కూరగాయల కత్తి ఉన్న పార్సిల్‌ను చూపుతున్న బాధిత యువకుడు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వాకాడు: సెల్‌ఫోన్ పేరుతో గోల్డెన్ ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థ ఓ యువకుడి నుంచి రూ.2,650 కాజేసి మోసం చేసిన ఉదంతం మంగళవారం మండలంలోని గొల్లపాళెంలో చోటు చేసుకుంది. బాధితుడి సమాచారం మేరకు.. చిత్తూరు జిల్లాలోని గోల్డెన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ఇటీవల తక్కువ ధరలకు ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు అందజేస్తున్నామని పత్రికల్లో ప్రకటన చేసింది. దీంతో ఆశ పడిన వాకాడు గొల్లపాళెంకు చెందిన డి.కస్తూరయ్య ఆర్డర్ చేయడంతో సెల్‌ఫోన్ పార్సిల్ మంగళవారం పోస్టు ద్వారా ఇంటికి చేరింది. అయితే రూ. 2,650 చెల్లించి పార్సిల్ తీసుకుని ఓపెన్ చేసి చూడగా అందులో కూరగాయల కోసుకునే కత్తి ఉండటంతో ఆ బాధిత యువకుడు అవాక్కయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment