8.2 శాతం నుంచి 7.5 శాతానికి..!
2016 భారత్ వృద్ధి రేటు అంచనాకు ఐక్యరాజ్యసమితి కోత
న్యూఢిల్లీ/బ్యాంకాక్: భారత్ 2016 ఆర్థికాభివృద్ధి రేటు అంచనాను ఐక్యరాజ్యసమితి తగ్గించింది. ఇంతక్రితం అంచనా 8.2 శాతంకాగా దీనిని 7.5 శాతానికి తగ్గించింది. సంస్కరణల అమల్లో జాప్యమే తమ అంచనా కోతకు కారణమని పేర్కొంది. యూఎన్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ (ఆసియా-పసిఫిక్) ఈ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం భూ సేకరణ, కార్మిక చట్టాలు, వస్తు, సేవల పన్ను... వంటి అంశాలు ఉన్నాయి. ఆయా సంస్కరణల పథంలో ముందడుగు పడితే... దేశం వృద్ధి బాటన మరింత పురోగతి సాధించే అవకాశం ఉంది.