
పూజా సామగ్రీ చూపిస్తున్న నాగరాజు
కొత్తూరు: జిల్లాలో మరో ఆన్‌లైన్ మోసం వెలుగుచూసింది. కొత్తూరు మండలం మాకవరం గ్రామానికి చెందిన జి.నాగరాజుకు ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ చేసి రూ. 14వేలు విలువైన శ్యామ్‌సంగ్ సెల్‌ఫోన్‌ను కేవలం రూ.4వేలకే అందిస్తానని చెప్పాడు. దీనికి నాగరాజు తిరస్కరించగా సంబంధింత వ్యక్తి పదేపదే ఫోన్ చేసి సెల్‌ఫోన్ ఆఫర్‌ను వదులుకోవద్దంటూ అభ్యర్థించాడు. దీంతో ఆయన చెప్పిన ప్రకారమే రూ.4 వేలను ఆన్‌లైన్‌లో చెల్లించి ఆర్డర్ ఇచ్చాడు.
ఇటీవల నివగాం పోస్టాఫీస్‌కు పార్సిల్ వచ్చినట్లు సమాచారం అందడంతో నాగరాజు అక్కడకు వెళ్లి చూడగా సెల్‌ఫోన్ బదులుగా రోల్డు గోల్డు తాబేలు, రెండు పాదాలు, లక్ష్మీదేవి ప్రతిమ, పూజా సామగ్రి తదితర వస్తువులు ఉండటంతో అవాక్కయ్యాడు. వెంటనే గతంలో తనకు వచ్చిన ఫోన్ నంబర్లు 8010021314, 8744960255కు సంప్రదించినా ఫలితం లేకపోయిందని నాగరాజు వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment