
నిజామాబాద్: జిల్లాలోని ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో రిస్ట్ వాచ్ బుక్ చేస్తే పార్శిల్లో సిమెంట్ రాయి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు బీర్కూర్ మండలం బరంగరెడ్డికి చెందిన అశోక్ ఐదు రోజుల క్రితం ఆన్‌లైన్ ఈ కామర్స్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.700 చెల్లించి రిస్ట్‌వాచ్ బుక్ చేశాడు.
తీరా పార్శిల్ ఇంటికి వచ్చిన అనంతరం ఆనందంతో తెరిచి చూడగా వాచ్‌కి బదులు సిమెంట్ రాయి, ఐరాన్ రాడ్ కనిపించాయని ఆవేదన వ్యక్తం చేశాడు. రోజురోజుకి ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.