Hebbuli Hairstyle Cutting Ban In Bagalkot, School Teachers Urges Salon Management - Sakshi
Sakshi News home page

Hebbuli Hairstyle Cutting Ban: హెబ్బులి కటింగ్‌ నిషేధం..

Published Mon, Jul 24 2023 7:50 AM | Last Updated on Mon, Jul 24 2023 8:50 AM

Hebbuli hairstyle Cutting Ban - Sakshi

యశవంతపుర: హెబ్బులి సినిమాలో హీరో సుదీప్‌ ప్రత్యేకమైన తలకట్టుతో కనిపిస్తాడు. అటువంటి కటింగ్‌ కావాలని పిల్లలు, యువత సెలూన్లలో పట్టుబడుతున్నారు. బాగలకోట జిల్లా జమఖండి తాలూకా కులహళ్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ఈ మక్కువ ఎక్కువైపోయింది.

స్థానిక సెలూన్‌కు వెళ్లి అదే కటింగ్‌ కొట్టించుకుంటున్నారు. ఒకరిని చూసి మరొకరు వెళ్తుండడంతో స్కూల్లో పాఠాల కంటే ఇదే ఎక్కువ చర్చనీయాంశమైంది. దీంతో దయచేసి మా స్కూలు పిల్లలకు ఈ కటింగ్‌ చేయవద్దని సెలూన్‌ నిర్వాహకులకు ఉపాధ్యాయులు స్పష్టంచేశారు.

పిల్లలు చదువుకోవడానికి బదులుగా అద్దం ముందు కటింగ్‌ చూసుకుంటూ గడుపుతున్నారని వాపోయారు. ఎవరైనా వచ్చి అడిగితే హెబ్బులి కటింగ్‌ చేయరాదని విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement