
యశవంతపుర: పురుగుల మందు తాగిన ఐదుగురిలో దంపతులు, వృద్ధురాలు చనిపోయారు. చిత్రదుర్గ తాలూకా ఇసాముద్ర గ్రామానికి చెందిన తిప్పానాయక్(46), భార్య సుధాబాయి (43), వారి పిల్లలు రాహుల్, రమ్య, తిప్పానాయక్ తల్లి గుండి బాయి(75)లు సోమవారం రాత్రి పురుగుల మందు తాగారు. ప్రాణాపాయంలో ఉన్న ఐదుగురినీ గ్రామస్థులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తిప్పానాయక్, సుధాబాయి, గుండిబాయిలు మృతి చెందారు. పిల్లలు దావణగెరె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక సమస్యలే కారణంగా భావిస్తున్నారు. భరమసాగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment