నెక్ట్స్ 500 జాబితాలో మేక్‌మైట్రిప్, ఆర్‌బీఎల్ బ్యాంకులకు చోటు
న్యూఢిల్లీ : ఫార్చూన్ ఇండియా నెక్స్ట్ 500 జాబితాలో ఐఆర్‌సీటీసీ సహా మేక్‌మైట్రిప్, ఆర్‌బీఎల్ బ్యాంక్, ఐనాక్స్ విండ్ తదితర సంస్థలు చోటు దక్కించుకున్నాయి. రాబోయే రోజుల్లో ఇండియా 500 లిస్టులో చోటు దక్కించుకోగలిగే సత్తా ఉన్న మధ్య స్థాయి కంపెనీలతో ఫార్చూన్ మ్యాగజైన్ ఈ జాబితాను రూపొందించింది. సుమారు రూ. 1,690 కోట్ల వార్షిక ఆదాయాలతో ఐఫోన్ల పంపిణీ సంస్థ రెడింగ్టన్ ఇండియా ఈ లిస్టులో టాప్‌లో నిల్చింది. ఐనాక్స్ విండ్(రూ.1,689 కోట్ల ఆదాయం), ఐఎస్‌ఎంటీ (రూ.1,685 కోట్లు), ఎమ్‌క్యూర్ ఫార్మా(రూ. 1,683.5 కోట్లు), ఓరియంట్‌క్రాఫ్ట్ (రూ.1,683 కోట్లు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. లిస్టింగ్ సన్నాహాల్లో ఉన్న ఆర్‌బీఎల్ బ్యాంక్(గతంలో రత్నాకర్ బ్యాంక్) 31వ స్థానంలో, ఆన్‌లైన్ ట్రావెల్ సంస్థ మేక్‌మైట్రిప్ 122వ స్థానం, భారతీయ రైల్వే టూరిజం, కేటరింగ్ విభాగం ఐఆర్‌సీటీసీ 328వ స్థానంలో ని ల్చాయి. మొత్తం 500 కంపెనీల్లో 434 సంస్థలు ప్రైవేటువి కాగా, 31 సంస్థలు ప్రభుత్వ రంగంలోనివి.
ఫార్చూన్ ఇండియా లిస్టులో ఐఆర్‌సీటీసీ
Published Fri, Jul 10 2015 12:20 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM
Advertisement
Advertisement