పర్యావరణ శాఖకు తాజా బడ్జెట్‌లో కోత పడింది. గతేడాది ఈ శాఖకు రూ. 1,764.6 కోట్లను కేటాయించగా, ఈసారి ఐదు శాతం తగ్గించి రూ. 1,681.60 కోట్లను కేటాయించారు. అదేవిధంగా వాయు, నీటి కాలుష్య నివారణ చర్యల కోసం నిధులను 48 శాతం పెంచి రూ. 136.33 కోట్లు కేటాయించారు. జాతీయ నదుల్లో కాలుష్య నివారణకు ప్రత్యేకంగా కేటాయించిందేమీ లేదు. వన్యప్రాణుల సంరక్షణకు, అడవుల పెంపకానికి, ఇతర పర్యావరణ కార్యక్రమాలకు నామమాత్రంగా నిధులు కేటాయించారు.