వెబ్క్యామ్లో అందం ఎరవేసి.. | online cheating sex scam burst | Sakshi
Sakshi News home page

వెబ్క్యామ్లో అందం ఎరవేసి..

Published Fri, Oct 28 2016 12:18 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

వెబ్క్యామ్లో అందం ఎరవేసి.. - Sakshi

వెబ్క్యామ్లో అందం ఎరవేసి..

'ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ అమ్మాయి ఫేస్ బుక్ రిక్వెస్ట్ పంపింది. ఎవరో తెలియని వాళ్లు అని నేను అనుకోలేదు. ఎందుకంటే నాతో చదివిన ఎక్కువగా పరిచయంలేని నా పాత స్కూల్ స్నేహితులు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ రిక్వెస్ట్లు పంపుతుంటారు. దీంతో వెంటనే రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేశా. మరుసటి రోజు అదే అకౌంట్ నుంచి హాయ్ హౌ ఆర్ యూ, మీ ఫ్రొఫైల్ చూసి రిక్వెస్ట్ పంపా అంటూ మెసేజ్ వచ్చింది. ఫ్రొఫైల్ చెక్ చేశా. నిజంగా ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. అదే రోజు రాత్రి స్కైప్ ద్వారా చాట్ చేసింది. తనకు 23 ఏళ్లని, తల్లిదండ్రులు మరణించారని, లెబనాన్లోని సెడాన్లో తన సోదరి ఇంట్లో ఉంటున్నానని, ప్రస్తుతం చదువు, పని లేకుండా ఇంట్లోనే ఒంటరిగా ఉండాల్సి రావడంతో బోరుకొడుతోందని చెప్పింది. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ.. తనకు శృంగారమంటే అమితమైన ఆసక్తి అని, అయితే తన సోదరి బయటకు వెళ్లనివ్వదని చెప్పింది.

ఎదో తెలియని క్యూరియాసిటీ నాలో మొదలైంది. కానీ, ఎక్కడో ఎదో చిన్న సందేహం. తెలియని అమ్మాయితో అలా మాట్లాడటం..! అయినాసరే ఆమెకు దగ్గరవుతూనేఉన్నా. ఒకరోజు నా దగ్గర వెబ్ కామ్ ఉందా అని ఆ అమ్మాయి అడిగింది. ఆ అమ్మాయి కూడా వెబ్ కామ్ ఆన్ చేసింది. అంతే కళ్లు చెదిరే తన అందాన్ని చూసి ముగ్దుడినైపోయా. మేము మాట్లాడుకోకుండానే, కేవలం టైపింగ్ చేస్తూనే చాట్ చేశాము. తన సోదరి ఇంట్లోనే ఉందని, మాట్లాడితే తనకు తెలిసిపోతుందని ఆ అమ్మాయి చెప్పింది. ఇంకోరోజు.. 'నువ్వు ఏం చేస్తావ్?' అని అడిగింది. వెంటనే మిలాన్లో మార్కెటింగ్ చేస్తానంటూ బదులిచ్చా. 'అయితే మీరు కచ్చితంగా కోటీశ్వరుడై ఉంటారే' అంది. అవునన్నాను. తన సోదరి వస్తుందంటూ డ్రెస్ వెసుకొని సైన్ ఆఫ్ అయ్యింది.

ఒక అరగంట తరువాత నా ఫేస్ బుక్ అకౌంట్కు ఓ మెసేజ్ వచ్చింది. 'చూడు, నేను ఓ మగాణ్ని. అవతల నువ్వేం చేశావో వెబ్ క్యామ్ ద్వారా మొత్తం రికార్డు చేశా' అంటూ ఆ వీడియోను నాకు పంపాడు. ఐదు నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోను చూసి షాక్కు గురై ఒక్కసారిగా కుంగిపోయా. 'నీ ఫెస్ బుక్ అకౌంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితుల జాబితా మొత్తం నా దగ్గర సిద్ధంగా ఉంది. మీ తల్లి, సోదరులు, కజిన్స్ అందిరివి ఉన్నాయి. నీకు వారం రోజులు గుడువు ఇస్తా, ఇలోగా నాకు 5000యూరోలు పంపించు లేదా వీడియోను అందరికి పంపిస్తా'అని మెసేజ్ పంపాడు. దిమ్మతిరిగినంత పనైందినాకు. వెంటనే స్కైప్ లిస్ట్ నుంచి ఆ కాంటాక్ట్ను డిలీట్ చేశా. దీంతో వాట్సప్లో మెసేజ్లు వచ్చాయి.

దీంతో చేసేదేమీ లేక అతన్ని బతిమిలాడటం ప్రారంభించా. 5000ల యూరోలు కట్టే అంత స్తోమత నాకు లేదన్నా. దానికి అతను ' నువ్వు కచ్చింతంగా ఇవ్వగలుగుతావు, యూరప్లో మంచి ఉద్యోగం చేస్తున్నావు కదా' అన్నాడు. లేదు అమ్మాయి అనుకొని ఇంప్రెస్ చేయడాకి అబద్ధం చెప్పాను.  నేను కేవలం పిజ్జా డెలివరీ బోయ్ అని చెప్పా.  బాత్ రూంకి నేనే టైల్స్ వేస్తూ దిగిన ఓ ఫోటో పరిచయం చేసుకుంటున్న సందర్భంగా ఆమెకు పంపిన విషయం గుర్తొచ్చి, దాని గురించి వివరించా. నిజంగానే నేను డబ్బు ఉన్నోడినైతే ఆ పని నేనే ఎందుకు చేస్తా అంటూ కొంత మేర ఆ వ్యక్తిని కన్విన్స్ చేయగలిగా. 'అదీ నిజమే కానీ, నాకు అదంతా అవసరం లేదు. నీకు ఒక వారం గడువు ఇస్తున్న 2000 యూరోలు అరెంజ్ చేయి. లేదా నీ కుటుంబ సభ్యులకు వీడియో పంపిస్తా' అన్నాడు. ఇప్పుడు నాముందు రెండే దారులున్నాయి. ఒకటి అతడు అడిగినంత డబ్బు ఇస్తూనే ఉండాలి, పైగా గ్యారంటీ ఏమీ లేదు. రెండు.. అతని డీల్ను రిజక్ట్ చేసి ఆ వీడియో ఎవరూ చూడరని కామ్గా ఉండటం.

నేను రెండోదే ఎంచుకున్నా...
ఆ రోజు రానే వచ్చింది....వీడియోను యూట్యూబ్లో అప్ లోడ్ చేస్తున్నాఅంటూ మెసెజ్ వచ్చింది. మరో సందేహం లేకుండా అప్ లోడ్ చేసుకో అంటూ బదులిచ్చా. నా ఫేస్ బుక్ వాల్ పైన నా పర్మిషన్ లేకుండా వేరే వాళ్లు పోస్టు చేయకుండా వెంటనే ప్రైవసీ సెట్టింగ్ మార్చా. యూట్యూబ్లో ఆ వీడియోను చూశా. సెక్సువల్ కంటెంట్ ఉందంటూ వీడియోను రిపోర్టు చేయడం ప్రారంభించా. వీడియోను నిలిపివేయండి అంటూ ఎన్నో సార్లు రిపోర్టు చేశా. డబ్బు పంపకపోతే వీడియో లింక్ను నా బంధువులకు పంపిస్తానంటూ అతను మరో మెసెజ్ పెట్టాడు. సరే అలాగే చేయ్ అంటూ మెసేజ్ పెట్టా. యూట్యూబ్లోని వీడియోను రిపోర్టు చేస్తూనే ఉన్నా, వీడియోను చూస్తున్న ప్రతిసారి ఎంత మంది దాన్ని చూశారో పరిశీలిస్తూనే ఉన్నా. సరిగ్గా ఓ గంట తర్వాత  ఆ వీడియోను యూట్యూబ్ తొలగించింది. వీడియోను అప్లోడ్ చేసినప్పటినుంచి ఎంతమంది చూసారో తెలిపే వ్యూస్లో అన్ని నేను చూసినవే ఉన్నాయి. ఒక్క వ్యూ తప్ప.  అది వీడియోను అప్ లోడ్ చేసిన తర్వాత ఆ వ్వక్తే చూసి ఉండొచ్చు అనుకుంటున్నాను.


ఒక వేళ నా తల్లి, సోదరి, బందువులు  ఆ వీడియోను చూస్తే ఎలా ఉండేది. సిగ్గుతో చచ్చిపోవాలని అనుకునే వాడినేమో. ఆ వీడియో యూట్యూబ్ నుంచి తీసివేసిన తర్వాత తిరిగి ఆ వ్యక్తినుంచి నాకు ఎలాంటి మెసేజ్లు రాలేదు. డబ్బు కోసం నాలాంటి పేదోళ్లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అతన్ని అడిగిన ప్రశ్నకు..నేను గల్ఫ్లో ఉన్న కోటీశ్వరులని కూడా లక్ష్యంగా చేసుకొనే పని చేస్తామంటూ బదులిచ్చిన విషయం గుర్తుకు వచ్చింది. నేను చాలా అదృష్టవంతున్ని అతను నన్ను నిజంగానే పేదవాడని నమ్మి, మళ్లీ నన్ను ఇబ్బందిపెట్టలేదు. కానీ, యూట్యూబ్లో మళ్లీ ఏమైనా అప్లోడ్ చేశాడేమే అని ప్రతి సారి చెక్ చేసుకోవడం మాత్రం అలవాటుగా మారింది' అని విదేశాల్లో ఉంటున్న పాలస్తీనా యువకుడు తాను ఆన్లైన్ స్కామ్లో ఇరుక్కున్న వైనాన్ని ప్రఖ్యాత బీబీసీ వార్తా సంస్థకు వివరించాడు. ఇప్పుడీ కథనం ఇంటర్నెట్ లో సంచలనం రేపుతోంది.   

రిపోర్టర్:
23 ఏళ్ల లెబనాన్ అమ్మాయిగా సమీర్ను నమ్మించింది మోసం చేసింది మోరాకోలోని ఒడ్ జెమ్ టౌన్కు చెందిన యువకుడు. అది సెక్సార్షన్ ఇండస్ట్రీకి రాజధానిలాంటి ప్రాంతం. ఒడ్ జెమ్ స్కామర్లు ఫేస్ బుక్ పేజీల్లో ఇలాగే ఎంతో మందికి వల వేస్తూ ఉంటారు. ఎవరైనా అబ్బాయి చిక్కితే పోర్న్ సైట్ నుంచి అమ్మాయిలకు సంబంధించి  డౌన్ లోడ్ చేసుకున్న వీడియోను ప్లే చేసి అమ్మాయిలా నమ్మించి బుట్టలోకి దింపుతారు. రోజుకు కనీస 500 డాలర్లు సంపాదిస్తారని స్కామ్లో ఆరితేరిన ఓ వ్యక్తి తెలిపాడు. వందలాది ఒడ్ జెమ్ యువకులు ఇలాంటి స్కామ్లో ఆరితేరారని తెలిపాడు. వేరే ఇతర జీవనాధారం లేని ఈ ప్రాంతంలో 50 అంతర్జాతీయ మనీ ట్రాన్సఫర్ ఆఫీసులు ఉన్నాయంటేనే ఈ స్కామ్ ఎంతగా వారికి డబ్బు సంపాదించి పెడుతుందో అర్థం అవుతుంది.  ఇక్కడి వీధుల్లో జర్మన్ కార్లు, జపాన్ మోటారు బైకులతో కలకలలాడుతున్నాయి. యూకే, యూఎస్, యువ అరబ్ యువకులే లక్ష్యంగా ఎక్కువగా ఈ దందా కొనసాగుతోంది. ప్రపంచంలో ఈ తరహా జరుగుతున్న స్కాముల్లో మూడో వంతు ఈ ప్రాంతాల్లోంచే జరుగుతుండటం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement