Premium Hotel Occupancy In India Expected To Reach Decadal High Of Up To 72 Percent - Sakshi
Sakshi News home page

ప్రీమియం హోటళ్లలో జోరుగా బుకింగ్‌లు

Published Sat, Jul 22 2023 4:39 AM | Last Updated on Sat, Jul 22 2023 3:30 PM

Premium Hotel Occupancy In India Expected To Reach Decadal High Of Up To 72percent - Sakshi

న్యూఢిల్లీ: ప్రీమియం హోటళ్లలో బుకింగ్‌లకు మంచి డిమాండ్‌ కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) అక్యుపెన్సీ రేషియో (భర్తీ రేటు) దశాబ్దం గరిష్ట స్థాయి అయిన 70–72 శాతానికి చేరుకుంటుందని, సగటు రూమ్‌ రేటు రూ.6,000–6,200 మధ్య ఉండొచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆక్యుపెన్సీ రేటు 68–70 శాతం మధ్య ఉంది. ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్నప్పటికీ, వినియోగ సెంటిమెంట్‌ స్థిరంగా మెరుగుపడుతున్నట్టు తెలిపింది.

కార్పొరేట్‌ల స్థిరమైన పనితీరు, దేశీ ప్రయాణికుల రద్దీ కరోనా ముందు నాటి స్థాయిని అధిగమించడం రవాణా, హోటల్‌ పరిశ్రమలకు డిమాండ్‌ను తీసుకొస్తున్నట్టు వివరించింది. ఈ మేరకు ఇక్రా ఓ నివేదికను విడుదల చేసింది. భారత హోటల్‌ పరిశ్రమ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13–15 శాతం వృద్ధిని చూస్తుందని అంచనా వేసింది. ఒక రూమ్‌ నుంచి వచ్చే సగటు ఆదాయం ఇప్పటికీ 2007–08 నాటి గరిష్ట స్థాయితో పోలిస్తే 20–25 శాతం తక్కువగా ఉంటుందని పేర్కొంది.  

ఢిల్లీ, ముంబైలో ఎక్కువ డిమాండ్‌
ఢిల్లీ, ముంబై పట్టికలో ఎగువ భాగాన ఉన్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇక్కడి హోటళ్లలో ఆక్యుపెన్సీ రేషియో 75 శాతంగా ఉటుందని ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌ వినుత ఎస్‌ తెలిపారు. ఇతర అన్ని పట్టణాల్లోనూ డిమాండ్‌ ఆరోగ్యకరంగా ఉంటుందని, బెంగళూరు, పుణెలో మాత్రం బలహీనంగా ఉండొచ్చన్నారు. ముఖ్యంగా జీ20 సమావేశాలు ఉండడం, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడంతో వ్యాపార సమావేశాల ఫలితంగా పట్టణాల్లో హోటళ్లకు డిమాండ్‌ ఉంటుందని ఇక్రా పేర్కొంది.

అలాగే విహార యాత్రలు, సదస్సులు, ఎగ్జిబిషన్‌లు, వ్యాపార ప్రయాణాలు, విదేశీ ప్రయాణికుల రాక డిమాండ్‌కు సానుకూలిస్తాయని వివరించింది. మధ్యస్థాయి హోటళ్లలోనూ భర్తీ రేటు పుంజుకుంటున్నట్టు తెలిపింది. వీటిల్లోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన రేటు నమోదు కావచ్చని అంచనా వేసింది. డిమాండ్‌ పుంజుకోవడంతో గత 12–15 నెలల్లో వాయిదా పడిన ప్రాజెక్టులను ప్రారంభించడం, కొత్త ప్రాజెక్టుల ప్రారంభం ఉండొచ్చని పేర్కొంది.

ప్రీమియం విభాగంలో కొత్త హోటళ్ల ప్రారంభం ఎంపిక చేసిన మార్కెట్లలోనే ఉండొచ్చని తెలిపింది. కొత్తగా రానున్న హోటళ్లలో ఎక్కువగా బెంగళూరు, ముంబై మార్కెట్ల నుంచే ఉంటాయని వెల్లడించింది. ‘‘కొత్త హోటల్‌ వసతుల సరఫరా ఏటా 3.5–4 శాతం కాంపౌండెడ్‌ వృద్ధి రేటు ప్రకారం ఉండొచ్చు. ప్రీమియం విభాగంలో దేశవ్యాప్తంగా 15,000–16,000 రూమ్‌ల లభ్యత పెరుగుతుంది’’అని ఇక్రా వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement