు నెలల్లో కొత్త హోటళ్లను చేర్చుకోనున్నట్టు తెలిపింది.
కొత్త హోటళ్లు స్టేడియంలకు దగ్గర్లో ఉండేలా చూస్తామని, దాంతో క్రికెట్ అభిమానులు స్టేడియంలు చేరుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఓయో అధికార ప్రతినిధి ప్రకటించారు. సుదూర ప్రాంతాల నుంచి తమ అభిమాన జట్ల ఆటను చూసేందుకు వచ్చే వారికి సౌకర్యవంతమైన, అందుబాటు ధరలకు ఆతిథ్యం అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ పోటీలు మొదలు కానున్నాయి. దీనికి మూడు నెలల ముందుగానే ఆతిథ్య పట్టణాల్లో హోటళ్ల టారిఫ్‌లు (రూమ్ చార్జీలు) అధిక డిమాండ్ కారణంగా పెరిగినట్టు ఓయో తెలిపింది. నవంబర్ 19తో వన్డే ప్రపంచకప్ ఛాంపియన్íÙప్ ముగుస్తుంది. హైదరాబాద్, అహ్మ దాబాద్, ఢిల్లీ, ధర్మశాల, చెన్నై, లక్నో, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, పుణెలో మ్యాచ్‌లు జరగనున్నా యి ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది.
మేక్ మైట్రిప్ ఆఫర్..
ఆన్‌లైన్ ట్రావెల్ సేవలు అందించే మేక్ మై ట్రిప్ కూడా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆతిథ్య పట్టణ వాసులు తమ ప్రాపరీ్టలను తన ప్లాట్‌ఫామ్‌పై నమోదు చేసుకోవాలని కోరింది. అహ్మదాబాద్, ధర్మశాల, కీలక మెట్రోల్లో గృహ ఆతిథ్యాలకు డిమాండ్ పెరిగినట్టు ఈ సంస్థ ప్రకటించింది. ‘‘దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పట్టణాల్లో అక్టోబర్, నవంబర్ నెలల్లో గృహ ఆతిథ్యానికి డిమాండ్ గణనీయంగా పెరగడాన్ని గుర్తించా. క్రికెట్ అభిమానులు ఇంతకుముందు లేనంతగా గృహ ఆతిథ్యానికి ప్రాధాన్యం ఇస్తుండడం మంచి సంకేతం’’అని మేక్‌మై ట్రిప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పరీక్షిత్ చౌదరి తెలిపారు. క్రికెట్ స్టేడియం నుంచి వసతి ఎంత దూరంలో ఉందో చూపించే సదుపాయాన్ని తన ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసినట్టు చెప్పారు. అభిమానులకు అనుకూలమైన వసతిని బుక్ చేసుకోవడానికి వీలుంటుందన్నారు. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే పట్టణాల్లో అందుబాటు ధరలకే గృహవసతి అందుబాటులో ఉన్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment