'ఆన్లైన్'లో ఇంత మోసమా! | plywood piece in place of laptop: online cheating found in Jammikunta of Karimnagar | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 12 2016 6:15 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

పండుగ సంబురానికి అదనంగా డెలివరీ బాయ్ తెచ్చిన ల్యాప్టాప్ పార్సిల్ను చూసి ఆ కుటుంబం ఎగిరి గంతేసింది. ఉత్సుకతతో పార్సిల్ తెరిచిచూసి ఒక్కసారిగా దిగ్భాంతికి గురైంది! ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా బుక్ చేసిన లాప్‌టాప్కు బదులు ఫ్లైవుడ్(చెక్క) ముక్క కనిపించిందా పార్సిల్లో! కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివాసం ఉంటోన్న మామిడాల శ్రీధర్.. నవంబర్ 2న స్నాప్డీల్ అప్లికేషన్ ద్వారా రూ.34 వేల విలువచేసే హెచ్పీ ల్యాప్టాప్ను బుక్ చేసుకున్నారు. మంగళవారం(దసరా పండుగనాడు) ఆ బుకింగ్కు సంబంధించిన పార్సిల్ను డెలివరీ బాయ్ తీసుకొచ్చాడు. పార్సిల్ తీసుకుని ఇంట్లోకి వెళ్లిన శ్రీధర్ తీరా దాన్ని తెరిచి చూశాక.. ల్యాప్టాప్కు బదులు ఫ్లైవుడ్ ఉండటంతో కంగుతిన్నాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement