
పార్శిల్ ప్యాకెట్‌లో వచ్చిన స్వీట్, రోల్డ్ గోల్డ్ చైన్
రాయచోటి టౌన్ : ఆన్‌లైన్ ద్వారా ఫోన్ కోసం డబ్బులు చెల్లిస్తే స్వీట్ ప్యాకెట్ పంపారని బాధితుడు షేక్ మౌలాలీ వాపోయాడు. బాధితుడి కథనం మేరకు.. రాయచోటి రూరల్ పరిధిలోని శిబ్యాల గ్రామం తురుకపల్లెకు చెందిన షేక్ మౌలాలీకి శనివారం ఫోన్ కాల్ వచ్చింది. లక్కీడ్రాలో నీ నంబర్‌కు మొబైల్ ఫోన్ వచ్చింది. ఆ మొబైల్ పంపుతాం.. వెంటనే నీవు రూ.1500 చెల్లించాలని చెప్పారు. ఆశతో వెంటనే అతడు ఫోన్ పేద్వారా ఆ మొత్తాన్ని చెల్లించాడు. దీనికి సంబంధించి మంగళవార పోస్టల్ ద్వారా ఇంటికి పార్శిల్ వచ్చింది. విప్పి చూడగా అందులో స్వీట్, ఒక రోల్డ్‌గోల్డ్ చైన్ ఉండటంతో అవాక్కయాడు.
Comments
Please login to add a commentAdd a comment