న్యూఢిల్లీ: భారత్‌ను దెబ్బ తీయాలని నానా ప్రయత్నాలు చేస్తున్న చైనాకు భారీ షాక్ తగలనుంది. ప్రస్తుత దీపావళి సీజన్‌లో చైనా వస్తువులను భారత వ్యాపారులు నిషేదించడంతో డ్రాగన్ దేశ ఎగుమతిదారులు కొన్ని వేల కోట్లు నష్టపోనున్నారు. ఈ దీపావళికి చైనా సరకులను బాయ్ కాట్ చేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ( సీఏఐటీ) వ్యాపారులకు పిలుపునిచ్చింది. దీంతో చైనాకు సుమారు 50 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు సీఏఐటీ తెలిపింది.
ఇటీవల గమనించిన ముఖ్యమైన మార్పుని పరిశీలిస్తే.. దేశంలోని ప్రధాన నగరాల్లోని వినియోగదారులు చైనీస్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని దీని ప్రభావంతో భారతీయ వస్తువులకు డిమాండ్‌ను పెరుగుతున్నట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ఇటీవల 20 ముఖ్యమైన నగరాల్లో నిర్వహించిన సర్వేలో ఇప్పటివరకు దీపావళి వస్తువులు, బాణసంచా లేదా ఇతర వస్తువుల కోసం చైనా ఎగుమతిదారులకు భారతీయ వ్యాపారులు లేదా దిగుమతిదారులు ఎటువంటి ఆర్డర్‌లు ఇవ్వలేదని తేలింది.
తాజా పరిణామంతో భారతీయ వినియోగదారుల నేరుగా దేశీయ వస్తువుల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకి ₹2 లక్షల కోట్ల మేర ఇన్‌ఫ్లో రాబోతున్నట్లు తెలిపారు. గత సంవత్సరం మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా సీఏఐటీ చైనీస్ వస్తువులను బహిష్కరణకు పిలుపునిచ్చింది.
చదవండి: Exam Result తప్పుగా మెసేజ్ వచ్చింది.. తొందరపడి ప్రాణం తీసుకుంది
Comments
Please login to add a commentAdd a comment