![ఏపీలో వ్యవసాయ బడ్జెట్ లేనట్టే? - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/41403986049_625x300_0.jpg.webp?itok=OLG21cX6)
ఏపీలో వ్యవసాయ బడ్జెట్ లేనట్టే?
హైదరాబాద్: ఈ ఏడాదికి ఏపీలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉండే అవకాశాలు కనిపించడంలేదు. కర్ణాటకను ఆదర్శంగా తీసుకుని గతేడాది ప్రవేశపెట్టిన ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ తరహాలోనే ఈ ఏడాది కూడా వ్యవసాయానికి ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశ పెడతామని ఏపీ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇటీవల వెల్లడించారు.
అయితే, ఇప్పటికే ఆర్థిక బడ్జెట్ ప్రతిపాదనలు ఊపందుకున్నప్పటికీ వ్యవసాయ బడ్జెట్‌పై ఎలాంటి ప్రతిపాదనా లేకపోవడాన్నిబట్టి ఈసారికి లేనట్టేనని సమాచారం. రాష్ట్ర సాధారణ బడ్జెట్ కసరత్తు సోమవారం నుంచి మొదలైంది. వివిధ శాఖల అధి కారులతో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చర్చల ప్రక్రియను ప్రారంభించారు.