సీనియర్ ఉద్యోగులపై ఆ బ్యాంకు వేటు!
Published Fri, Jan 20 2017 8:10 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM
గ్లోబల్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ సీనియర్ ఉద్యోగులపై వేటు వేయడం ప్రారంభించింది. ఈ వారంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ డివిజెన్లో పనిచేస్తున్న దాదాపు 100 మంది సీనియర్ ఉద్యోగులను హెచ్ఎస్బీసీ తొలగిస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ కోత ప్రభావం గ్లోబల్ బ్యాంకింగ్, మార్కెట్స్ డివిజన్లో పనిచేస్తున్న మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్ స్థాయిలో ఉండనుందని తెలుస్తోంది.
గ్లోబల్ బ్యాంకింగ్ అండ్ మార్కెట్స్లో కంపెనీ వార్షిక ప్రదర్శనను సమీక్షిస్తున్నామని బ్యాంకు అధికార ప్రతినిధి ఈ-మెయిల్ ప్రకటనలో తెలిపారు. తమ వ్యాపారాలను వృద్ధి పరుచుకుని, బలపడటానికి కొన్ని మార్పులు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. హెచ్ఎస్బీసీ తన పూర్తి ఏడాది రాబడులను ఫిబ్రవరి 21న రిపోర్టు చేయనుంది. ఈ ఏడాది హెచ్ఎస్బీసీ బ్యాంకు షేర్లు 3.3 శాతం పైకి ఎగిశాయి.
Advertisement
Advertisement