ప్రియుడితో దొరికిన మహిళ.. ఆపై... | Wife Bite Off Husband Genitals to Save Lover in Vellore | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 3 2018 5:01 PM | Last Updated on Fri, Aug 3 2018 9:53 PM

Wife Bite Off Husband Genitals to Save Lover in Vellore - Sakshi

భర్త ముందే గుడి మండపంలో కక్కుర్తి పని...

వెల్లూరు: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. పరాయి వ్యక్తితో మహిళ వివాహేతర సంబంధం భర్త కంటపడింది. ఇద్దరూ రాసలీలల్లో మునిగిపోయిన సమయంలో అడ్డంగా దొరికిపోయారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ భర్త.. వారిని ఊరి ముందు నిలబెట్టేందుకు యత్నించాడు. కానీ, అతని నుంచి తప్పించుకునే క్రమంలో ఆ భార్య.. భర్త మర్మాంగాన్ని కొరికిపడేసింది. వెల్లూరులోని గుడియాతం మండలం తురైమూలై గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే... 

సెంథామరై(55) అనే రైతు తన భార్య జయంతితో కలిసి ఊళ్లో జరిగిన ఉత్సవానికి హాజరయ్యాడు. ఆ సమయంలో జనసందోహంలో భార్య తప్పిపోగా.. కంగారుపడ్డ సెంథామరై ఆమె కోసం అంతా గాలించాడు. ఆ ప్రాంతానికి కాస్త దూరంలోని ఓ మండపంలో ధచ్ఛనమూర్తి అనే వ్యక్తితో ఆమె అభ్యంతరకర స్థితిలో కనిపించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సెంథామరై వారిని నిలదీశాడు. గ్రామస్థుల కోసం కేక వేయగా.. విషయం తెలిస్తే ఊరంతా చితకబాదుతుందన్నన భయంతో వారిద్దరూ పారిపోయేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆ ముగ్గురి మధ్య పెనుగులాట చోటుచేసుకోగా.. సెంథామరై పంచె ఊడిపోయింది. (భార్య అశ్లీల వీడియో.. తట్టుకోలేక...)

భయంతో ఏం చేయాలో పాలుపోని జయంతి.. భర్తపై పడి మర్మాంగాన్ని కొరికి పడేసింది. ఆపై ప్రియుడితో అక్కడి నుంచి పరుగు అందుకుంది. ఉత్సవాల వేడుకల హడావుడి ఎక్కువగా ఉండటంతో స్థానికులెవరూ సెంథామరై కేకలను వినలేదు. కాసేపటికి అటుగా వెళ్తున్న కొందరు రక్తపు మడుగులో పడి ఉన్న సెంథామరైను గమనించి ఆస్పత్రికి తరలించారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా ధచ్ఛనమూర్తి, జయంతిలను గురువారం వెల్లూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. బహిరంగ అశ్లీలత, హత్యాయత్నం  తదితర కేసులు వారిద్దరిపై నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement