maldieves
-
భారత్‌కు మాల్దీవుల మంత్రి.. కారణం అదేనా?
ఢిల్లీ: భారత్, మాల్దీవుల మధ్య దౌత్యపరంగా విబేధాలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ భారత పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.వివరాల ప్రకారం.. గురువారం(మే 9వ తేదీన) భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మూసా జమీర్ ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా భారత్, మాల్దీవుల మధ్య కీలక సమావేశం జరగనుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు ప్రాంతీయపరమైన అంశాలను చర్చించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌కు మాల్దీవులు కీలక భాగస్వామి. జమీర్ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం అందిస్తుందని భావిస్తున్నట్టు స్పష్టం చేసింది.ఇక, మాల్దీవుల నుంచి భారత బలగాలను వెనక్కి తీసుకోవాలని ఆ దేశ అధ్యక్షుడు మయిజ్జు కోరిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను మే 10వ తేదీ వరకు గడువు విధించారు. ఈ నేపథ్యంలో మే 9వ తేదీన జరిగే సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి భేటీలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక, మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులు ఇప్పటికే చాలా మంది వెనక్కి వచ్చేశారు.ఇదిలా ఉండగా.. మాల్దీవులకు మయిజ్జు అధ్యక్షుడైన తర్వాత భారత్‌కు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రాగన్ కంట్రీ చైనాకు మద్దతు పలికారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ కూడా మాల్దీవులకు కౌంటరిచ్చే విధంగా లక్షద్వీప్‌కు సపోర్టు చేశారు. దీంతో, మాల్దీవులకు భారత పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీని ప్రభావం మాల్దీవుల ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావితం చూపించింది. -
మాల్దీవుల బాయ్‌కాట్‌కు పిలుపు
భారత్‌పై తీవ్రంగా స్పందించిన మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(కాయిట్) కీలక నిర్ణయం ప్రకటించింది. మాల్దీవ్స్–ఇండియా మధ్య ఇటీవల నెలకొన్న సంఘటనల నేపథ్యంలో ఆ దేశంతో భారత్ వాణిజ్యం తగ్గించుకోవాలని ట్రేడర్ల అసోసియేషన్ కాయిట్ పిలుపిచ్చింది. భారతప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్లు సహించబోమని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. ఇందుకు నిరసనగా మాల్దీవ్స్‌ను బాయ్‌కాట్ చేయాలని బిజినెస్ వర్గాలను కోరారు. ఆ దేశానికి బలమైన మెసేజ్ పంపాలంటే బిజినెస్ కమ్యూనిటీ కలిసి ఉండాలని ఖండేల్వాల్ అన్నారు. ఇరు దేశాలు ఒకరినొకరు గౌరవించుకోవాలని చెప్పారు. మరోవైపు ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) కూడా మాల్దీవ్స్‌ను ప్రమోట్ చేయొద్దని ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లను కోరింది. ఇదీ చదవండి: రూ.45 వేలకోట్లతో రివర్‌క్రూజ్ టూరిజం.. ఏం చేస్తారో తెలుసా.. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల లక్ష్యదీప్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన పోస్ట్ చేసిన వీడియోపై మాల్దీవులు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ దేశ ప్రభుత్వం వారిపై వేటు వేసింది. ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. -
విజయ్ దేవరకొండ హీరోయిన్.. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్!
బాలీవుడ్ భామ అనన్య పాండే బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. లైగర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. తాజాగా ఈ ముంబై ముద్దుగుమ్మ తన 25వ పుట్టినరోజును జరుపుకుంటోంది. తన బర్త్ డే వేడుకల కోసం మాల్దీవులకు చెక్కేసింది భామ. అంతే కాకుండా వేడుకలకు భాయ్ ఫ్రెండ్‌తో కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఒకరోజు ముందే ఆమె ప్రియుడు ఆదిత్య రాయ్ కపూర్ ముంబై విమానాశ్రయంలో వెళ్తూ కెమెరాలకు చిక్కారు. దీంతో ఇద్దరు కలిసి బర్త్ డే వేడుకల కోసం మాల్దీవుస్కు వెళ్లినట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాజాగా ఈ బర్త్ డే భామ మాల్దీవుల్లో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ది ఫర్ఫెక్ట్ హ్యాపీ బర్త్ డే మార్నింగ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అయితే గతంలో ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి చాలాసార్లు వార్తల్లో నిలిచింది. ఆదిత్య రాయ్ కపూర్‌తో కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే! ఓ బ్రిడ్జిపై వీరిద్దరూ హగ్ చేసుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఈ లవ్ బర్డ్స్ షికారుకు వెళ్లగా.. ప్రియుడు ఆదిత్య కారు నడుపుతుంటే అనన్య అతడి పక్కనే కూర్చుని కనిపించింది. కాగా.. ఈ ఏడాది అనన్య పాండే.. డ్రీమ్ గర్ల్-2 చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా సరసన నటించింది. చుంకీ పాండే స్పెషల్ విషెస్ అనన్య పాండే పుట్టిన రోజు సందర్భంగా ఆమె తండ్రి చుంకీ పాండే ఎమోషనల్ పోస్ట్ చేశారు. అనన్య త్రోబ్యాక్ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనన్యతో దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ "హ్యాపీ హ్యాపీ హ్యాపీ సిల్వర్ జూబ్లీ మై డార్లింగ్.. లవ్ యు ఫరెవర్" అనే క్యాప్షన్‌తో తన ప్రేమను చాటుకున్నారు. కాగా.. ఆమె తండ్రి చుంకీ పాండే మూడు దశాబ్దాల కెరీర్లో 100కు పైగా సినిమాల్లో నటించాడు. View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) -
చావు నుంచి త్రుటిలో తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్
ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రెవిస్ హెడ్, అతని భార్య జెస్సికా డేవిస్ తృటిలో చావు నుంచి తప్పించుకున్నారు. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో చావు అంచుల దాకా వెళ్లి వచ్చారు. కాగా ట్రెవిస్ హెడ్ భార్య ఆరు నెలల గర్భవతి. హాలిడే వెకేషన్‌ను ఎంజాయ్ చేయడానికి ట్రెవిస్ హెడ్.. జెస్సీకా డేవిస్‌తో కలిసి మాల్దీవ్స్ వెళ్లాడు. అక్కడ సరదాగా గడిపిన వీరిద్దరు ఆదివారం ఆస్ట్రేలియాకు తిరుగుపయనమయ్యారు. ఇంకో 45 నిమిషాల్లో గమనం చేరుకుంటుదన్న దశలో ఫ్లైట్‌లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో పైలెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని భావించాడు. అయితే మొదటి ప్రయత్నంలో ఫ్లైట్‌ను ల్యాండింగ్ చేయడంలో విఫలమయ్యాడు. రెండో ప్రయత్నంలో ల్యాండింగ్ చేసినప్పటికీ స్లిడ్ అయిన ఫ్లైట్ పక్కనున్న పొదల్లోకి వెళ్లిపోయింది. అయితే పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని ట్రెవిస్ హెడ్ భార్య జెస్సీకా డేవిస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ''హాలిడే వెకేషన్‌ను సరదాగా గడిపాం. ఆస్ట్రేలియాకు తిరుగపయనమవ్వడానికి మాల్దీవ్స్‌లో ఫ్లైట్ ఎక్కాం. గంట ప్రయాణంలో 30 నిమిషాలు పూర్తైన తర్వాత సాంకేతిక లోపం తలెత్తింది. దేవుని దయవల్ల మాకు ఏం కాలేదు. నా బిడ్డ ఈ లోకాన్ని చూడకుండానే చనిపోతానేమోనని అనిపించింది. ఆ తర్వాత నాలుగు గంటల పాటు రెస్క్యూ ప్లేన్ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత మాల్దీవ్స్ రాజధాని మాలీలో మాకు వసతి ఏర్పాటు చేసి మరో ఫ్లైట్‌లో ఆస్ట్రేలియాకు తీసుకొచ్చారు.'' అని చెప్పుకొచ్చింది. ఇక ట్రెవిస్ హెడ్ ఆస్ట్రేలియా తరపున 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆసీస్ తరపున 26 టెస్టులు, 45 వన్డేలు, 17 టి20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: Yuvraj SIngh: కొందరు పగబట్టారు.. అందుకే టీమిండియా కెప్టెన్ కాలేకపోయా! -
మెగావేలంలో అవమానం.. అక్కడ మాత్రం ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక
ఐపీఎల్ మెగావేలంలో సురేశ్ రైనాకు అవమానం జరిగిన సంగతి తెలిసిందే. లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాటర్‌గా పేరున్న రైనాను వేలంలో ఎవరు కొనడానికి ఆసక్తి చూపలేదు. దీంతో రైనా అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. అయితే ఇదే రైనాను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. మాల్దీవులు ప్రభుత్వం ఇచ్చే 'స్పోర్ట్స్ ఐకాన్' అవార్డుకు రైనా ఎంపికయ్యాడు. మొత్తంగా వివిధ దేశాలకు చెందిన 16 మంది క్రీడాకారులు నామినేట్ అయ్యారు. రైనాతోపాటు మాజీ రియల్ మాడ్రిడ్ ఫుట్‌బాల్ ఆటగాడు రాబర్ట్ కార్లోస్, జమైకన్ స్ప్రింటర్ అసఫా పావెల్, శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య, నెదర్లాండ్స్ ఫుట్‌బాల్ దిగ్గజం ఎడ్గర్ డేవిడ్స్ తదితరులు ఉన్నారు. తన క్రికెట్ కెరీర్లో అతను చేసిన సేవకు గాను ఈ అవార్డు ఇచ్చినట్లు మాల్దీవ్స్ ప్రభుత్వం తెలిపింది. కాగా మార్చి 17న మాల్దీవ్స్‌లోని సింథటిక్ రన్నింగ్ ట్రాక్ మైదానంలో ఈ అవార్డుల వేడుక జరిగింది. ఈ అవార్డును బంగ్లాదేశ్ క్రీడామంత్రి జహీర్ హసన్ రసెల్.. రైనాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియా, మాల్దీవుల క్రీడా మంత్రులు పాల్గొన్నారు. ఇక రైనా టీ20ల్లో 8వేల పరుగులు సాధించిన తొలి భారతీయుడిగా.. ఐపీఎల్లో 5వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో చెన్నై జట్టు తరపున 176 మ్యాచ్‌లు ఆడిన సురేశ్ రైనా.. 32.32 సగటుతో 4687 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో మొత్తం 205 మ్యాచ్‌లు ఆడిన రైనా 5528 పరుగులు చేశాడు. -
నేనేం ఉగ్రవాదిని కాదు...
'నేనేం ఉగ్రవాదిని కాదు.. అలాంటి పనులేవి నేను చేయలేదు. నేను ఉగ్రవాదిని కాదనడానికి గతంలో జరిగిన ఎన్నికల్లో నాకు ప్రజలు ఇచ్చిన మద్దతే సాక్ష్యం' అని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ అన్నారు. గురువారం రాత్రి ఆలస్యంగా ఆయనను క్రిమినల్ కోర్టులో ప్రవేశపెట్టగా ఈ సందర్భందగా నషీద్ ఈ వ్యాఖ్యలు చేశారు. కోర్టులో పోలీసుల తరుపు న్యాయవాదులు, నషీద్ తరుపు న్యాయవాది కీలక పత్రాలు న్యాయమూర్తికి అందజేయగా వాటి పరిశీలన కోసం కోర్టు మూడు రోజులపాటు ఈ కేసు విచారణను వాయిదా వేసింది. 47 ఏళ్ల నషీద్ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో ఓ సీనియర్ న్యాయమూర్తిని అకారణంగా నిందితుడిగా పేర్కొని అరెస్టు చేయించారని, ఆ కారణంగా ప్రశాంతంగా ఉన్న మాల్దీవుల్లో ఘర్షణల వాతావరణం నెలకొందని, ఇలాంటి చర్యలు ఉగ్రవాదం కిందికే వస్తాయని పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. రోడ్డు మీద దారుణంగా ఈడ్చుకెళ్లారు.