బరేలీ: ప్రతీకారంతో రగిలే వ్యక్తి ఎంతకైనా తెగిస్తాడంటారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖేరి జిల్లా మితౌలీ గ్రామంలో కాశీ కాశ్యప్(50) అనే వ్యక్తి అదే చేశాడు. తన కొడుకును చంపి జైల్లో ఉన్న వ్యక్తిని బెయిల్‌పై బయటకు తీసుకొచ్చి మరీ హత్య చేశాడు. కాశీ దంపతులకు జితేంద్ర(14) అనే కొడుకున్నాడు. 2020లో ఓ హత్య కేసులో కాశీ జైలుకెళ్లాడు.
తర్వాత అతని భార్యకు సమీప బంధువైన శత్రుధన్ లాలా (47)తో అక్రమ సంబంధం ఏర్పడింది. వారిద్దరూ తమకు అడ్డుగా ఉన్న జితేంద్రను చంపేశారు. ఈ కేసులో ఇద్దరూ జైలుపాలయ్యారు. గతేడాది కాశీ జైలు నుంచి బయటికొచ్చాడు. కొడుకును పొట్టనపెట్టుకున్న లాలాపై ప్రతీకారంతో రగిలిపోయాడు. సొంత ఖర్చుతో లాయర్‌ను ఏర్పాటు చేసి మరీ లాలాను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చాడు. శుక్రవారం రాత్రి అతన్ని తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసులు కాశీని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment