Sweet box
-
కిలో స్వీట్ రూ.21,000.. ఇదే ప్రత్యేకత..
దీపావళి సమీపిస్తున్న తరుణంలో మార్కెట్లో వివిధ రకాల స్వీట్లు ఆదరణ పొందుతున్నాయి. వాటిలో అహ్మదాబాద్‌లోని గ్వాలియాలో విక్రయిస్తున్న 'స్వర్ణ ముద్ర' అనే స్వీట్ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఏకంగా ఆ స్వీట్ ఖరీదు కేజీ రూ.21వేలు. స్వర్ణ ముద్ర ఒక్క ముక్క రూ.1,400 రూపాయలు. ఒక కిలో స్వీట్లో దాదాపు 15 ముక్కలు ఉంటాయి. ఇంతకీ దాని ప్రత్యేకత ఎంటో తెలుసుకుందాం. ఆ స్వీట్ తయారీలో 24 క్యారెట్ల బంగారు పొరను ఉపయోగిస్తారు. దీన్ని బ్లూబెర్రీస్, బాదం, పిస్తా, క్రాన్బెర్రీస్ వంటి వాటితో తయారుచేస్తారు. పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని చాలామంది ఆర్డర్ చేసి మరీ ఈ స్వీట్‌ను తీసుకుంటారని నిర్వాహకులు చెబుతున్నారు. పండగలులేని సమయంలో పెళ్లివేడుకలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాల్లో బహుమతులు ఇవ్వడానికి ఈ స్వర్ణముద్రను ఉపయోగిస్తారని తెలిపారు. -
Sangita Success Story: విజయాన్ని పెట్టెలో పెట్టింది
పిండి కొద్ది రొట్టె ఏమోకాని స్వీటు కొద్ది పెట్టె ఉండాలంటుంది సంగీతా పాండే. స్వీట్ బాక్సులను అందంగా తయారు చేయడం మొదలుపెట్టిన ఈ గోరఖ్‌పూర్ సాధారణ గృహిణి 500 రూపాయల పెట్టుబడితో బయల్దేరి ఆరేళ్లలో 3 కోట్ల టర్నోవర్‌కు చేరింది. అత్తామామలు, భర్త సహకరించకపోయినా గృహిణికి ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని పట్టుదలగా విజయం సాధించింది. తనలాంటి 100 మంది స్త్రీలకు ఉపాధి కల్పించడంతో ఆమె పొందుతున్న సంతృప్తి వెల లేనిది. ఆరేడేళ్ల క్రితం. ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్. మూడవ సంతానంగా కుమార్తె పుట్టాక 9 నెలలు నిండేసరికి ఇక ఇంట్లో ఉంటూ కేవలం అత్తామామల సేవ, వంట వంటి పనులు మాత్రమే చేయకూడదు అనుకుంది సంగీతా పాండే. భర్తకు పోలీసు ఉద్యోగం. బదిలీల మీద తిరుగుతుండేవాడు. ఆర్థికస్థితి అంతంత మాత్రం. తనూ ఉద్యోగం చేయాలని నిశ్చయించుకుంది. భర్త ఒప్పుకోలేదు. అత్తామామలు ఒప్పుకోలేదు. కాని ఎదిరించి తను చదివిన డిగ్రీ అర్హత మీద ఒక ఆఫీసులో చిన్న ఉద్యోగం తెచ్చుకుంది. మొదటిరోజు కూతురితోపాటు హాజరైంది. ఆఫీసువాళ్లు అభ్యంతరం చెప్పడంతో మరుసటి రోజు పాపను ఇంట్లో వదిలి ఆఫీసుకు వెళ్లింది. మనసు ఒప్పలేదు. పిల్లలను దూరం పెట్టి పని చేసే ఉద్యోగం వద్దు అనుకుని మరుసటి రోజే మానేసింది. కాని ఏదో చేయాలి. ఏం చేయాలి? స్వీట్‌షాపులో డబ్బాలు ఆమె ఒకసారి స్వీట్‌షాపులో స్వీట్స్ కొంటున్నప్పుడు ఎవరో వచ్చి ఖాళీ బాక్సులు స్టాకు పడేసి వెళ్లడం చూసింది. తనక్కూడా అలాంటివి తయారు చేసి అమ్మాలని అనిపించింది. అందుకోసం గోరఖ్‌పూర్‌లో వాటిని తయారు చేస్తున్న ఒకరిద్దరు స్త్రీలను కలిసింది. అయితే వారు ఆమెకు పని గురించి అంతంత మాత్రమే చెప్పారు– పోటీకి వస్తుందని. సంగీతా పాండేకి సృజన ఉంది. కొత్తగా చేసే ఆలోచన ఉంది. అందుకే తానే రంగంలో దిగింది. అప్పటికి తన దగ్గర 1500 ఉన్నాయి. ఓ పాత సైకిలుంది. ఆ సైకిల్ మీద తిరుగుతూ రా మెటీరియల్ కొని తెచ్చింది. 8 గంటల్లో 100 డబ్బాలు తయారు చేసింది. తనే వాటిని సైకిల్ వెనుక కట్టుకుని స్వీట్ షాపులకు అమ్మేందుకు బయలుదేరింది. అవి బాగుండటంతో అమ్ముడుపోయాయి కాని ఇంతకంటే తక్కువకు సరుకు వేస్తున్నారని తెలిసింది. గోరఖ్‌పూర్ రత్న ఇటీవలే ఉత్తరప్రదేశ్ సి.ఎం ఆదిత్యానాథ్ మహిళా అంట్రప్రెన్యూర్‌గా ఎంతో స్ఫూర్తినిస్తున్న సంగీతా పాండేని ‘గోరఖ్‌పూర్ రత్న’ బిరుదుతో సత్కరించాడు. ఇప్పుడు సంగీతా పాండే తయారు చేస్తున్న స్వీట్ బాక్సులు ఢిల్లీ వరకూ వెళుతున్నాయి. స్వీట్లను ఒకదాని మీద ఒకటి కుక్కే విధంగా కాకుండా సంగీతా స్వీట్‌బాక్సులు ఒకదాని పక్కన ఒకటి అంటకుండా అమర్చేలా ఉండటంతో ఆదరణ పొందుతున్నాయి. సంప్రదాయం కోసం కొద్ది స్వీట్లతో ఒక బుట్టను ప్రెజెంట్ చేసేలా కూడా పెట్టెలు తయారు చేస్తోంది. స్వీట్లలోని రకాలను బట్టి ఈ ప్యాకింగ్ బాక్సులు మారిపోతుంటాయి. సృజన, శ్రమ కలిస్తే సక్సెస్ అదే వస్తుందనడానికి మరో ఉదాహరణ సంగీతా పాండే. అసలు కిటుకు రా మెటీరియల్ లక్నో, ఢిల్లీలలో తక్కువకు దొరుకుతుందని, వాటితో కళాత్మకంగా డబ్బాలు తయారు చేసి తక్కువకు ఇవ్వగలిగితే చాలా గిరాకీ ఉంటుందని తెలుసుకుంది సంగీతా పాండే. వెంటనే చురుగ్గా ఉండే నలుగురైదుగురు స్త్రీలను పనిలోకి తీసుకుంది. డిస్ట్రిక్ట్ అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి 2 లక్షలు లోన్ సాధించింది. పనిలోకి దిగింది. కిలో, అరకిలో, పావుకిలో డబ్బాలు మంచి రంగులతో లోపల జలతారు వస్త్రంతో తయారు చేసి గోరఖ్‌పూర్, లక్నోలలో స్టాకు వేయడం మొదలెట్టింది. ‘నాణ్యత విషయంలో ఒక పైసా నష్టం వచ్చినా రాజీ పడకూడదు అనే నియమం పెట్టుకున్నాను’ అంటుంది సంగీతా పాండే. ఆ నాణ్యత, ముస్తాబు వల్ల ఆమె ఖాళీ బాక్సులకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఇప్పుడు ఆమె నగలు కుదువ పెట్టి మరో 3 లక్షలు తీసుకుని వ్యాపారాన్ని విస్తరించింది. ఆ తర్వాత బ్యాంకులే వెతుక్కుంటూ వచ్చి 30 లక్షలు లోను మంజూరు చేశాయి. ఒక ఫ్యాక్టరీ ఆవరణ, పని చేసే స్త్రీలు, వీరు కాకుండా ఇళ్ల దగ్గర ఉంటూ పనిచేసే స్త్రీలు వీరంతా ఒక వ్యవస్థగా ఏర్పడ్డారు. సంగీతా పాండే దూసుకుపోయింది. -
స్వీట్ బాక్స్ లేయర్ల మధ్య అరకోటిపైనే అక్రమ రవాణా!.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణకుడి నుంచి సుమారు రూ. 54 లక్షలు స్వాధీనం చేసుకున్నారు ఎయిర్పోర్ట్ అధికారులు. అతను ఈ డబ్బును స్వీట్స్ ప్యాకింగ్ చేసే బాక్స్‌లో పెట్టాడు. ఆ ప్యాకింగ్ బాక్స్ చుట్టూ ఉండే అంచుల లేయర్ల మధ్య ఈ డబ్బుని దాచాడు. అతను ఈ విధంగా అక్రమంగా అంత పెద్ద మొత్తంలో డబ్బును తరలించడంతో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. అదంతా దాదాపు రూ. 54 లక్షలు విలువ చేసే సౌదీ కరెన్సీ. ఐతే అతను ఆ డబ్బు మొత్తాన్ని ఎలా స్వీట్స్ ప్యాకింగ్ చేసే బాక్స్‌లో దాచి పెట్టాడనే వీడియో ప్రస్తుత్తం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొలుత ఆ బాక్స్ చూస్తే మొత్తం స్వీట్స్ ఉండగా, ఆ పైన ఉండే ప్యాకింగ్ బాక్స్ చుట్టూ ఉన్న లేయర్ల మధ్య మొత్తం డబ్బును చాలా గమ్మత్తుగా దాచి పెట్టాడు. View this post on Instagram A post shared by India Today (@indiatoday) (చదవండి: ఏం సార్.. గోక్కోవడం కూడా తప్పేనా...) -
Diwali 2021: ఈ మీమ్స్ చూస్తే.. నవ్వాపుకోలేరు!!
దీపావళి అంటే దీపాలతో వెలుగులు నింపే పండగ. ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి, పూజలు, వ్రతాలు జరుపుకుంటారు. దీపావళి రోజు మిఠాయిలు పంచుకోవడం కూడా సంప్రదాయంగా వస్తుంది. సాధారణంగా దీపావళికి తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు యాజమాన్యాలు స్వీట్ బాక్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తాయి. అయితే దీపావళి మిఠాయి అనగానే చాలామందికి సోన్ పాపిడి గుర్తుకు వస్తుంది! దీపావళిని పురస్కరించుకొని కుటుంబ సభ్యులు, స్నేహితులు సోన్‌పాపిడి బాక్స్‌లను కానుకగా ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే ప్రస్తుతం ఈ దీపావళి పండగ సందర్భంగా కూడా స్వీట్లపై ఫన్నీ మీమ్స్, జోకులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్ల జోకులు, మీమ్స్‌తో ట్విటర్లో #SoanPapdi ట్రెండింగ్‌లో ఉంది. Need this tag on soan papdi boxes too. pic.twitter.com/iEtnbpFdpG — Aman 👾 (@iamboyaman) October 26, 2021 The #soanpapdi dukh🙄 pic.twitter.com/y8D8etoyCU — Karan Makwana (@karanmak25) November 3, 2021 Speacial sofa seat for the relatives who gonna bring soan papdi#Diwali2021 pic.twitter.com/6jYvLPAsZn — ANANT SHARMA (@Freakingbunny) November 2, 2021 When You get back Your own soan papdi box on #Diwali pic.twitter.com/7oWn6LwUjx — Zing Tunes ❤ (@Zing_Tunes) November 3, 2021 -
స్వీట్ బాక్సులు పంచారు, వీధి మొత్తం దోచేశారు
సాక్షి, మల్కన్‌గిరి(ఒడిశా): మూడు నెలల క్రితం ఓ ఇంట్లో అద్దెకు దిగిన దంపతులు ఇంటి యజమానితో పాటు చుట్టుపక్కల వారి డబ్బు దోచుకుని పరారవడంతో బాధితులంతా లబోదిబోమంటున్న ఉదంతమిది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. మల్కన్‌గిరి జిల్లాకేంద్రంలోని బుట్టిగుడ వీధికి చెందిన ఉషా పటేల్ ఇంటికి మూడు నెలల క్రితం సుభాష్ అనే వ్యక్తి భార్యతో వచ్చి ఇల్లు అద్దెకు అడిగాడు. ఇల్లు ఖాళీగా ఉండడంతో ఉషాపటేల్ వారికి అద్దెకు ఇచ్చింది. ఇంటిలో ఉంటున్న సుభాష్ సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చి..తనకు మంచి ఉద్యోగం వచ్చిందని చెప్పి ఇంటి యజమానితో పాటు చుట్టుపక్కల వారందరికీ ముందుగానే మత్తుమందు కలిపిన స్వీట్స్ పంచిపెట్టాడు. ఇంటి యజమాని ఉషా పటేల్ ఆ స్వీట్స్ తిన్న వారందరూ ఓ గంటలో మత్తులోకి జారుకున్నారు. రాత్రి పది గంటల సమయంలో భార్యతో కలిసి సుభాష్ యజమాని ఇంటిలో ఉన్న రూ.35 లక్షల విలువ చేసే బంగారం, రూ.2.5 లక్షల నగదుతో పాటు, చుట్టుపక్కల ఏడిళ్లలో చిన్నపాటిగా నగదు దోచుకుని భార్యతో సహా పరారయ్యాడు. మంగళవారం ఉదయం యజమాని ఉషాపటేల్ లేచి చేసి మొత్తం ఆ దంపతులే దోచుకున్నారని గ్రహించి చుట్టుపక్కల వారిని పిలిచి లబోదిబోమంది. దీంతో ఇరుగుపొరుగు వారు కూడా తమ ఇళ్లలో కూడా దోచుకున్నట్లు గుర్తించి అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందిత భార్యాభర్తల కోసం గాలిస్తున్నారు. -
ఆన్లైన్ మోసం.. ఫోన్ బదులు స్వీట్
రాయచోటి టౌన్ : ఆన్లైన్ ద్వారా ఫోన్ కోసం డబ్బులు చెల్లిస్తే స్వీట్ ప్యాకెట్ పంపారని బాధితుడు షేక్ మౌలాలీ వాపోయాడు. బాధితుడి కథనం మేరకు.. రాయచోటి రూరల్ పరిధిలోని శిబ్యాల గ్రామం తురుకపల్లెకు చెందిన షేక్ మౌలాలీకి శనివారం ఫోన్ కాల్ వచ్చింది. లక్కీడ్రాలో నీ నంబర్‌కు మొబైల్ ఫోన్ వచ్చింది. ఆ మొబైల్ పంపుతాం.. వెంటనే నీవు రూ.1500 చెల్లించాలని చెప్పారు. ఆశతో వెంటనే అతడు ఫోన్ పేద్వారా ఆ మొత్తాన్ని చెల్లించాడు. దీనికి సంబంధించి మంగళవార పోస్టల్ ద్వారా ఇంటికి పార్శిల్ వచ్చింది. విప్పి చూడగా అందులో స్వీట్, ఒక రోల్డ్‌గోల్డ్ చైన్ ఉండటంతో అవాక్కయాడు. -
తియ్యని వెన్నెల
కళ్లు నవ్వితే కాకర పువ్వొత్తులు. పెదవులు విచ్చుకుంటే మతాబులు. చేయీ చేయీ కలిస్తే.. చేత వెన్నముద్దలు. స్వీట్ బాక్స్ ఓపెన్ చేస్తే..? .. లడ్లు, గులాబ్ జామూన్లు! దీపావళి... ‘అమావాస్య వెన్నెల’లా ఉంటుంది. అంతేనా! అమ్మ చేసిన స్వీట్లానూ ఉంటుంది. శక్కర్ పారా కావలసినవి: గోధుమ పిండి- 250 గ్రాములు, నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు, నీరు- 125 మి.లీ లేదా చపాతీల పిండిలా కలుపుకోవడానికి తగినంత, నూనె- వేయించడానికి తగినంత చక్కెర పాకం కోసం: చక్కెర- 150 గ్రా, నీరు- 50 మి.లీ, కుంకుమ పువ్వు- ఆరు రేకలు (ఇష్టమైతేనే) తయారీ: గోధుమ పిండిలో నెయ్యి వేసి కలిపిన తర్వాత నీటితో చపాతీల పిండిలా ముద్ద చేయాలి. తడివస్త్రాన్ని కప్పి పక్కన ఉంచాలి. ఒక పాత్రలో చక్కెర పాకాన్ని సిద్ధం చేయాలి. చక్కెరలో నీటిని పోసి ఐదు నిమిషాల సేపు మరిగించాలి. చివరగా కుంకుమ పువ్వు వేస్తే చక్కెర పాకం రెడీ. అరగంట తర్వాత గోధుమ పిండి ముద్దను మూడు భాగాలుగా చేయాలి. ఒక భాగాన్ని తీసుకుని మందపాటి చపాతీలా వత్తాలి. దానిని చాకుతో నిలువుగా గాట్లు పెట్టాలి. తర్వాత అడ్డంగా లేదా మూలగా గాట్లు పెట్టాలి. ఇప్పుడు చపాతీ పీటను జాగ్రత్తగా మరుగుతున్న నూనెలోకి వంచాలి. పిండి పలుకులుగా ఊడి నూనెలోకి జారిపోతుంది. చిల్లుల గరిటెతో తిరగేస్తూ రెండు వైపులా గట్టిగా కాలిన తర్వాత నూనెలో నుంచి తీసి వెంటనే చక్కెర పాకంలో వేసి నిమిషం తర్వాత తీసేయాలి. అలాగే మిగిలిన రెండు భాగాల పిండిని కూడా చపాతీల్లా వత్తి చాకుతో గాట్లుపెట్టి నూనెలో వేయించి చక్కెర పాకంలో వేయాలి. గమనిక: శక్కర్పారా డైమండ్ ఆకారంలో రావాలంటే చపాతీ మీద చాకుతో ఒకసారి నిలువుగా మరోసారి మూలగా గాట్లు పెట్టాలి. పత్తిర్ పేనీ కావలసినవి: గోధుమ పిండి లేదా మైదా - ఒక కప్పు నెయ్యి- రెండు టేబుల్‌స్పూన్లు, చక్కెర- పావు కప్పు యాలకుల పొడి- అర టీ స్పూన్, ఉప్పు- చిటికెడు నీరు - కలపడానికి తగినంత, నూనె- వేయించడానికి తగినంత ఫిల్లింగ్ కోసం: బియ్యప్పిండి- రెండు టేబుల్ స్పూన్లు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు తయారీ: చక్కెర, ఏలకులు కలిపి మిక్సీలో మెత్తగా పొడి చేయాలి.మైదాలో నెయ్యి, ఉప్పు వేసి నీటితో కలపాలి. మృదువుగా ముద్దగా చేసి తడి వస్త్రంతో కప్పి పది నిమిషాల సేపు ఉంచాలి. పిండిని చిన్న ఉండలుగా చేసుకుని వీలయినంత పలుచటి చపాతీల్లా వత్తాలి. మరొక గిన్నెలో బియ్యప్పిండి, నెయ్యి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చపాతీల మీద వేసి సమంగా పరుచుకునేటట్లు రుద్దాలి. చపాతీలను అన్నింటినీ ఒకదాని మీద మరొకటి పెట్టి రోల్ చేయాలి. ఆ రోల్‌ను అంగుళం మందం ముక్కలు చేయాలి. ఒక్కొక్క ముక్కను మళ్లీ రోలర్‌తో వత్తాలి. ఇలా చేయడం వల్ల పేనీ గారె సైజులో వస్తుంది. వరుసగా పేర్చిన చపాతీలు పొరలుగా కనిపిస్తుంటాయి. వీటిని మరుగుతున్న నూనెలో వేసి రెండు వైపులా దోరగా కాలిన తర్వాత తీసి టిస్యూ పేపర్ మీద వేయాలి. అదనంగా ఉన్న నూనెను పేపర్ పీల్చుకున్న తర్వాత పేనీల మీద చక్కెర పొడి చల్లాలి. గమనిక: ఇది కర్నాటక ప్రత్యేకం సేమ్యా పేనీ కావలసినవి: పాలు- ఒక లీటరు, పేనీ సేమ్యా - పావు కేజీ, చక్కెర- పావు కేజీ బాదం పలుకులు- గుప్పెడు (పది పలుకులను పొడి చేసుకుని మిగిలినవి గార్నిషింగ్ కోసం ఉంచుకోవాలి), జీడిపప్పు- గుప్పెడు, కిస్మిస్- గుప్పెడు యాలకుల పొడి- అర టీ స్పూన్ తయారీ: మందపాటి పెనంలో పాలు పోసి సన్నమంట మీద చిక్కగా సగం అయ్యే వరకు మరిగించాలి. ఇందులో చక్కెర, బాదం పొడి వేసి మరో నిమిషం పాలు మరిగించాలి. ఇప్పుడు యాలకుల పొడి, పేనీ వేసి కలిపి మంట ఆపేసి పది నిమిషాల సేపు పెనాన్ని కదిలించకుండా ఉంచాలి. మరొక చిన్న పెనంలో నెయ్యి వేడి చేసి బాదంపలుకులు, జీడిపప్పు, కిస్మిస్ వేయించాలి. వడ్డించేటప్పుడు కప్పులో సేవియా పేనీ వేసి పైన నేతిలో వేయించిన బాదం పలుకులు, జీడిపప్పు, కిస్మిస్తో అలంకరించాలి. మోతీచూర్ లడ్డు కావలసినవి: శనగపిండి- రెండున్నర కప్పులు చక్కెర- ఒకటిన్నర కప్పు, పాలు- పావు కప్పు ఆరెంజ్ రంగు- చిటికెడు నెయ్యి- కాల్చడానికి తగినంత యాలకుల పొడి- ఒక టేబుల్‌స్పూన్ బాదం - పది( సన్నగా తరగాలి) పిస్తా- పది (పలుచగా తరగాలి) తయారీ: చక్కెరలో మూడు కప్పుల నీరు పోసి సన్న తీగ పాకం వచ్చే వరకు మరిగించాలి. మరిగేటప్పుడు ఒక స్పూను పాలు పోస్తే చక్కెరలోని మలినాలు పైకి తేలుతాయి. వాటిని స్పూన్‌తో తీసేయవచ్చు. పాకంలో ఆరెంజ్ కలర్ కలిపి పక్కన పెట్టాలి. శనగపిండిలో నీరు పోసి పలుచగా కలపాలి. ఇష్టమైతే శనగపిండికి కూడా రంగు కలుపుకోవచ్చు. బాణలిలో నెయ్యి వేడి చేసి సన్నని చిల్లుల గరిటె (పూస గరిటె) సాయంతో శనగపిండిని నేతిలో పోయాలి. బూందీ తయారవుతుంది. రెండు- మూడు నిమిషాల సేపు కాలిన తర్వాత బూందీని నేతిలో నుంచి మరొక చిల్లుల గరిటె సాయంతో తీసి చక్కెర పాకంలో వేయాలి. ఇలాగే శనగ పిండి మొత్తాన్ని బూందీ చేసుకుని పాకంలో వేయాలి. చివరగా బూందీలో యాలకుల పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమంలో బాదం, పిస్తా పలుకులు చేరుస్తూ లడ్డు కట్టాలి. పై కొలతలతో ఇరవై నుంచి పాతిక లడ్డూలు వస్తాయి. గులాబ్ జామూన్ కావలసినవి: పాల పొడి- ఒక కప్పు, మైదా- పావు కప్పు, నెయ్యి- ఒక టీ స్పూన్, బేకింగ్ సోడా- చిటికెడు పెరుగు- రెండు టేబుల్ స్పూన్లు, బాదం, పిస్తా పలుకులు- గుప్పెడు నెయ్యి లేదా వనస్పతి- వేయించడానికి తగినంత చక్కెర పాకం కోసం: నీరు- రెండు కప్పులు, చక్కెర- ఒకటిన్నర కప్పు, యాలకులపొడి- అర టీ స్పూన్ కుంకుమ పువ్వు- పది రేకలు, పన్నీరు- ఒక టీ స్పూన్ (ఇష్టమైతేనే) తయారీ: ఒక పాత్రలో చక్కెర, నీరు, యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి బాగా కలపాలి. స్టవ్ మీద పెట్టి సన్నమంట మీద తీగ పాకం వచ్చే వరకు మరిగించి పక్కన ఉంచాలి. మరొక పాత్రలో పాల పొడి, మైదా, బేకింగ్ సోడా, నెయ్యి, ఒక టేబుల్‌స్పూన్ పెరుగు వేసి కలపాలి. మిగిలిన పెరుగును పైన వేసి సమంగా పట్టించాలి. మిశ్రమం మృదువుగా ఉండాలి. రెండు చేతుల్లో వేసి వలయాకారంగా చేసినప్పుడు ఎక్కడా చారలు కనిపించనంత మృదువుగా ఉండాలి( చార ఉంటే జామూన్ వేయించేటప్పుడు ఆ చారలోనే పగులుతుంది). బాణలిలో నెయ్యి వేడి చేసి పై మిశ్రమాన్ని చిన్న చిన్న గోళీలుగా చేసుకుని నేతిలో ముదురు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. మీడియం మంట మీద నేతిలో వేయాలి, వేసిన తర్వాత సన్న మంట మీద కాలనివ్వాలి. బాగా కాలిన తర్వాత తీసి చక్కెర పాకంలో వేసి ముంచాలి. వడ్డించేటప్పుడు జామూన్ల మీద పిస్తా, బాదం పలుకులతో గార్నిష్ చేయాలి.