
యశవంతపుర : ఇద్దరు స్నేహితుల మధ్య మద్యం విషయంపై జరిగిన ఘర్షణలో ఒకరు హత్యకు గురైన ఘటన రామమూర్తినగర పోలీసుస్టేషన్ పరిధిలో జరగింది. యలహంకకు చెందిన రాజు (40), రామమూర్తినగర 4వ క్రాస్ బోవి కాలనీకి చెందిన నేత స్నేహితులు. మద్యం అంగళ్లు తెరవటంతో మంగళవారం సాయంత్రం ఇద్దరు కలిసి మద్యం తెచ్చుకొని నేతా ఇంట్లోనే రాత్రి 10:30 గంటల వరకు తాగారు. రాజునే ఎక్కువ మద్యం తాగేశాడని నేతా గొడవ పడ్డారు. నేతా రాజు తలను గోడకేసి గుద్ది, మంట పాత్రతో తలపై బలంగా బాది హత్య చేశాడు. రామమూర్తినగర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో వ్యక్తిని హత్య చేసిన నేతా జైలుకెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.