హెచ్‌ఎస్‌బీసీ మిడ్‌క్యాప్ ఫండ్
ఈక్విటీల్లో స్మాల్‌క్యాప్ కంటే మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ విభాగంలో ఆటుపోట్లు కాస్త తక్కువగా ఉంటాయి. స్మాల్‌క్యాప్‌లో రాబడులతోపాటు అస్థిరతలు కూడా ఎక్కువే. అందుకే పెట్టుబడుల్లో కేవలం స్మాల్‌క్యాప్ ఒక్కటే కాకుండా లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ విభాగాల్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా రిస్‌్కను వైవిధ్యం చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. మిడ్‌క్యాప్ విభాగంతోపాటు లార్జ్‌క్యాప్‌లోనూ పెట్టుబడులకు అవకాశం కలి్పస్తూ, మెరుగైన రాబడుల చరిత్ర కలిగిన పథకాల్లో హెచ్‌ఎస్‌బీసీ మిడ్‌క్యాప్ ఫండ్ ఒకటి. దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు.
రాబడులు
ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు 44 శాతం రాబడులు తెచ్చి పెట్టింది. కానీ, ఈక్విటీ మిడ్‌క్యాప్ విభాగం సగటు రాబడి ఇదే కాంలో 31.59 శాతంగానే ఉంది. మూడేళ్లలో 26.67 శాతం చొప్పున వార్షిక ప్రతిఫలాన్ని అందించగా, ఇదే కాలంలో మిడ్‌క్యాప్ విభాగం సగటు రాబడి 23.64 శాతంగా ఉండడాన్ని గమనించొచ్చు. ఇక ఐదేళ్లలో 25.40 శాతం, ఏడేళ్లలో ఏటా 15.33 శాతం, పదేళ్లలో ఏటా 17.69 శాతం వార్షిక రాబడులను అందించిన చరిత్ర ఈ పథకానికి ఉంది. మిడ్‌క్యాప్ విభాగం సగటు రాబడుల కంటే అధిక ప్రతిఫలాన్ని అందించింది. 2004 ఆగస్ట్‌లో ఈ పథకం మొదలు కాగా, నాటి నుంచి చూస్తే వార్షిక పెట్టుబడుల వృద్ధి 19.90 శాతంగా ఉంది. గతంలో ఎల్‌అండ్‌టీ మిడ్‌క్యాప్‌ఫండ్‌గా ఇది కొనసాగింది. హెచ్‌ఎస్‌బీసీ కొనుగోలు తర్వాత పథకం పేరు మారింది.
పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో
మిడ్‌క్యాప్ ఫండ్ అయినప్పటికీ తన మొత్తం నిర్వహణ ఆస్తుల్లో అధిక శాతాన్ని లార్జ్‌క్యాప్‌లోనే ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. రిస్క్ తగ్గించడం, రాబడులను పెంచడం అనే వ్యూహంలో భాగంగా లార్జ్, మిడ్‌క్యాప్ విభాగాల మధ్య పెట్టుబడుల్లో ఫండ్ మేనేజర్లు మార్పులు చేర్పులు చేస్తుంటారు. ప్రస్తుతం మిడ్‌క్యాప్‌తో పోలి్చతే లార్జ్‌క్యాప్ వ్యాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉండడాన్ని గమనించొచ్చు. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం 11,912 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో 98.31 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. 1.7 శాతం నగదు, నగదు సమానాల్లో ఉన్నాయి.
ఈక్విటీ పెట్టుబడుల్లో 67 శాతం లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 32.68 శాతం ఇన్వెస్ట్ చేసింది. స్మాల్‌క్యాప్‌లో కేవలం 0.46 శాతమే పెట్టుబడులు ఉండడం గమనించొచ్చు. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 72 స్టాక్స్ ఉన్నాయి. ఇందులో టాప్ 10 స్టాక్స్‌లోనే 37 శాతం పెట్టుబడులు పెట్టింది. కనీసం రూ.500 మొత్తంతో ఈ పథకంలో సిప్ మొదలు పెట్టుకోవచ్చు. పోర్ట్‌ఫోలియోని గమనిస్తే.. ఇండ్రస్టియల్స్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచి్చంది.
మొత్తం పెట్టుబడుల్లో 34 శాతం ఈ రంగానికి చెందిన కంపెనీల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 18 శాతం, కన్జ్యూమర్ డి్రస్కీíÙనరీ కంపెనీలకు 12.53 శాతం, టెక్నాలజీ రంగ కంపెనీలకు 9.37 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment