general budget
-
ఏపీకి ప్రత్యేకహోదా తప్ప ఏమీ వద్దు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ మనుగడకు 16 మంది ఎంపీలను అందించిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తప్ప ఇంకేది అవసరం లేదని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.The people of AP whose 16 MPs are keeping the Central Government stable deserve nothing but Special Category Status. Not “arranged” additional loans, no Special Package, no concession, only Special Category Status. The General Budget is a play of words for us.— Vijayasai Reddy V (@VSReddy_MP) July 26, 2024శుక్రవారం(జులై 26) ఈ విషయమై ఆయన ఎక్స్‌లో ఒక ట్వీట్ చేశారు. ‘కేంద్రం ఏర్పాటు చేసే అదనపు రుణాలు, ప్రత్యేక ప్యాకేజీ, మినహాయింపులు ఏవీ వద్దు. ఒక్క ప్రత్యేక హోదానే కావాలి. కేంద్ర బడ్జెట్ మాకు మాటల గారడిలా ఉంది అని విజయసాయిరెడ్డి విమర్శించారు. -
‘ప్రాణహిత’కు జాతీయ హోదా ఇవ్వాలి
ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని ప్రాణహిత– కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ కేంద్రాన్ని కోరారు. గురువారం రాజ్యసభలో సాధారణ బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేసి రాష్ట్రంలో నదీ జలాలను సమర్థవం తంగా వినియోగించుకునే అవకాశాన్ని కల్పిం చాలని కోరారు. బడ్జెట్లో సంస్కరణల కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. నోట్ల రద్దుతో అసంఘటిత రంగం పూర్తిగా దెబ్బతిందని ఈ రంగంలోని కార్మికుల సంక్షేమానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఇక రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ఉండదు!
న్యూఢిల్లీ: 92 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ప్రత్యేక రైల్వే బడ్జెట్ సంప్రదాయానికి ఇక తెరపడనుంది. వచ్చే ఏడాది నుంచి రైల్వే బడ్జెట్ కేంద్ర సార్వత్రిక బడ్జెట్లో విలీనం కానుంది. ఈ మేరకు రైల్వేమంత్రి సురేశ్ ప్రభు చేసిన ప్రతిపాదనకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆమోదం తెలిపారు. కేంద్ర బడ్జెట్లో రైల్వే బడ్జెట్ విలీనంపై విధివిధానాలు ఖరారుచేసేందుకు ఆర్థికమంత్రిత్వశాఖ ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో ఆర్థికశాఖ, రైల్వే శాఖ సీనియర్ అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ నెల 31నాటికి నివేదిక సమర్పించాల్సిందిగా కమిటీని ఆర్థికశాఖ ఆదేశించింది. 'కేంద్ర బడ్జెట్లో రైల్వే బడ్జెట్‌ను విలీనం చేయాల్సిందిగా ఆర్థికమంత్రి జైట్లీకి లేఖ రాశాను. రైల్వే ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. విలీనం విధివిధానాలపై మేం కసరత్తు చేస్తున్నాం' అని ప్రభు పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. -
రెండు బడ్జెట్ల విలీన అధ్యయనం షురూ
92 ఏళ్ల క్రితం నుంచి ఆనవాయితీగా కొనసాగుతూ వస్తున్న ప్రత్యేక రైల్వే బడ్జెట్‌కు చరమగీతం పాడేందుకు.. సాధారణ బడ్జెట్లో విలీనం చేసే ప్రతిపాదన ప్రక్రియను పరిశీలించడం ప్రారంభించామని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ తెలిపింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని.. రైల్వే మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ పరిశీలన ప్రక్రియను ప్రారంభించామని ఆర్థికశాఖ కార్యదర్శి అశోక్ లావాసా తెలిపారు.రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్ లో విలీనం చేయాలని కోరుతూ గత నెలలోనే రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనపై లాభనష్టాలన్నింటినీ బేరీజు వేసిన అనంతరమే తాము ఓ నిర్ణయానికి రాగలుగుతామని అశోక్ లావాసా వెల్లడించారు.ఒకవేళ విలీనానికి గ్రీన్ సిగ్నల్ వస్తే ప్రస్తుతం చెల్లించే వార్షిక డివిడెంట్ నుంచి రైల్వే విమోచనం పొంది ప్రభుత్వం నుంచి స్థూల బడ్జెటరీ సపోర్టును అందకోనుంది. దీంతో కొంతమేర నష్టాలను రైల్వే అధిగమించగలుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ చెబుతోంది. 1924 నుంచి రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌నుంచి విడదీసి ప్రత్యేకంగా కేటాయింపులు చేయడం జరుగుతూ వస్తోంది. అప్పట్లో మొత్తం బడ్జెట్లో 70 శాతంగా ఉన్న రైల్వే బడ్జెట్ ప్రస్తుతం 15 శాతంగా మాత్రమే ఉంటోంది. దీంతో పాటు ప్రస్తుతం రైల్వే అధిక రెవెన్యూ లోటును భరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో రెండు బడ్జెట్లను విలీనం చేసి, ఈ భారాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖకు బదలాయించాలని సురేష్ ప్రభు ఈ విలీన ప్రతిపాదనను అరుణ్ జైట్లీ ముందుంచారు. రెండు బడ్జెట్ విలీన ప్రతిపాదనతో లేఖ రాసిన సురేష్ ప్రభు,అసలకే నష్టాల్లో ఉన్న రైల్వే, 7వ వేతన సంఘ సిఫారసులు వల్ల ఏర్పడే అదనపు నష్టాన్ని కూడా లేఖలో వివరించారు. -
రైల్వే బడ్జెట్ కు చరమగీతం?
న్యూఢిల్లీ : 92 ఏళ్ల క్రితం నాటి నుంచి ఆనవాయితీగా కొనసాగుతూ వస్తున్న ప్రత్యేక రైల్వే బడ్జెట్ కు ఎన్డీయే ప్రభుత్వం చరమగీతం పాడనుందా..? అంటే అవుననే అనిపిస్తోంది. రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో విలీనం చేయాలని కోరుతూ రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. 92 ఏళ్ల నాటి నుంచి వస్తున్న ప్రత్యేక బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో కలపడాన్ని సురేష్ ప్రభు ప్రతిపాదించారని సీనియర్ రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు చెప్పారు. జూన్ లోనే ఆర్థిక మంత్రికి ఈ లేఖను పంపించారని, ఇంకా అరుణ్ జైట్లీ నుంచి ఎలాంటి సమాధాన రాలేదని అధికారులు పేర్కొన్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ డేబ్రోయ్ ఈ విలీనాన్ని మొదట ప్రతిపాదించిన అనంతరం, రైల్వేశాఖ సమాధానం కోరుతూ గత నెల ప్రధానమంత్రి కార్యాలయం ఈ లేఖను పంపింది. ఈ నిర్ణయంపై సానుకూలంగా స్పందిస్తూ.. ఆర్థికమంత్రికి ఈ లేఖను రైల్వే శాఖ పంపించింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో 2017-18 రైల్వే బడ్జెట్ లేదా 2016-17 బడ్జెట్, రైల్వేకు తుది బడ్జెట్ కానుందని అధికారులు చెప్పారు. ఈ విలీన ప్రతిపాదనతో, మొత్తం ఆర్థిక భారం ఇక నుంచి ఆర్థిక మంత్రి చేతులోకి వెళ్లనుంది. అయితే ఈ విలీనానికి సంబంధించి గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్యాసెంజర్ సెగ్మెంట్ లో రైల్వే రూ. 34,000కోట్ల నష్టాలను భరిస్తుంది. రాబడులు సైతం పతనమవుతున్నాయి. -
రాయితీలు.. ఉపాధి.. వృద్ధి!
ఇదీ... బడ్జెట్ ముందు కోర్కెల చిట్టా మరో వారం రోజులే ఉంది. అందరూ ఎదురుచూస్తున్న 2016-17 సాధారణ బడ్జెట్‌ను 29న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. మోదీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న రెండవ పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. దీనిపై పారిశ్రామిక వర్గాలు భారీ ఆశలే పెట్టుకున్నాయి. కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి మూడేళ్లలో 25 శాతానికి తెస్తామన్న ప్రభుత్వం... అందుకోసం రాయితీలకు కోత వేస్తుందన్న వార్తలు చర్చనీయమవుతున్నాయి. మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న... మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి కార్యక్రమాలకు బడ్జెట్లో ఏ మేరకు ప్రాధాన్యమిస్తారన్నది ఆర్థిక వేత్తల్లో ఆసక్తికరంగా మారింది. టెలికం సహా ఐటీ రంగం సైతం ఇంకా కొన్ని మినహాయింపులను కోరుతున్న నేపథ్యంలో... బడ్జెట్‌పై నిపుణులేమంటున్నారు? ఏ రంగం ఏం కోరుకుంటోంది? ఆర్థికవేత్తల మాటేంటి? ఇవన్నీ మీకోసం అందిస్తోంది ‘సాక్షి బిజినెస్’. ఈ రోజు నుంచే... ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ తయారీపై దృష్టి భారత్‌లో కన్సూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ముడి చమురు, పసిడి తరువాత వీటి దిగుమతులే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ తయారీకి దేశంలో మౌలిక సదుపాయాలు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఈ విభాగంపై బడ్జెట్ దృష్టి పెట్టాలి. ఐటీ హార్డ్‌వేర్ తయారీలో వినియోగించే కొన్ని ఉత్పత్తుల దిగుమతులపై గత బడ్జెట్లో స్పెషల్ అదనపు సుంకం (ఎస్ఏడీ) మినహాయింపులు ఇవ్వడం ఈ రంగానికి ఊరటనిచ్చింది. రానున్న బడ్జెట్ నుంచి పరిశ్రమ కోరుతున్నవివీ... ♦ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్‌కు వర్తించే సుంకాలు, టారిఫ్‌లను ఇతర ఆసియా దేశాల స్థాయికి తగ్గించాలి. ♦ ఎల్సీడీ ప్యానల్స్, ఎఫ్ఏబీ, ఇతర ప్రొడక్టుల తయారీ ప్రోత్సాహానికి పలు పథకాలను ప్రారంభించాలి. ఇది దేశీయ ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ తయారీ రంగం పురోగతికి దోహదం చేస్తుంది. ♦ డేటా సెంటర్ల ఏర్పాటుకు విధాన పరమైన మద్దతు అవసరం. కనీస ప్రత్యామ్నాయ పన్నును (మ్యాట్) తగ్గించాలి. ♦ ఈ రంగానికి సంబంధించి చిన్న తరహా పరిశ్రమల్లో డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించాలి. ♦ స్మార్ట్ సిటీ చొరవలకు తగిన ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్ రూపకల్పన అవసరం. ఈ దిశలో ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలను తగ్గించాలి. - డాక్టర్ అరుణ్ సింగ్, సీనియర్ ఎకనమిస్ట్-డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఉపాధి పెంచేలా ఉండాలి... దేశంలో డిమాండ్ పెరగడానికి ఉపాధి అవకాశాలు మెరుగుపడటం అవసరం. ఈ విషయంపై బడ్జెట్ దృష్టి సారిస్తుందని భావిస్తున్నాం. దీనివల్ల ఇటు గ్రామాల్లో, అటు పట్టణాల్లో వినియోగపరమైన డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇది పారిశ్రామిక వృద్ధికి దోహదం చేస్తుంది. ముడిచమురు ధరలు తీవ్రంగా పతనమవటం వల్ల మన దిగుమతుల బిల్లు తగ్గింది. ఈ భారీ లాభాల్ని వృద్ధి బాటకు మళ్లించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మౌలిక రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది. ఈ దిశలో తగిన చర్యల వల్ల మధ్య తరగతి ప్రజల చేతికి కొంత డబ్బు అందే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఎఫ్ఎంసీజీ రంగం తిరిగి చక్కటి వృద్ధి దిశలోకి మళ్లే వీలు కల్పిస్తుంది. దీనితోపాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, సబ్సిడీల వంటి ప్రయోజనాలను కల్పించడం వంటి చర్యలు రైతాంగం ఆర్థిక ప్రయోజనాలకు దోహదపడతాయి. విద్యా, నైపుణ్యం పెంపు చర్యలతో పాటు వస్తు, సేవల పన్ను వంటి సంస్కరణలు వృద్ధిని దీర్ఘకాలంలో పటిష్టం చేస్తాయి. - వివేక్ గంభీర్, ఎండీ- జీపీసీఎల్ ‘బ్యాడ్ బ్యాంకు’కు ఇదే సమయం... బ్యాంకింగ్ రంగం ఇపుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, దీనిపై బడ్జెట్లో ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉందని ఎస్బీఐ రీసెర్చ్ సంస్థ పేర్కొంది. ‘‘మొండిబకాయిలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీంతో పాటు బ్యాంకులకు తాజా మూలధనమివ్వటం కూడా ప్రధానమే. బ్యాంకింగ్ రంగం పునరుద్ధరణకు బడ్జెట్ ద్వారా స్పష్టమైన ఎజెండా నిర్దేశించాలి. రద్దు చేసినవి, మొండిబకాయిలు కాకుండా... మొండిబకాయిలుగా మారే అవకాశమున్న రుణాలే దాదాపు రూ.6.5 లక్షలకు చేరాయి. బ్యాంకింగ్ తీవ్ర ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాలను చూడ్డానికి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చెయ్యాలి. అందుకు తగిన సమయమిదే’’ అని సంస్థ సోమవారం విడుదల చేసిన నివేదికలో వివరించింది. ఇబ్బందుల్లో ఉన్న ఆస్తుల్ని కొనుగోలు చేయటం, లేదా స్వాధీనం చేసుకుని, పునర్వ్యవస్థీకరించడం, నిర్వహించడం ప్రధాన లక్ష్యాలుగా ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చెయ్యాలని సంస్థ పేర్కొంది. ‘‘వృద్ధికి బయటి దేశాలపై ఆధారపడకూడదు. దేశీయంగా చక్కని మార్కెట్ ఏర్పాటు లక్ష్యంగా పన్ను వ్యవస్థలో సవరణలకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి. దీనితోపాటు ద్రవ్యలోటు లక్ష్యాల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వైదొలగబోమన్న స్పష్టమైన సంకేతం వెలువడాలి’’ అని సంస్థ కోరింది. బడ్జెట్ అనంతరం ఆర్బీఐ రేటు రెపోను 25 బేసిస్ పాయింట్లకన్నా ఎక్కువగా తగ్గించే అవకాశం ఉందని కూడా సంస్థ అభిప్రాయపడింది. స్టార్టప్స్‌కు పన్ను రాయితీలు అవసరం స్టార్టప్స్ ప్రస్తుతం తీవ్ర నిధుల సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్య పరిష్కారం దిశగా వీటికి సంబంధించి ప్రత్యక్ష, పరోక్ష పన్నుల (కనీస ప్రత్యామ్నాయ పన్ను సహా) ప్రోత్సాహకాలు అవసరం. నిధుల సమీకరణ భారాన్ని కొంత తగ్గించడానికి ఈ చర్య దోహదపడుతుంది. అలాగే కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రద్దు వల్ల స్టార్టప్స్‌ను ఎంతగానో ప్రోత్సహించినట్లవుతుంది. - బీవీఆర్ మోహన్ రెడ్డి, నాస్కామ్- చైర్మన్ ఈసారి పరిమితంగా బడ్జెట్ కాపీల ముద్రణ న్యూఢిల్లీ: పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సుల మేరకు ఈసారి ఆర్థిక సర్వే, బడ్జెట్ కాపీల సంఖ్యను తగ్గించాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అనంతరం ఈ రెండు డాక్యుమెంట్ల ప్రతులను ఆర్థిక శాఖ ఆన్లైన్లో ఉంచనుంది. మీడియా సంస్థలకు పంపే ప్రతుల సంఖ్యను కూడా తగ్గించేయనుంది. ఈసారి వాటికి ఆర్థిక సర్వే, బడ్జెట్ కాపీల ప్రతులు మూడు మాత్రమే లభిస్తాయి. ఇప్పటిదాకా అక్రిడేటెడ్ జర్నలిస్టులందరికీ ఈ కాపీలు అందుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 26న ఆర్థిక సర్వేను, 29న బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. -
సూచనలు భేష్.. అమలు మాటేంటో మరి!
దేశంలో ప్రభుత్వ పాలనను మరింత మెరుగుపర్చడానికి, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి అవసరమైన సూచనలు, సలహాలను ఇవ్వాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు ప్రజల నుంచి స్పందన భారీగా ఉంది. ప్రభుత్వం సూచించిన వెబ్సైట్ 'మైగవ్ డాట్ ఇన్'కు ఇప్పటివరకు 70 వేల సూచనలు వచ్చాయని, వాటిలో 50 వేలు సాధారణ బడ్జెట్‌కు సంబంధించినవి కాగా, మిగతా 20 వేల సూచనలు రైల్వే బడ్జెట్‌కు సంబంధించినవి ఉన్నాయి. అందులో కొన్ని ప్రభుత్వానికి పనికొచ్చే సృజనాత్మక సూచనలు ఉన్నాయని విశ్వసనీయ ప్రభుత్వవర్గాలు గురువారం వెల్లడించాయి. వాటిని తదుపరి పరిశీలన కోసం పీఎంవోకు, సంబంధిత విభాగాలకు పంపామని ఆ వర్గాలు తెలిపాయి. ఆ సూచనల్లో కొన్ని ఇలా ఉన్నాయి.. 1. పన్నులపై డబ్బు ఆదా చేసుకునేందుకు దొంగబిల్లుల దాఖలుకు వీలు కల్పిస్తున్న నిబంధనను రద్దు చేయాలి. చెల్లించిన పన్నులపై కొంత మొత్తాన్ని రీఎంబెర్స్ చేసుకోవడానికి ఉద్యోగులు దొంగ బిల్లులను సమర్పించడం ఎప్పుడూ జరిగేదే. 2. నల్ల డబ్బును అరికట్టేందుకు ఆదాయం పన్ను రిటర్న్స్‌లో కుటుంబసభ్యుల వివరాలు, తమమీద ఆధారపడి బతుకుతున్న వారి వివరాలు, వారందరి పాన్ నెంబర్ల వివరాలను ఇవ్వడం తప్పనిసరి చేయాలి. అలా చేస్తే మొత్తం కుటుంబానికి వస్తున్న ఆదాయం వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. 3. అలాగే ఆదాయం పన్ను రిటర్న్స్‌లో బ్యాంకు ఖాతా వివరాలను ఇచ్చినట్లే తాను, తన కుటుంబ సభ్యులు, బంధువుల ఆస్తుల వివరాలను, వాటి మార్కెట్ విలువను, వాటి చిరునామాలను తప్పనిసరిగా సమర్పించాలనే నిబంధనను తీసుకరావాలి. ఎందుకంటే కొంత మంది నల్లడబ్బును తెల్లగా మార్చుకునేందుకు కుటుంబ సభ్యులు, బంధువుల పేర్ల మీదున్న ఆస్తులను ఉపయోగించుకుంటున్నారు. 4. ఈసారి సాధారణ బడ్జెట్లో ఔషధాలపై సబ్సిడీలు ఇవ్వాలి. వైన్, సిగరెట్, బీడీ, పాన్ మసాలా, గుట్కా తదితరాలపై పన్నులను పది శాతం పెంచాలి. 5. రైల్వేల ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చేందుకు అన్ని రైళ్లలోని అన్ని బోగీలపై వాణిజ్య ప్రకటనలకు అనుమతించాలి. రైల్వే ఆస్తులను, మౌలిక సౌకర్యాలను కూడా వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగించాలి. ఈ విషయంలో అవసరమైతే కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం చేసుకోవాలి. 6. పన్నుల విధానాన్ని సులభతరం చేయాలి. ఆస్తిపన్నును రద్దుచేయాలి. దేశంలో యోగాను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పన్ను రాయతీని కల్పించాలి. సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్లను రూపొందించడానికి ముందు ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సూచన మేరకు ఆర్థిక, రైల్వేశాఖలు సూచనలను ఇవ్వాలని గత డిసెంబర్ నెలలో ప్రజలను కోరాయి. గత బడ్జెట్‌కు ముందు కూడా ప్రభుత్వం ఇలాంటి సూచనలే కోరింది. అప్పడు ప్రజలనుంచి వచ్చిన కొన్ని సూచనలను జనరల్, రైల్వే బడ్జెట్లో పొందుపర్చారు కూడా. -
పెరగనున్న విద్యుత్ చార్జీలు
బొగ్గుపై పర్యావరణ అనుకూల ఇంధన సెస్సును బడ్జెట్లో టన్నుకు రూ. 100 నుంచి రూ. 200కు రెట్టింపు చేయడం.. విద్యుత్ చార్జీల పెంపునకు దారి తీయనుంది. తాజా పరిణామంతో ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తి దిగ్గజం కోల్ ఇండియాపై రూ. 5,000 కోట్ల మేర భారం పడనుంది. దీన్ని అది విద్యుత్ ఉత్పత్తి సంస్థలపై.. అవి అంతిమంగా వినియోగదారులకు బదలాయించనున్నాయి. ఫలితంగా విద్యుత్ చార్జీలు యూనిట్‌కు కనీసం 4 పైసల మేర ప్రభావం పడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
పర్యావరణానికి కోత!
పర్యావరణ శాఖకు తాజా బడ్జెట్లో కోత పడింది. గతేడాది ఈ శాఖకు రూ. 1,764.6 కోట్లను కేటాయించగా, ఈసారి ఐదు శాతం తగ్గించి రూ. 1,681.60 కోట్లను కేటాయించారు. అదేవిధంగా వాయు, నీటి కాలుష్య నివారణ చర్యల కోసం నిధులను 48 శాతం పెంచి రూ. 136.33 కోట్లు కేటాయించారు. జాతీయ నదుల్లో కాలుష్య నివారణకు ప్రత్యేకంగా కేటాయించిందేమీ లేదు. వన్యప్రాణుల సంరక్షణకు, అడవుల పెంపకానికి, ఇతర పర్యావరణ కార్యక్రమాలకు నామమాత్రంగా నిధులు కేటాయించారు. -
‘స్వచ్ఛ' విద్యుత్!
దేశంలో విద్యుత్ కొరతను ఎదుర్కొనేందుకు సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని భారీ ఎత్తున చేపట్టాలని.. 2022 నాటికి 1,75,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే తీవ్ర విద్యుత్ కొరతతో అల్లాడుతున్న పలు ప్రాంతాల్లో ఐదు అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులను రూ. లక్ష కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ విషయాన్ని వెల్లడించారు. కానీ ఈ ప్రాజెక్టులను ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తామనే అంశాన్ని పేర్కొనలేదు. విద్యుత్ రంగానికి రూ. 61,404 కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాతే ప్రాజెక్టులను చేపట్టే (ప్లగ్ అండ్ ప్లే) విధానాన్ని అనుసరిస్తామని జైట్లీ వెల్లడించారు. బొగ్గు గనులకు సంబంధించి కూడా అన్ని రకాల అనుమతులు వచ్చిన అనంతరమే వేలం వేస్తామన్నారు. భారీ లక్ష్యం: ఏడేళ్లలో 1,75,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. అందులో లక్ష మెగావాట్లను సౌర విద్యుత్ ద్వారా, 60 వేల మెగావాట్లు పవన, 10 వేల మెగావాట్లు జీవ వ్యర్థాల ద్వారా, 5 వేల మెగావాట్లను చిన్న జల విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేస్తామని చెప్పారు. అణుశక్తికి రూ. 5,900 కోట్లు: దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి, పరిశోధనకు రూ. 5,900 కోట్లను కేటాయిస్తున్నట్లు జైట్లీ వెల్లడించారు. మొత్తంగా అణుశక్తి విభాగానికి రూ. 10,912 కోట్లను ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో బాబా ఆటామిక్ రీసెర్చ్ సెంటర్, కల్పక్కం అణు పరిశోధన కేంద్రాలకు రూ. 1,912 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. కూడంకుళం రెండో యూనిట్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమయ్యే అవకాశముందని.. దాంతో మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. కాగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడంపై ఆ రంగంలోని సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ నిర్ణయంతో దేశం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుందని సుజ్లాన్ గ్రూప్ చైర్మన్ తులసి తంతి పేర్కొన్నారు. తమ ఇండస్ట్రీకి ఇది మంచి బడ్జెట్ అని వెల్స్పన్ రెన్యూవబుల్స్ వైస్ చైర్మన్ వినీత్ మిట్టల్ చెప్పారు. ప్రస్తుత బడ్జెట్లో విద్యుత్ రంగానికి రూ. 61,404 కోట్లను కేటాయించారు. అదే 2013-14లో రూ. 57,949 కోట్లు, 2014-15లో సవరించిన అంచనా ప్రకారం 55,488 కోట్లు వ్యయం చేశారు. పునరుత్పాదక విద్యుత్‌కు ప్రోత్సాహంలో భాగంగా.. సౌర విద్యుత్ ఫలకాల తయారీలో వినియోగించే ‘ఎవాక్యుయేటెడ్ ట్యూబ్’లపై కస్టమ్స్ పన్నును మినహాయించారు. దీంతోపాటు పునరుత్పాదక విద్యుత్ వ్యవస్థల్లోని ఇన్వర్టర్ల తయారీకి ఉపయోగించే ‘యాక్టివ్ ఎనర్జీ కంట్రోలర్ (ఏఈసీ)’లపై పన్నును 5 శాతానికి తగ్గించారు. ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్రకారం రూ. లక్ష కోట్లతో ఐదు అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టుల (యూఎంపీపీ)ను ఏర్పాటు చేస్తారు. 4,000 మెగావాట్ల సామర్థ్యమున్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను యూఎంపీపీలుగా పేర్కొంటారు. ళీవిద్యుత్ కొరతతో సతమతమవుతున్న బిహార్‌లో వీటిల్లో ఒక ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీనికి జార్ఖండ్ లేదా ఒడిశాల నుంచి బొగ్గు సరఫరా చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందే ఏపీలోని కృష్ణపట్నం, మధ్యప్రదేశ్‌లోని ససాన్, జార్ఖండ్‌లోని తలైయాలో, గుజరాత్‌లోని ముంద్రాలో యూఎంపీపీలను చేపట్టింది. -
ఉపాధి హామీకి ఓకే..
2015-16 బడ్జెట్ కేటాయింపు రూ. 34,699 కోట్లు(12 శాతం పెంపు) 2014-15 బడ్జెట్ కేటాయింపు రూ. 31,000 కోట్లు(సవరించిన అంచనా) 2013-14 బడ్జెట్ కేటాయింపురూ. 33,000 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు కచ్చితంగా ఉపాధి భద్రతను కల్పించడం ఈ పథకం ఉద్దేశం. 2005లో దీనికోసం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్ఆర్ఈజీఏ) కార్యరూపం దాల్చింది. 2006 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకాన్ని 2008 నాటికి దేశంలోని అన్ని జిల్లాలకూ విస్తరించారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఫ్లాగ్షిప్ పథకాల్లో కీలకంగా నిలిచిన ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. అయితే, భారీగా నిధులను వెచ్చిస్తున్నప్పటికీ వనరుల కల్పనలో పెద్దగా ప్రభావం చూపడం లేదన్నది ప్రధాన విమర్శ. అయితే, మోదీ సర్కారు దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల పెంపు, ఆర్థికాభివృద్ధికి జత చేస్తామని చెబుతోంది. క్రీడా ప్రాంగణాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం వంటివి కూడా ఈ పథకంలోకి చేర్చింది. సబ్సిడీలకు ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ)ని అమలు చేసేందుకు ఎంపిక చేసిన 51 జిల్లాలకు గాను 46 జిల్లాల్లో ఉపాధి హామీ వేతనాల చెల్లింపును ఆధార్ కార్డులతో లింక్ చేశారు. అనుకున్న విధంగా ఖజానాకు నిధులు సమకూరితే మరో రూ.5,000 కోట్లను అదనంగా కేటాయిస్తామని కూడా జైట్లీ ప్రకటించారు. గ్రామీణ పేదల్లో ఏ ఒక్కరూ ఉపాధి లేకుండా ఉండకూడదన్నదే తమ ధ్యేయమని చెప్పారు. యూపీఏ పథకాలను మోదీ సర్కారు నీరుగారుస్తుందన్న విమర్శలను, ముఖ్యంగా ఈ పథకాన్ని నిలిపేస్తారన్న ఊహాగానాలను పక్కకునెడుతూ ఉపాధి హామీకి దండిగా నిధులను కేటాయించడం చెప్పుకోదగ్గ విషయం. -
ఫ్లాగ్‌షిప్‌లోకి ‘స్వచ్ఛభారత్'...
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్వచ్ఛ భారత్‌ను ఫ్లాగ్‘షిప్’ లోకి ఎక్కించారు. గత యూపీఏ సర్కారు మొదలుపెట్టిన పలు పథకాలను యథావిధిగా కొనసాగిస్తూనే మోదీ మార్కును చూపించేలా ఆర్థిక మంత్రి జైట్లీ జాగ్రత్త పడ్డారు. సెస్‌ల రూపంలో స్వచ్ఛ భారత్‌కు తగినన్ని నిధులను సమకూర్చేలా పకడ్బందీ ప్రణాళికను రూపొందించారు. ఇంకా దీనికోసం ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేయడమేకాకుండా.. దీనికిచ్చే విరాళాలకు పన్ను మినహాయింపులనూ అందిస్తామని చెప్పడం విశేషం. మరోపక్క, ఉపాధి హామీకి అత్యధికంగానే నిధులను కేటాయించడం ద్వారా గ్రామీణ ప్రాంతాలపై అత్యధికంగా దృష్టిసారిస్తున్నామన్న సంకేతాలిచ్చారు. స్వచ్ఛ భారత్.. 2015-16 కేటాయింపులు: రూ.3,625 కోట్లు 2019 అక్టోబర్ 2 నాటికి దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలకు 100 శాతం పారిశుధ్యాన్ని(సెప్టిక్ మరుగుదొడ్ల నిర్మాణం) కల్పించడం లక్ష్యం. దేశంలోని 627 జిల్లాల్లోని అన్ని గ్రామాలనూ ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకొచ్చారు. ఎస్బీఏ ప్రాజెక్టులో మొత్తం 9 కోట్ల టాయిలెట్ల నిర్మాణం ప్రభుత్వ లక్ష్యమని.. 2014-15లో 50 లక్షల టాయిలెట్లను నిర్మించినట్లు జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. భారత్‌ను పరిశుభ్రమైన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మోదీ ఈ వినూత్న కార్యక్రమాన్ని గతేడాది అక్టోబర్ 2న ప్రారంభించారు. దీనికి సంబంధించిన నిధుల కల్పన కోసం అవసరమైతే సర్వీస్ పన్నుకు అదనంగా(కొన్ని లేదా అన్ని సేవలపై) మరో 2 శాతం స్వచ్ఛ భారత్ సెస్‌ను కూడా జతచేస్తామని జైట్లీ 2015-16 బడ్జెట్లో ప్రతిపాదించారు. కేంద్రం నోటిఫై చేసిననాటి నుంచి ఇది అమల్లోకి వస్తుంది. కాగా, స్వచ్ఛ భారత్ నిధి(కోష్)కి ఇచ్చే విరాళాలపై 100 శాతం ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తామని కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. అయితే, కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద కంపెనీలు ఈ నిధికి ఇచ్చే మొత్తాలు పన్ను మినహాయింపుల్లోకి రావని పేర్కొన్నారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యాన్ని తమ ప్రభుత్వం ఒక ఉద్యమంలా చేపడుతోందని చెప్పారు. స్వచ్ఛ భారత్ పరిధిలోకి స్వచ్ఛ భారత్ అభియాన్(పారిశుధ్యం), జాతీయ గ్రామీ ణ తాగునీటి పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన... 2015-16లో కేటాయింపు: రూ.6,800 కోట్లు(32.19 శాతం పెంపు) 2014-15లో కేటాయింపు: రూ.5,144 కోట్లు 2013-14లో కేటాయింపు: రూ.4,500 కోట్లు విద్యుత్ సౌకర్యం లేని లక్ష గ్రామాలకు కరెంటు... దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న 2.34 కోట్ల కుటుం బాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో 2005లో ఈ పథకం ప్రారంభమైంది. నోడల్ ఏజెన్సీగా ఆర్ఈసీ వ్యవహరిస్తోంది. రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజనగా గత యూపీఏ ప్రారంభించిన భారత్ నిర్మాణ్ పథకం పేరును మోదీ సర్కారు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజనగా మార్చింది. బీపీఎల్ కుటుంబాలకు కనెక్షన్‌కు రూ.2,200 చొప్పున 100 శాతం సబ్సిడీ. 12వ పంచవర్ష ప్రణాళిక(2012-17)లోనూ ఈ స్కీమ్‌ను పొడిగించారు. సబ్సిడీని రూ.3,000కు పెంచారు. ఈ ఐదేళ్లలో రూ.50,000 కోట్లు కావాలనేది విద్యుత్ శాఖ డిమాండ్. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా పొలాలు, గృహావసరాలకు విద్యుత్ సరఫరా చేసే ఫీడర్లను వేరుచేసి గ్రామాల్లో సరఫరా ఇబ్బందులను తొలగించాలనే లక్ష్యాన్ని సర్కారు నిర్దేశించుకుంది. బడ్జెట్లో గ్రామీణ విద్యుదీకరణకు రూ.4,500 కోట్లు, ఫీడర్లను వేరుచేసే కార్యక్రమానికి రూ.2,300 కోట్లు కేటాయించారు. ఈ పథకం ప్రారంభమైననాటినుంచి ఇప్పటివరకూ 2.22 కోట్ల ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు అంచనా. ఇక 1,08,280 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2014-15 జనవరి వరకూ)లో కొత్తగా 11,931 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. 5,55,737 బీపీఎల్ కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు అంచనా. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై).. 2015-16లో కేటాయింపు: 14,291 కోట్లు(0.7 శాతం తగ్గింపు) 2014-15లో కేటాయింపు: 14,391 కోట్లు 2013-14లో కేటాయింపు: 21,700 కోట్లు గ్రామీణ ప్రాంతాలన్నింటికీ రోడ్డు సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో 2000లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకానికి పూర్తిగా కేంద్రమే నిధులు అందిస్తోంది. 2005లో దీన్ని భారత్ నిర్మాణ్‌లోకి యూపీఏ చేర్చింది. గ్రామీణ మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తామని చెప్పిన ఎన్డీఏ ప్రభుత్వం.. తన హయాంలో ప్రారంభించిన ఈ కీలక ఫ్లాగ్షిప్ పథకానికి తొలి బడ్జెట్లో కేటాయింపులను తగ్గిస్తుండటం గమనార్హం. ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై)... 2015-16లో కేటాయింపు 10,025 కోట్లు(37 శాతం కోత) 2014-15లో కేటాయింపు: 16,000 కోట్లు 2013-14లో కేటాయింపు: 15,184 కోట్లు దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబాలు, ఎస్సీ/ఎస్టీలు, వికలాంగులు, బీపీఎల్ మైనారిటీలు ఈ పథకంలో లబ్దిదారులు. వీరికిచ్చే నిధుల్లో 75 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రాలు భరిస్తాయి. మైదాన ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి సాయాన్ని రూ.70,000కు, కొండ ప్రాంతాలు, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో రూ.75,000 చొప్పున ఇస్తున్నారు. ఇక ఇప్పటికే ఉన్న ఇళ్ల అప్‌గ్రెడేషన్‌కు రూ.15,000 చొప్పున సాయం అందిస్తారు. మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తోంది. అయితే, స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణాన్ని తప్పనిసరి చేశారు. 2022కల్లా దేశవ్యాప్తంగా అందరికీ సొంతింటి కల సాకారం చేస్తామని చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వం.. ఈ గ్రామీణ ఇంటి నిర్మాణ పథకానికి అరకొరగా నిధులను కేటాయిస్తుండటం గమనార్హం. జాతీయ గ్రామీణ తాగునీటి పథకం 2015-16లో కేటాయింపు: రూ.2,611 కోట్లు(76 శాతం తగ్గింపు) 2014-15లో కేటాయింపు: రూ. 11,000 కోట్లు 2013-14లో కేటాయింపు: రూ. 11,000 కోట్లు దేశంలో తాగునీటి సౌకర్యం లేని(అన్కవర్డ్) అన్ని మారుమూల గ్రామీణప్రాంతాలకూ సురక్షితమైన, తగినంత తాగునీటిని అందించాలనేది ఈ పథకం లక్ష్యం. కేంద్రం నుంచి రాష్ట్రాలకు కొన్ని నిధులు మంజూరవుతాయి. మిగతా మొత్తాన్ని రాష్ట్రాలు వెచ్చించాలి. గతేడాది ఏప్రిల్ నాటికి దేశంలోని మొత్తం 16.97 లక్షల గ్రామీణ ఆవాస ప్రాంతాలకుగాను.. 12.50 లక్షల ప్రాంతాలకు మాత్రమే సురక్షితమైన, తగినంత తాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నారు. గ్రామీణ టెలిఫోనీ.. 2015-16లో కేటాయింపు: రూ. 2,400 కోట్లు(32 % తగ్గింపు) 2014-15లో కేటాయింపు: రూ. 3,553 కోట్లు 2013-14లో కేటాయింపు: 3,000 కోట్లు గ్రామాల్లో ప్రతి 100 మందికీ 40 మందిని టెలిఫోన్ వినియోగదారులు(టెలీ డెన్సిటీ 40%)గా చేయాలనేది లక్ష్యం. ఇది సాకారమైంది. దేశంలోని మొత్తం 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్(జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్-ఎన్ఓఎఫ్ఎన్) ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు పంచాయతీ స్థాయిలో భారత్ నిర్మాణ్ కామన్ సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 7.5 లక్షల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌ను ఇందుకోసం వేయనున్నట్లు జైట్లీ చెప్పారు. ఈ మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.30,000 కోట్లు. టెలికం శాఖకు చెందిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ నిధి(యూఎస్ఓఎఫ్) నుంచి ఈ స్కీమ్‌కు ఫండ్స్‌ను అందిస్తున్నారు. అయితే, సొంతంగా నిధులను వెచ్చించే రాష్ట్రాలకు కేంద్రం ఆతర్వాత తిరిగి చెల్లించేందుకు(వ్యయాల ఆధారంగా) జైట్లీ ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈసారి నిధుల కేటాయింపులను తగ్గించింది. -
ఏపీకి ప్రత్యేకం లేదు
‘లీగల్' కమిట్మెంట్స్కు కట్టుబడి ఉంటాం: జైట్లీ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ లేదంటూ కేంద్రం పరోక్షంగా తేల్చేసింది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఇచ్చిన అన్ని చట్టబద్ధమైన హామీలను నెరవేరుస్తామని చెప్పింది. అంటే అప్పటి ప్రధాని మన్మోహన్ రాజ్యసభలో ప్రకటించిన స్పెషల్ స్టేటస్ హామీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో లేదు. బహుశా అందువల్లే ఆర్థిక మంత్రి జైట్లీ తన ప్రసంగంలో ‘లీగల్ కమిట్మెంట్స్’ అనే పదాన్ని ఉపయోగించినట్టు అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రగాఢ వాంఛ అయిన స్పెషల్ స్టేటస్‌కు కేంద్రం బడ్జెట్లో మొండిచెయ్యి చూపగా.. ఇటు తెలంగాణ ప్రభుత్వం కాకతీయ మిషన్‌కు, వాటర్ గ్రిడ్‌కు నిధులు కేటాయించాలని పదేపదే కోరినా ఫలితం దక్కలేదు. గత ఏడాది పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రూ.250 కోట్లు కేటాయించగా.. ఇప్పుడు నామమాత్రంగా రూ.100 కోట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన పెద్ద పద్దు ఏదైనా ఉందంటే.. ఇదొక్కటే. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పలుమార్లు ఢిల్లీ వచ్చి అన్ని శాఖలతో సంప్రదింపులు జరిపినా బడ్జెట్లో రెండు రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేదు. అన్యాయం ఎక్కడెక్కడ? ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం అనేక హామీలు ఇచ్చింది. వాటిలో కీలకమైనవి.. దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు, వైజాగ్-చె న్నై ఇండస్ట్రియల్ కారిడార్, కడపలో స్టీలు ప్లాంటు, విశాఖల పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖ, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయస్థాయికి అభివృద్ధి చేయడం, విశాఖ నగరంలో, విజయవాడ-తెనాలి-గుంటూరు మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో మెట్రో రైలు వసతి ఏర్పాటుచేయడం.. వంటి అంశాలు పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూలులో ఉన్నాయి. అలాగే తెలంగాణకు స్టీలు ప్లాంటు తదితర హామీలు కూడా ఉన్నాయి. కానీ వీటిలో మెట్రోలకు రూ.5.63 కోట్ల చొప్పున కేటాయించడం తప్పితే మిగిలిన వాటి ఊసేలేదు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 46(2) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో లభ్యమయ్యే వనరులను దృష్టిలో ఉంచుకుని సముచిత రీతిలో గ్రాంట్లను విడుదల చేయాలి. అలాగే వెనకబడిన జిల్లాలకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రూపంలో ప్రోత్సహకాలు, ప్రయోజనాలు కల్పించాల్సి ఉంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రకటించడం ద్వారా కేంద్రం రాష్ట్రాలకు చేసే ఆర్థిక సాయంలో గ్రాంటు శాతం పెరుగుతుంది. జనరల్ కేటగిరీలోని రాష్ట్రాలకు ఇచ్చే సాయంలో 30 శాతం గ్రాంట్లుగా ఉంటే.. స్పెషల్ కేటగిరీ స్టేటస్‌లో ఉండే రాష్ట్రాలకు 90 శాతం గ్రాంటు ఉంటుంది. అందువల్ల ఈ హోదా ప్రకటిస్తే రాష్ట్ర ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. అప్పటి ప్రధాని మన్మోహన్ చేసిన ఈ ప్రకటనకు రాజ్యసభలోను, బయటా బీజేపీ మద్దతు పలికింది. కానీ తాజా బడ్జెట్లో ఇక ఎప్పటికీ స్పెషల్ స్టేటస్ రాదన్న రీతిలో పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని కోరాపుట్-బొలాంగిర్-కలహండి (కేబీకే) ప్రత్యేక ప్రణాళిక తరహాలో, బుందేల్‌ఖండ్ స్పెషల్ ప్యాకేజీ తరహాలో ఉంటుందని ఆనాటి ప్రధాని రాజ్యసభలో చెప్పారు. కానీ ఇటీవల కేంద్రం జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున రాయలసీమ, ఉత్తరాంధ్ర లోని జిల్లాలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఇది నామమాత్రం. కానీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎంత కేటాయిస్తారో ఈ బడ్జెటలో చెప్పలేదు. మరోవైపు వెనబడిన జిల్లాలకు ఇచ్చే బీఆర్‌జీఎఫ్‌ను కేంద్రం రద్దు చేసింది. అంటే ఆ చేత ఇచ్చి.. ఈ చేత లాగేసుకున్నట్టయింది. రాజధాని నగరానికి నిధుల్లేవు పునర్ వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 94(3) ప్రకారం రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసనమండలి, తదితర అవసరమైన మౌలిక వసతులు సహా కొత్త రాజధాని ఏర్పాటుకు ప్రత్యేకంగా ఆర్థిక సాయం ఇవ్వాల్సి ఉంది. కానీ దీన్ని కనీసం ప్రస్తావించలేదు. ఇక ఏపీలో పలు జాతీయస్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు పునర్ వ్యవస్థీకరణ చట్టం హామీ ఇచ్చింది. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ వర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ, వ్యవసాయ వర్సిటీ, ఐఐఐటీ వంటి జాతీయ ప్రాధాన్యత గల సంస్థలు, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, ఎయిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ బోధానాస్పత్రి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఐఐటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్ తరహాలో బోధనాస్పత్రి వంటి సంస్థలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నిర్మిస్తామని కేంద్రం చెప్పింది. ఎన్ఐటీ, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ వర్సిటీ, పెట్రో వర్సిటీ, ట్రైబల్ వర్సిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థలల్లో కొన్నింటికి మాత్రమే నామమాత్రపు నిధులు కేటాయించింది. ఎన్ని దశాబ్దాలకో పోలవరం పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ.100 కోట్లు కేటాయించింది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 90 పోలవరానికి జాతీయ హోదా కల్పించింది. ప్రాజెక్టుకయ్యే మొత్తం వ్యయంతోపాటు పునరావాసానికి కూడా కేంద్రం కేటాయిస్తుందని ఆ చట్టం చెబుతోంది. రాష్ట్ర విభజన తరువాత నాలుగేళ్లలోగా ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉంది. అయితే ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్రం తగిన చర్యలు తీసుకోలేదు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 250 కోట్లు కేటాయిస్తే.. ఈ ఏడాది కేవలం రూ.100 కోట్లు విదిలించారు. ఈ ప్రాజెకు పూర్తవడానికి దశాబ్దాలు పట్టే అవకాశం ఉంది. తెలంగాణకు బడ్జెట్ పద్దులు ఇవీ.. అంశం కేటాయింపు (రూ.కోట్లలో) ఐఐటీ-హైదరాబాద్ 55 ఉద్యానవన విశ్వవిద్యాలయం 75 గిరిజన విశ్వవిద్యాలయం 1.00 ఏపీకి బడ్జెట్ పద్దులు ఇవీ.. పోలవరం ప్రాజెక్టు 100 విజయవాడ మెట్రో రైల్ 5.63 వైజాగ్ మెట్రో రైల్ 5.63 ఐఐటీ 40 ఎన్ఐటీ 40 ఐఐఎం 40 ఐఐఎస్ఈఆర్ 40 ట్రిపుల్ ఐటీ 45 వ్యవసాయ విశ్వవిద్యాలయం 75 గిరిజన విశ్వవిద్యాలయం 1.00 పెట్రోలియం వర్సిటీ 1.00 సెంట్రల్ వర్సిటీ 1.00 ప్రభుత్వరంగ సంస్థలకు విశాఖ పోర్టు ట్రస్ట్ 414 సింగరేణి కాలరీస్ 2,390 (రెండు రాష్ట్రాలకు కలిపి పారిశ్రామిక యూనిట్లకు రూ.100 కోట్ల వడ్డీ సాయం ఇవ్వనున్నట్టు ప్రస్తావించారు) -
ఫిబ్రవరి 28న కేంద్ర బడ్జెట్
వచ్చే నెల 23 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం తొలి రెండు రోజుల్లో రాష్ర్టపతి ప్రసంగం, చర్చ, ధన్యవాద తీర్మానం 26న రైల్వే బడ్జెట్, 27న ఆర్థిక సర్వే నివేదిక సమర్పణ న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 23 నుంచి ప్రారంభంకానున్నాయి. 28న సాధారణ బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఆ రోజు శనివారమైనప్పటికీ పార్లమెంట్ ప్రత్యేకంగా భేటీకానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను సమర్పిస్తారు. అంతకుముందు రోజు, అంటే ఫిబ్రవరి 27న ఆర్థిక సర్వే నివేదికను, 26న రైల్వే బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెడుతుంది. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం ఇక్కడ సమావేశమై ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ షెడ్యూల్‌ను రాష్ర్టపతి ఆమోదం కోసం సిఫారసు చేసింది. సాధారణంగా ఫిబ్రవరి ఆఖరి రోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనవాయితీ. చివరి రోజు శనివారం అవుతున్నందున అదే రోజున బడ్జెట్‌ను ప్రవేశపెడతామని, గతంలో కూడా దీన్ని పాటించారని ఓ సీనియర్ మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది జరగనున్న తొలి పార్లమెంట్ సమావేశాల ప్రారంభంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తారు. అనంతరం దీనిపై చర్చ, ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో వీటిని చేపడతారు. ఈ తొలి విడ త బడ్జెట్ సమావేశాలు మార్చి 20 వరకు కొనసాగుతాయి. నెల రోజుల విరామం తర్వాత ఏప్రిల్ 20 నుంచి రెండో విడత సమావేశాలు జరుగుతాయి. ఈ విరామ సమయంలో వివిధ మంత్రిత్వ శాఖల డిమాండ్లను పార్లమెంటరీ కమిటీలు పరిశీలిస్తాయి. వాటికి నిధుల మంజూరుపై నిర్ణయం తీసుకుంటాయి. మే 8తో బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. ఇటీవలి కాలంలో తీసుకొచ్చిన ఆరు ఆర్డినెన్స్‌లకు సంబంధించిన బిల్లులను ఆమోదించుకునేందుకు కేంద్రం ప్రయత్నించనుంది. బొగ్గు-గనులు, ఖనిజాలు, ఇ-రిక్షాలు, పౌరస్మృతి చట్ట సవరణ, భూసేకరణ, బీమా రంగంలో విదేశీ నిధులకు సంబంధించిన ఆర్డినెన్స్‌లకు చట్టరూపం తెచ్చేందుకు సర్కారుపై తీవ్ర ఒత్తిడి ఉంది. కాగా, హడావుడిగా ఆర్డినెన్స్‌లు తేవడంపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన ఆర్డినెన్స్‌ల వివరాలను పార్లమెంట్లో వెల్లడిస్తామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తొలి విడతలో 26 రోజులపాటు, మలివిడతలో 19 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు. ప్రస్తుతం 66 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. -
ఆర్థిక వృద్ధికి సర్కారు రోడ్‌మ్యాప్
బడ్జెట్‌పై చర్చకు లోక్‌సభలో ఆర్థిక మంత్రి న్యూఢిల్లీ: దేశ ఆర్థికరంగ పునరుత్తేజానికి రోడ్‌మ్యాప్‌ను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. సాధారణ బడ్జెట్‌పై జరిగిన చర్చకు శుక్రవారం లోక్‌సభలో సమాధానమిస్తూ.. పన్ను విధానాల్లో పరివర్తన, కనిష్ట పన్ను రేట్లు, సబ్సీడీ వ్యవస్థను హేతుబద్ధీకరించడం, మౌలిక వసతులు, గృహనిర్మాణ రంగానికి ఊతం.. సహా ఆర్థికరంగ పునరుత్తేజానికి చేపట్టనున్న పలు ప్రణాళికలను వివరించారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు, సమాజంలో అణగారిన వర్గాలకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు వ్యాపార అనుకూల విధానాలు తప్పనిసరి అని జైట్లీ చెప్పారు. ప్రస్తుత ఆర్థికరంగ ప్రస్తుత దుస్థితికి గత యూపీఏ ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. కీలక రంగాల్లో ఎఫ్‌డీఐలను అనుమతించడం సహా బడ్జెట్లో పేర్కొన్న పలు ప్రతిపాదనలు పారిశ్రామిక, ఉత్పత్తిరంగ అభివృద్ధికి, ఉద్యోగ కల్పనకు అత్యవసరమని జైట్లీ వివరించారు. నిరుత్సాహపూరిత పన్ను విధానాల వల్ల గత కొన్నేళ్లుగా పెట్టుబడిదారుల్లో భారత్‌పై అనుమానాలు బలపడ్డాయని, వాటిని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ పన్ను రేట్ల విధానం వల్ల దేశీయంగా ఉత్పత్తి పెరుగుతుందని, పారిశ్రామిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని తెలిపారు. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి పెంచడాన్ని జైట్లీ సమర్థించారు. కాగా, జైట్లీ గోవర్ధన గిరినెత్తిన శ్రీకృష్ణుడి వలె ఒంటిచేత్తో ప్రశ్నల వర్షాన్ని ఎదుర్కొన్నారని స్పీకర్ సుమిత్రా మహాజన్ కొనియాడారు. -
ఏపీలో వ్యవసాయ బడ్జెట్ లేనట్టే?
హైదరాబాద్: ఈ ఏడాదికి ఏపీలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉండే అవకాశాలు కనిపించడంలేదు. కర్ణాటకను ఆదర్శంగా తీసుకుని గతేడాది ప్రవేశపెట్టిన ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ తరహాలోనే ఈ ఏడాది కూడా వ్యవసాయానికి ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశ పెడతామని ఏపీ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇటీవల వెల్లడించారు. అయితే, ఇప్పటికే ఆర్థిక బడ్జెట్ ప్రతిపాదనలు ఊపందుకున్నప్పటికీ వ్యవసాయ బడ్జెట్‌పై ఎలాంటి ప్రతిపాదనా లేకపోవడాన్నిబట్టి ఈసారికి లేనట్టేనని సమాచారం. రాష్ట్ర సాధారణ బడ్జెట్ కసరత్తు సోమవారం నుంచి మొదలైంది. వివిధ శాఖల అధి కారులతో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చర్చల ప్రక్రియను ప్రారంభించారు.