
చిత్తూరు, కేవీబీపురం: ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ హద్దులు మీరుతున్నాయి. మండలంలో ని అంజూరు గిరిజన కాలనీకి చెందిన తుపాకుల బాబు ఫోన్ బుక్ చేస్తే బూట్లు రావడంతో అవాక్కయ్యాడు. వారం రోజుల క్రితం బాబుకు 96675 56223 నుంచి ఫోన్ వచ్చింది. సామ్‌సంగ్ కంపెనీకి చెందిన 12 వేల రూపాయల మొబైల్ ఫోన్‌ను కేవలం రూ.4,800లకే ఇస్తున్నామని నమ్మబలికారు. వెంటనే బాబు ఫోన్ బుక్ చేశాడు. సోమవారం ఉదయం పార్సిల్ స్థానిక తపాలా కార్యాలయానికి వచ్చిందని అక్కడి సిబ్బంది ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. రూ.5వేలు అప్పు చేసి ఆ డబ్బు తపాలా కార్యాలయంలో చెల్లించారు. పార్సిల్ తెరిచి చూడగా అందులో ఫోన్‌కు బదులు బూట్లు దర్శనమిచ్చాయి. దీనిపై తపాలా సిబ్బందిని ప్రశ్నించినా, ఆన్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసినా లాభం లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment