genitals cut off
-
నిద్రపోతున్న ప్రియుడిపై ప్రియురాలి దారుణం
తైపీ: తనతో సహజీవనం చేస్తున్న ప్రియుడు వేరే మహిళతో సంబంధంపెట్టుకోవడాన్ని ఆ మహిళ భరించలేకపోయింది. ప్రియుడికి ఎలాగైన బుద్ధి చెప్పాలనుకుంది. మద్యం మత్తులో నిద్రలోకి జారుకున్న తర్వాత ప్రియుడి అంగాన్ని కోసేసి తన కోపాన్ని తీర్చుకొంది. ఈ ఘటన తైవాన్‌లోని చాంఘువా కౌంటీలోని జిహుటౌన్‌షిప్‌లో చోటుచేసుకుంది. 52 ఏళ్ల హువాంగ్ తన ప్రియురాలు పూంగ్తో కలిసి సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరికి ముగ్గురు పిల్లలు. అయితే పుంగ్‌కు తన ప్రియుడు మరో మహిళతో సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. దీంతో అతను రోజులాగే తాగి నిద్రలోకి జారుకున్నాడు. వెంటనే పుంగ్ వంట గదిలోకి వెళ్లి ఒక పదునైన కత్తి తీసుకొని వచ్చి ప్రియుడి అంగాన్ని కొసేసింది. మత్తులో ఉన్న అతనికి నొప్పి తెలియలేదు. ఆ తర్వాత ఆమె దాన్ని బాత్రూంలో పడేసి ఫ్లష్ చేసింది. ఉదయాన్నే నిద్రనుంచి లేచిన హువాంగ్ అంగం వద్ద నొప్పిగా ఉండటంతో చూశాడు. ఆ తర్వాత బెడ్‌షిట్ అంతా రక్తపు మరకలే ఉన్నాయి. వెంటనే భయపడిపోయాడు. తన ప్రియురాలు కోసం అరిచాడు. ఆమె కనిపించలేదు. కాసేపు చుట్టుపక్కల తెగిపడిన అంగం కోసం వేతికాడు.. దొరకలేదు. వెంటనే ఆసుపత్రికి ఫోన్ చేశాడు. అంబులెన్స్ వచ్చి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడికి డాక్టర్లు అత్యవసర చికిత్సను అందించారు. మూత్రం మార్గంలో ప్రత్యేకంగా సర్జరీ చేశారు. ఆ వ్యక్తికి మొదట ఈ పని ఎవరు చేశారో తెలియలేదు. అయితే, కొన్ని రోజులకు ఈ పనిచేసింది తన ప్రియురాలే అని తెలిసి ఆశ్చర్యపోయాడు. ‘తాను మద్యం మత్తులో ఉన్నప్పుడు తనపై అనుమానంతోనే ప్రియురాలు ఈ పని చేసిందని తెలుసుకొని షాక్‌కు గురయ్యాడు. ఆ ఘటన తర్వాత పుంగ్నేరుగా పోలీసులు దగ్గరికి వెళ్లి లొంగిపొయింది. తను తన ప్రియుడిపై అనుమానంతోనే ఈ పనిచేసినట్లు ఒప్పుకొంది. కేసు నమోదుచేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కోరిక తీర్చలేదని మైనర్ బాలుడిపై..
న్యూఢిల్లీ : గ్రేటర్ నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. తన కోర్కెను తీర్చలేదని 13 ఏళ్ల బాలుడి జననాంగాలను ఓ వివాహిత గాయపరిచిన ఘటన వెలుగుచూసింది. బదాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చప్రౌలా గ్రామంలో ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితురాలు గత శుక్రవారం ఒంటరిగా ఉన్న సమయంలో తన పొరుగింట్లో ఉండే 13 ఏళ్ల బాలుడిని తన ఇంటికి పిలిచి తన కోర్కెను తీర్చాలని బలవంతపెట్టిందని, బాలుడు నిరాకరించడంతో వేడి అట్లకాడతో జననాంగాలపై వాతపెట్టిందని పోలీసులు తెలిపారు. బాధిత బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. నిందితురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని చెప్పారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని, పోలీసులకు ఫిర్యాదు చేయడంలో జాప్యం జరగడం వంటి పలు సందేహాలపైనా విచారణలో దృష్టిసారిస్తామన్నారు. పరారీలో ఉన్న నిందితురాలిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. -
ప్రియుడితో దొరికిన మహిళ.. ఆపై...
వెల్లూరు: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. పరాయి వ్యక్తితో మహిళ వివాహేతర సంబంధం భర్త కంటపడింది. ఇద్దరూ రాసలీలల్లో మునిగిపోయిన సమయంలో అడ్డంగా దొరికిపోయారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ భర్త.. వారిని ఊరి ముందు నిలబెట్టేందుకు యత్నించాడు. కానీ, అతని నుంచి తప్పించుకునే క్రమంలో ఆ భార్య.. భర్త మర్మాంగాన్ని కొరికిపడేసింది. వెల్లూరులోని గుడియాతం మండలం తురైమూలై గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే... సెంథామరై(55) అనే రైతు తన భార్య జయంతితో కలిసి ఊళ్లో జరిగిన ఉత్సవానికి హాజరయ్యాడు. ఆ సమయంలో జనసందోహంలో భార్య తప్పిపోగా.. కంగారుపడ్డ సెంథామరై ఆమె కోసం అంతా గాలించాడు. ఆ ప్రాంతానికి కాస్త దూరంలోని ఓ మండపంలో ధచ్ఛనమూర్తి అనే వ్యక్తితో ఆమె అభ్యంతరకర స్థితిలో కనిపించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సెంథామరై వారిని నిలదీశాడు. గ్రామస్థుల కోసం కేక వేయగా.. విషయం తెలిస్తే ఊరంతా చితకబాదుతుందన్నన భయంతో వారిద్దరూ పారిపోయేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆ ముగ్గురి మధ్య పెనుగులాట చోటుచేసుకోగా.. సెంథామరై పంచె ఊడిపోయింది. (భార్య అశ్లీల వీడియో.. తట్టుకోలేక...) భయంతో ఏం చేయాలో పాలుపోని జయంతి.. భర్తపై పడి మర్మాంగాన్ని కొరికి పడేసింది. ఆపై ప్రియుడితో అక్కడి నుంచి పరుగు అందుకుంది. ఉత్సవాల వేడుకల హడావుడి ఎక్కువగా ఉండటంతో స్థానికులెవరూ సెంథామరై కేకలను వినలేదు. కాసేపటికి అటుగా వెళ్తున్న కొందరు రక్తపు మడుగులో పడి ఉన్న సెంథామరైను గమనించి ఆస్పత్రికి తరలించారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ధచ్ఛనమూర్తి, జయంతిలను గురువారం వెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బహిరంగ అశ్లీలత, హత్యాయత్నం తదితర కేసులు వారిద్దరిపై నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై వెల్లడించారు. -
భార్యతో ఉన్నాడని.. కోసేశాడు!
పక్కింటి మనిషి తన భార్యతో అభ్యంతరకరమైన పరిస్థితిలో కలిసుండటం చూసి కోపంతో ఊగిపోయిన ఓ వ్యక్తి.. అతడి జననాంగాలను కోసేశాడు. దాంతో అతడు మరణించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని హర్దా సమీపంలో గల బస్పని గ్రామంలో జరిగింది. పతిరామ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉండటాన్ని చూసిన మంగళ్ (45)కు పట్టలేని కోపం వచ్చిందని, దాంతో వెంటనే గొడ్డలి తీసుకుని దాడి చేశాడని పోలీసులు తెలిపారు. జననాంగాల మీద గొడ్డలి వేటు వేయడంతో పతిరామ్ అక్కడికక్కడే మరణించాడన్నారు. తర్వాత పోలీసులకు లొంగిపోడానికి స్టేషన్‌కు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి, అక్కడినుంచి పారిపోయాడు. పోలీసులు హత్యకేసు నమోదుచేసి మంగళ్ కోసం గాలింపు మొదలుపెట్టారు.