
భర్త ప్రియురాలిపై భార్య దాడి
కర్ణాటక: భర్త రాసలీలలతో విసిగిపోయిన భార్య చివరకు భర్త ప్రియురాలినే దేహశుద్ధి చేసిన సంఘటన కర్నాటక దొడ్డబళ్లాపురంలో జరిగింది. మైసూరుకు చెందిన శోభ(26)కు దొడ్డబళ్లాపురం నివాసి మంజునాథరెడ్డి(35)తో 14 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం జరిగింది.
శోభ కథనం మేరకు... మంజునాథరెడ్డి రియల్‌ఎస్టేట్ వ్యాపారం పేరుతో ఊరూరా తిరుగుతూ ప్రతి ఊళ్లో ఒక ప్రేయసితో కాపురం పెట్టేవాడు. వివాహేతర సంబంధాల వల్ల చాలాసార్లు గొడవలు జరిగాయి. మంజునాథరెడ్డి శాంతినగర్‌కు చెందిన ఒక మహిళతో ఉన్నాడని తెలుసుకున్న శోభ శుక్రవారం రాత్రి మీడియాను వెంటబెట్టుకుని సదరు మహిళ ఇంటికి వెళ్లింది. ఆమెను వీధిలోకి లాక్కొచ్చి దేహశుద్ధి చేసింది. ఆ సమయంలో మంజునాథరెడ్డి అక్కడ లేడు.
వివాహేతర సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ భర్త అడ్డుపడగా అతడ్ని కూడా శోభ తీవ్రంగా కొట్టింది. పిల్లల భవిష్యత్తు కోసమైనా తన భర్త తనకు కావాలని, న్యాయపోరాటం చేసైనా తన భర్తను దక్కించుకుంటానని శోభ తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారినీ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. అప్పటికే విషయం తెలుసుకున్న మంజునాథరెడ్డి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు.