
9 మంది నిందితులను అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు.. వారి నివాసాల నుంచి సంచుల కొద్ది సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ దాపు 800 పైగా సిమ్ కార్డులు ఉంటాయని సీసీఎస్ పోలీసులు తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: ఓఎల్‌ఎక్స్ అమ్మకాల పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న భరత్‌పూర్ గ్యాంగ్‌ను సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఓఎల్‌ఎక్స్, ఫేస్‌బుక్ మార్కెటింగ్‌ల పేరుతో భారీ మోసానికి పాల్పడుతున్నట్టు గుర్తించారు. 9 మంది నిందితులను అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు.. వారి నివాసాల నుంచి సంచుల కొద్ది సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ దాపు 800 పైగా సిమ్ కార్డులు ఉంటాయని సీసీఎస్ పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుడ్డిగా నమ్మి మోసపోవద్దని సూచించారు.
(చదవండి: పాదరసం.. అంతా మోసం )