Rs 54 Lakh Saudi Currency Hidden In Sweet Box At Delhi Airport - Sakshi
Sakshi News home page

స్వీట్‌ బాక్స్‌ లేయర్ల మధ్య అరకోటిపైనే అక్రమ రవాణా!.. వీడియో వైరల్‌

Published Thu, Sep 8 2022 3:33 PM | Last Updated on Thu, Sep 8 2022 5:25 PM

Rs 54 Lakh Saudi Currency Hidden In Sweet Box At Delhi Airport - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణకుడి నుంచి సుమారు రూ. 54 లక్షలు స్వాధీనం చేసుకున్నారు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు. అతను ఈ డబ్బును స్వీట్స్‌ ప్యాకింగ్‌ చేసే బాక్స్‌లో పెట్టాడు. ఆ ప్యాకింగ్‌ బాక్స్‌ చుట్టూ ఉండే అంచుల లేయర్ల మధ్య ఈ డబ్బుని దాచాడు.

అతను ఈ విధంగా అక్రమంగా అంత పెద్ద  మొత్తంలో డబ్బును తరలించడంతో కస్టమ్స్‌ అధికారులకు పట్టుబడ్డాడు. అదంతా దాదాపు రూ. 54 లక్షలు విలువ చేసే సౌదీ కరెన్సీ. ఐతే అతను ఆ డబ్బు మొత్తాన్ని ఎలా స్వీట్స్‌ ప్యాకింగ్‌ చేసే బాక్స్‌లో దాచి పెట్టాడనే వీడియో ప్రస్తుత్తం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తొలుత ఆ బాక్స్‌ చూస్తే మొత్తం స్వీట్స్‌  ఉండగా, ఆ పైన ఉండే ప్యాకింగ్‌ బాక్స్‌ చుట్టూ ఉన్న లేయర్ల మధ్య మొత్తం డబ్బును చాలా గమ్మత్తుగా దాచి పెట్టాడు.

(చదవండి: ఏం సార్‌.. గోక్కోవడం కూడా తప్పేనా...)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement