'నేనేం ఉగ్రవాదిని కాదు.. అలాంటి పనులేవి నేను చేయలేదు. నేను ఉగ్రవాదిని కాదనడానికి గతంలో జరిగిన ఎన్నికల్లో నాకు ప్రజలు ఇచ్చిన మద్దతే సాక్ష్యం' అని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ అన్నారు. గురువారం రాత్రి ఆలస్యంగా ఆయనను క్రిమినల్ కోర్టులో ప్రవేశపెట్టగా ఈ సందర్భందగా నషీద్ ఈ వ్యాఖ్యలు చేశారు. కోర్టులో పోలీసుల తరుపు న్యాయవాదులు, నషీద్ తరుపు న్యాయవాది కీలక పత్రాలు న్యాయమూర్తికి అందజేయగా వాటి పరిశీలన కోసం కోర్టు మూడు రోజులపాటు ఈ కేసు విచారణను వాయిదా వేసింది.
47 ఏళ్ల నషీద్ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో ఓ సీనియర్ న్యాయమూర్తిని అకారణంగా నిందితుడిగా పేర్కొని అరెస్టు చేయించారని, ఆ కారణంగా ప్రశాంతంగా ఉన్న మాల్దీవుల్లో ఘర్షణల వాతావరణం నెలకొందని, ఇలాంటి చర్యలు ఉగ్రవాదం కిందికే వస్తాయని పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. రోడ్డు మీద దారుణంగా ఈడ్చుకెళ్లారు.