ఇక రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ఉండదు! | Railway Budget to merge with General Budget | Sakshi
Sakshi News home page

ఇక రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ఉండదు!

Published Sun, Aug 14 2016 3:22 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

ఇక రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ఉండదు!

ఇక రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ఉండదు!

న్యూఢిల్లీ: 92 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ సంప్రదాయానికి ఇక తెరపడనుంది. వచ్చే ఏడాది నుంచి రైల్వే బడ్జెట్‌ కేంద్ర సార్వత్రిక బడ్జెట్‌లో విలీనం కానుంది. ఈ మేరకు రైల్వేమంత్రి సురేశ్ ప్రభు చేసిన ప్రతిపాదనకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ఆమోదం తెలిపారు.

కేంద్ర బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ విలీనంపై విధివిధానాలు ఖరారుచేసేందుకు ఆర్థికమంత్రిత్వశాఖ ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో ఆర్థికశాఖ, రైల్వే శాఖ సీనియర్‌ అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ నెల 31నాటికి నివేదిక సమర్పించాల్సిందిగా కమిటీని ఆర్థికశాఖ ఆదేశించింది.

'కేంద్ర బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ను విలీనం చేయాల్సిందిగా ఆర్థికమంత్రి జైట్లీకి లేఖ రాశాను. రైల్వే ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. విలీనం విధివిధానాలపై మేం కసరత్తు చేస్తున్నాం' అని ప్రభు పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement