Prattipati pulla rao
-
ధరల చెల్లింపులో దబాయింపు!
సాక్షి, అమరావతి: సుబాబుల్, జామాయిల్, సరుగుడు కర్రకు ధరలేక రైతులు లబోదిబోమంటున్నారు. బడా పేపర్ మిల్లులను కట్టడి చేయడంలో రాష్ట్రంలోని గత ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడంతో వాళ్లు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. అందరి సమక్షంలో కుదుర్చుకున్న కనీస ఒప్పంద ధరను సైతం ఇవ్వలేమని ఐటీసీ సహా ఇతర పేపర్ మిల్లులు తెగేసి చెబుతున్నాయి. ఫలితంగా జామాయిల్ రైతులు ఎకరానికి సుమారు 25 వేలు, సుబాబుల్ రైతులు ఎకరానికి రూ.20 వేలు ఏటా నష్టపోతున్నారు. ధరల వ్యవహారంలో కంపెనీలు రైతుల్ని ఏమాత్రం ఖాతరుచేయకుండా అగౌరవపరుస్తున్నాయని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వమైనా తమ గోడు పట్టించుకోవాలని సుబాబుల్, జామాయిల్ రైతుల సంఘం కోరుతోంది. రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలలో సాగు.. రాష్ట్రంలో సుమారు 4 లక్షల ఎకరాలలో సుబాబుల్, జామాయిల్ (యూకలిప్టస్), సరుగుడు (చౌకలు) సాగవుతోంది. విశాఖ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాధారిత పంటగా వీటిని సాగుచేస్తున్నారు. మొత్తం సాగులో 40 శాతం వరకు ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఉంది. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం 80 వేల నుంచి లక్ష మంది వరకు ఈ తోటల్ని పెంచుతుంటారు. ఒకసారి ఈ మొక్కల్ని నాటితే పది పన్నెండేళ్ల పాటు ఉంచవచ్చు. వానలు ఉండి కాస్తంత సస్యరక్షణ చేస్తే మూడేళ్లలో తొలిసారి కర్ర కొట్టవచ్చు. మూడేళ్లకు కౌలు కలుపుకుని ఎకరానికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. అన్నీ సవ్యంగా ఉంటే 25 నుంచి 30 టన్నుల దిగుబడి వస్తుంది. మిల్లుల ఇష్టారాజ్యం.. ధరలు దారుణం 2014కి ముందు సుబాబుల్, జామాయిల్ ధరలు టన్నుకు రూ. 4,400 నుంచి రూ.4,600 మధ్య ఉండేది. ఆ తర్వాత ధరలు క్రమేణా తగ్గడం మొదలుపెట్టాయి. దీంతో రైతులు ఆందోళనకు దిగడంతో టీడీపీకి చెందిన ఆనాటి వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రైతులు, పేపర్ మిల్లుల ప్రతినిధులతో సమావేశమై కనీస ధరను రూ.4,600గా నిర్ణయించారు. అయితే, ఇందుకు మిల్లర్లు ప్రత్యేకించి ఐటీసీ వంటి కంపెనీలు ససేమిరా అనడమే కాకుండా రూ.4,000లకు మించి ఇవ్వలేమని భీష్మించాయి. ఈలోగా వ్యవసాయ మంత్రి మారిపోవడంతో రైతులు మళ్లీ మొరపెట్టుకున్నారు. జిల్లాకో రేటు పెట్టుకునేందుకు, తమ ఏజెంట్లతో కొనుగోలు చేయించేందుకు అనుమతివ్వాలని కంపెనీలు పట్టుబట్టి సాధించాయి. కంపెనీ ఏజెంట్లు, ఏఎంసీ అధికారులు కుమ్మక్కై ఏదో నామమాత్రంగా నిబంధనల ప్రకారం కొన్నట్టు చూపి మిగతా కర్రను తమ ఇష్టానుసారం కొంటున్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, చీమకుర్తి ప్రాంతంలో రూ.4,400లకు కొనాల్సిన జామాయిల్ కర్రను టన్ను రూ.1,800, సుబాబుల్‌ను రూ.2 వేల నుంచి రూ.2,400 మధ్య కొంటున్నారు. అదే కృష్ణాజిల్లా నందిగామలో రూ.2 వేలకు మించి ఇవ్వడంలేదు. కర్ర కొట్టుడు, రవాణా ఖర్చులను తామే భరిస్తున్నందున ఇంతకుమించి ఇవ్వలేమని పేపర్ మిల్లులు తెగేసి చెబుతున్నాయి. రవాణా సౌకర్యం బాగుంటే ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదే మారుమూల అయితే ధర తక్కువగా ఉంటోందని సుబాబుల్ రైతుల సంఘం నాయకుడు హనుమారెడ్డి చెప్పారు. ప్రతి రైతుకూ ఏటా రూ.25 వేలు నష్టం ధర లేకపోవడంతో రైతులు ఏటా ఎకరాకు రూ.20వేల నుంచి రూ.25 వేల వరకు నష్టపోతున్నారు. దీనిపై రైతులు వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నాచేసినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం జామాయిల్ కర్ర టన్నుకు నిర్ణయించిన రూ.4,400ను, సుబాబుల్‌కు నిర్ణయించిన రూ.4,200ల ధరైనా ఇవ్వకపోతే తాము బతికేదెలా? అని ప్రశ్నిస్తున్నా రైతుల వేదన అరణ్యరోదనగానే మిగిలింది. ఆ ధరతో కొనుగోలు చేయలేమని ఐటీసీ, ఏపీ పేపర్ మిల్స్, జేకే పేపర్ మిల్స్ చెబుతున్నాయి. పేపర్ ధర పెరుగుతున్నప్పుడు ముడిసరకు ధర ఎందుకు పెరగదని రైతులు ప్రశ్నిస్తున్నారు. తీసి ఇవ్వాలంటే ఎలా? గత ప్రభుత్వ అనాలోచిత చర్యవల్ల రైతులే తమ తోటల్ని నరికి కర్రను స్టాక్ పాయింట్‌కు తరలించాల్సిన పరిస్థితి. ఇది చాలదన్నట్టు ఆ కర్రకుండే తాటను సైతం రైతులే తీయించి పేపర్ మిల్లులకు సరఫరా చేయాలని ప్రకాశం జిల్లాలో షరతు విధించారు. ఈ నిబంధనను తొలగించాలని రైతులు ఆందోళన చేస్తే దాన్ని తీసివేయడానికి బదులు రాష్ట్రవ్యాప్తంగా అదే విధానాన్ని అమలుచేయడం మొదలు పెట్టారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. -
విదేశాలకు తరలిపోతున్న సబ్సిడీ బియ్యం
సాక్షి, అమరావతి: పేదలకు అందాల్సిన సబ్సిడీ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోతోంది. అయినా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, అధికారులు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ బియ్యం వ్యాపారంలో అధికార పార్టీకి చెందిన నేతలు, వారి అనుచరుల పాత్ర ఉండటంతోనే చర్యలకు వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్టాండ్లు, సినిమా థియేటర్లలో తినుబండారాలను ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారంటూ తనిఖీలు చేస్తూ హంగామా చేసే అధికారులు పేదలకందాల్సిన సబ్సిడీ బియ్యం విదేశాలకు అక్రమంగా తరలిపోతున్నా తనిఖీలు మాత్రం నిర్వహించడం లేదు. సబ్సిడీ బియ్యాన్ని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు, మిల్లర్లు నేరుగా రేషన్ షాపులకు వెళ్లి లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు కొందరు డీలర్లు కూడా లబ్ధిదారులకు బియ్యం ఇచ్చే సమయంలో ఈ–పాస్ మిషన్‌పై రెండు నుంచి ఐదు కిలోల బరువున్న రాయిని ఉంచి బియ్యాన్ని అక్రమంగా సేకరిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 1.44 కోట్ల తెల్లరేషన్ కార్డుదారులకు ప్రతి నెలా దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయి. వీటిలో ప్రతి నెలా 50 వేల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యాన్ని నేరుగా వ్యాపారులు కొనుగోలు చేసి వాటిని మిల్లుల్లో దాచిపెడుతున్నారు. బియ్యం ఎగుమతులకు కాకినాడ నౌకాశ్రయం అనువుగా ఉండటంతో అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ఎగుమతిదారులతో చేతులు కలిపి ప్రతి నెలా నల్లబజారుకు తరలించే సబ్సిడీ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్న నిల్వల్లో కలిపేస్తున్నారు. కాకినాడ నౌకాశ్రయం నుంచి భారీగా బియ్యం ఎగుమతులు అవుతున్నా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు, విజిలెన్స్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ జిల్లాల నుంచే ఎక్కువ ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల నుంచి ఎక్కువగా సబ్సిడీ బియ్యం అడ్డదారిన ఎగుమతి అవుతున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించినా పట్టించుకునేవారే కరువయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కరప మండలం ఉప్పలంకలోని ఎగుమతిదారులకు సంధించిన మిల్లులో సబ్సిడీ బియ్యాన్ని పాలిష్ చేస్తున్నారనే సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించారు. పలు జిల్లాలకు చెందిన 11 లారీలను స్వాధీనం చేసుకొని అందులో ఉన్న బియ్యం బస్తాల నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపారు. అందులో సబ్సిడీ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అయితే పట్టుబడ్డ వ్యక్తులకు వెంటనే బెయిల్ వచ్చేలా చిన్న చిన్న కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తే కాకినాడ నౌకాశ్రయం కేంద్రంగా జరుగుతున్న అక్రమ వ్యాపారం బహిర్గతమవుతుంది. కాకినాడ నౌకాశ్రయం నుంచి ఏటా 22 నుంచి 25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం విదేశాలకు ఎగుమతి అవుతున్నట్లు అధికారులు నిర్థారించారు. వీటిపై కూడా నిఘా పెట్టాలని పలువురు కోరుతున్నారు. -
పీవీపీ షాపుల్లో మంత్రి పుల్లారావు తనిఖీలు
సాక్షి, అమరావతి : విదేశీ కంపెనీలు వస్తువులను అనుమతి లేకుండా అమ్ముతున్న షాపుల్లో ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆకస్మిక తనిఖీలు చేశారు. బుధవారం విజయవాడలోని పీవీపీ మల్టీప్లెక్స్ మాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...18 షాపులను తనిఖీ చేశామని తెలిపారు. విదేశీ కంపెనీలు వినియోగదారుల జేబులను గుల్ల చేస్తున్నాయని, సెలక్ట్ చానల్ పేరుతో ఒకే రకమైన ఉత్పత్తులపై వేర్వేరు రేట్లు ముద్రిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, అనుమతి తేకుండా అమ్ముతున్న షాపులపై కేసులు నమోదు చేస్తామన్నారు. వ్యాపారస్తులు ఇష్టం వచ్చిన ఎమ్మార్పీకి జీఎస్టీని కలపడం వంటివి జరుగకుండా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ చట్టంలో మార్పులు తీసుకురావాలని అన్నారు. లోకల్ బ్రాండ్ వాటర్ బాటిల్ రేటు కూడా దారుణంగా పెంచేశారని, గోల్డు షాపుల్లో ఎక్కువ మంది వినియోగదారులు నష్టపోతురన్నారు. అదేవిధంగా పెట్రోలు, గ్యాస్, ఎరువుల తూకాల్లో మోసాలు జరుతున్నాయని, ప్రజలు వీటిని దృష్టిలో ఉంచుకుని కొనుగోలు చేయాలని సూచించారు. -
ఏపీ మంత్రి పుల్లారావువి హత్యా రాజకీయాలు
-
ధరలపై మిర్చి రైతుల ఆక్రోశం
► మంత్రి పుల్లారావుకు సమస్యల ఏకరువు ► ఆత్మహత్యలు తప్పవని హెచ్చరిక ► ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వినతి కొరిటెపాడు(గుంటూరు): రోజురోజుకు పతనమవుతున్న మిర్చి ధరలపై రైతులు మంత్రి ఎదుట ఆక్రోశం వెలిబుచ్చారు. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం గుంటూరు మిర్చి యార్డులో పర్యటించారు. మిర్చి కొనుగోళ్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఏఏ రకం మిర్చికి ఎంత ధర లభిస్తోంది? ఎకరాకు ఎన్ని క్వింటాళ్ల దిగుబడి వస్తోందని రైతులను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మిర్చి ధరలు రోజు రోజుకు పతనం అవుతున్నాయని, ఎకారకు రూ.1.50 లక్షలు ఖర్చు అవుతోందని, దిగుబడి మాత్రం 15 నుంచి 18 క్వింటాళ్లకు మించి రావటం లేదని తెలిపారు. గత ఏడాది క్వింటా రూ.15 వేల ధర పలికిన మిర్చికి, ఈ ఏడాది రూ.7వేలకు మించి రావటం లేదని, ఇవే ధరలు కొనసాగితే రైతుల ఆత్మహత్యలు తప్పవంటూ సమస్యలను ఏకరువు పెట్టారు. మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి రాష్ట్ర ప్రభుత్వమే మిర్చిని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాగు విస్తీర్ణం పెరగడమే కారణం : ప్రత్తిపాటి అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పుల్లారావు మాట్లాడుతూ ఇప్పటికే ధరలు పతనం కావటానికి మిర్చి సాగు విస్తీర్ణం పెరగడమే కారణమన్నారు. గత ఏడాది కన్నా రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగావుందని చెప్పారు. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు ఎక్స్‌పోర్టర్స్ శాంపిల్స్ తీసుకెళ్లారని, వారి నుంచి ఆర్డర్స్ రాగానే మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చిని కొనుగోలు చేసి రైతులకు మెరుగైన ధర చెల్లించేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీనిపై మూడు, నాలుగు రోజుల్లో ఒక స్పష్టత వస్తుదన్నారు. యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ధరలు పడిపోకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ రాష్ట్ర కమిషనర్ పి.మల్లికార్జునరావు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య, యార్డు వైస్ చైర్మన్ కొత్తూరి వెంకట్, యార్డు కార్యదర్శి దివాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యాన రైతులకు అవార్డుల పంట
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో ఉద్యానవన పంటల్లో రాణిస్తున్న రైతులు, అధికారులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం అవార్డులు అందించారు. విజయవాడ ఆంధ్రాలయోల కళాశాల ప్రాంగణంలో ఉద్యానశాఖ, సీఐఐ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రథమ ఉద్యాన, మామిడి మేళా-2016లో ఈ అవార్డులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా అందించారు. ఉద్యాన పంటల విభాగం: చామంతిసాగులో సీహెచ్ లీలాప్రసాద్(విజయనగరం జిల్లా), బంతి సాగులో తూకూరి గైరమ్మ (విశాఖ జిల్లా), అరటిసాగులో చాట్ల సత్యనారాయణ రాజు (విశాఖ జిల్లా), మామిడి సాగులో చీర్ల నరసింహారావు (తూర్పుగోదావరి), హోతా వీరభద్రరావు (పశ్చిమగోదావరి), ఎస్.జనార్దన రెడ్డి(వైఎస్సార్ కడప), నిమ్మసాగులో మోటూరి శ్రీనివాసరావు(కృష్ణాజిల్లా), టమాట, క్యాప్సికమ్ సాగులో యనమదల సత్యనారాయణ (గుంటూరు జిల్లా), టి.సరస్వతి (కర్నూలు), మామిడి, కూరగాయలు, పూలు సాగులో కాట్రగడ్డ సుబ్బారావు (ప్రకాశం), బత్తాయి సాగులో దేవరపల్లి వెంకట ఈశ్వర్‌దత్తు(నెల్లూరు), దానిమ్మ పంటకు కె.చంద్రశేఖర్ (అనంతపురం), బొప్పాయి, కూరగాయలు పంటలకు సి.అశోక్ కుమార్(చిత్తూరు)లు సత్కారాలు, అవార్డులు అందుకున్నారు. సూక్ష్మ నీటిపారుదల (డ్రిప్ ఇరిగేషన్) విభాగంలో : ఉద్యన పంటల సాగులో సూక్ష్మ నీటిపారుదల విభాగంలో పలువురు రైతులకు అవార్డులు అందించారు. కొరికిన రవికుమార్(శ్రీకాకుళం జిల్లా), బి.కొండబాబు (విజయనగరం జిలా), కొల్లి సురేష్ (విశాఖ జిల్లా), డి.సత్యనారాయణరాజు (తూర్పుగోదావరి జిల్లా), ముళ్లపూడి మురళీకృష్ణ (పశ్చిమగోదావరి), గొల్లపూడి మోహనరావు (కృష్ణాజిల్లా), శాఖమూరి పేరయ్య (గుంటూరు), పెంట్యాల సాంబశివరావు(ప్రకాశం), తల్లా రమేష్(నెల్లూరు), సి.అశోక్‌కుమార్ (చిత్తూరు), కె.నాగేశ్వరరావు (వైఎస్సార్ కడప), ఎం.ఓబయ్య( అనంతపురం), పి.యాగంటిరెడ్డి(కర్నూలు) అవార్డులు అందుకున్నారు. పురస్కారాలు అందుకున్న అధికారులు డిప్యూటీ డెరైక్టర్ బి.ఎస్ సుబ్బయ్యనాయుడు (అనంతపురం), కమిషనరేట్‌కు చెందిన ఏడీహెచ్ ఎస్.వి.రతన్ ఆచార్యులు, అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ హార్టికల్చర్ డి. మధునూదనరెడ్డి (ప్రొద్దుటూరు), పి.జెనమ్మ (కందుకూరు), చంద్రశేఖర్ (అనంతపురం), హరేంద్ర (కుప్పం), ఎం.డి. అబ్దుల్ రహీం (శ్రీకాకుళం)లతో పాటు మైక్రో ఇరిగేషన్, సీఐఐ ప్రతినిధులకు, సంస్థలకు, కంపెనీలకు కూడా అవార్డులు అందించారు -
పేటను పెద్ద నగరంగా మారుస్తాం
♦ నరసరావుపేట మున్సిపాలిటీ శత వసంతోత్సవాల్లో సీఎం ప్రకటన ♦ ఘనంగా ప్రారంభమైన మున్సిపాలిటీ వందేళ్ల వేడుకలు ♦ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం ♦ సత్తెనపల్లి మీదుగా అమరావతికి ఔటర్ రింగ్‌రోడ్ అని ప్రకటన సాక్షి, గుంటూరు : నరసరావుపేట మున్సిపాలిటీ శత వసంత వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులు జరిగే ఈ వేడుకలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రాజధాని అమరావతి తరువాత దగ్గరలో ఉండే అతి పెద్ద సిటీగా నరసరావుపేటను అభివృద్ధి చేస్తామని చెప్పారు. వందేళ్లు పూర్తయిన సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ సభాపతి డాక్టర్ కోడెల నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. నరసరావుపేటలో ఉన్న 100 పడకల ఆసుపత్రిని రూ.100 కోట్లతో 300 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో 5 వేల కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. సత్తెనపల్లిని ఆనుకొని అమరావతికి 220 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నట్లు చెప్పారు. సమైక్య రాష్ట్రానికి, నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి స్పీకర్లుగా నరసరావుపేటకు చెందిన వ్యక్తులు కావడం విశేషమన్నారు. నరసరావుపేటకు చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసి సుదీర్ఘంగా రాజకీయాలను నడిపారన్నారు. నరసరావుపేటలో జేఎన్టీయూ కాకినాడ తరఫున మరో బ్రాంచిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరైన అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ సి రెడ్డి, జి.ఎం.ఆర్ గ్రూప్స్ అధినేత గ్రంధి మల్లిఖార్జునరావు, భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా, సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావులను ముఖ్యమంత్రి చంద్రబాబు సత్కరించారు. శతాబ్ది వేడుకల సందర్భంగా తపాలాశాఖ తయారు చేసిన ప్రత్యేక కవర్‌ను సీఎం చేతులమీదుగా ఆవిష్కరించారు. ప్రజల పాత్ర అభినందనీయం: కోడెల స్పీకర్ డాక్టర్ కోడెల మాట్లాడుతూ, పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రజలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో 11,500 మరుగుదొడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీ శత వసంతాల పండుగను ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ముందుగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెలిప్యాడ్ వద్ద సీఎంను కలసి నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, కామినేని శ్రీనివాస్, ఎంపీ రాయపాటి సాంబశివరావు, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, ఐజీ సంజయ్, రూరల్ ఎస్పీ నారాయణనాయక్, జేసీ శ్రీధర్, నరసరావుపేట మున్సిపల్ ైచైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సినీనటి శోభన నృత్య కార్యక్రమం, హాస్యనటుడు శివారెడ్డి మిమిక్రీ ఆకట్టుకున్నాయి. కరువు, వరదలు కలిపి కొట్టాయ్ ఏపీని కేంద్రమే ఆదుకోవాలి: చంద్రబాబు సాక్షి, విజయవాడ బ్యూరో :రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఏపీని ఈ ఏడాది అటు కరువులు ఇటు వరదలు కలసి దెబ్బతీశాయని, వీటి ప్రభావంతో రూ. వేల కోట్ల నష్టానికి గురైన ఏపీని కేంద్ర ప్రభుత్వమే ఉదారంగా ఆదుకోవాలని సీఎం చంద్రబాబు కేంద్ర అధ్యయన బృందాలను కోరా రు. కరువు పరిస్థితుల అధ్యయనానికి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం.. తమ పర్యటన ముగిసిన నేపథ్యంలో క్యాంప్ ఆఫీసులో శుక్రవారం సీఎంను కలిసింది. వరదనష్టం పై అంచనాల కోసం వచ్చిన కేంద్ర బృందం కూడా శుక్రవారమే సీఎంతో భేటీ అయ్యిం ది. రాష్ట్రంలోని దుర్భిక్ష పరిస్థితులను నివారించడానికి రూ.2,000.56 కోట్లు అవసరమని బాబు కేంద్ర కరువు అధ్యయన బృందానికితెలిపారు. అలాగే అతివృష్టి ఫలి తంగా సంభవించిన వరదల వల్ల వివిధ రంగాలకు రూ.3,759.97 కోట్ల నష్టం వాటిల్లిందని వరద నష్టంపై అంచనాలకు వచ్చిన కేంద్ర బృందానికి సీఎం వివరించారు. -
ఫిబ్రవరి 7 వరకు రుణమాఫీ గడువు
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ గడువును ఫిబ్రవరి 7వ తేదీ వరకు పొడిగించామని, ఇకపై ఎట్టి పరిస్థితుల్లో గడువు పొడిగించేది లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టంచేశారు. రైతులంతా బ్యాంకులకు పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. శనివారం సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. -
తుళ్లూరుకు యూరియా కట్
ప్రత్తిపాటి ఫోన్‌తో వెలుగులోకి సాక్షి, హైదరాబాద్: రాజధానికి భూములివ్వని రైతులపై ప్రభుత్వం కత్తిగట్టింది. భూ సమీకరణకు ముందుకు రాని రైతుల్ని లొంగదీసుకునేందుకు గత నెలలో పంట భూముల్లో మం టల పేరిట అమాయకుల్ని పోలీసు స్టేషన్లకు రప్పించి హడలెత్తించింది. కాగితాలపై సంతకాలు పెట్టించుకుని ఠాణాల చుట్టూ తిప్పుతోంది. అది మరువక మునుపే ఏప్రిల్ నుంచి పంటలు వేయవద్దని హుకుం జారీ చేసింది. దీనిపై రైతుల నుంచి ప్రతిఘటనలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భూములిచ్చేందుకు నిరాకరిస్తున్న ప్రాంతాలకు ఎరువుల సరఫరా నిలిపివేసి.. చేలల్లో ఉన్న పంటల్ని దెబ్బతీసేందుకు పూనుకుంది. అదేంటని అడిగితే తుళ్లూరు మండలానికి యూరియా సరఫరాను నిలిపివేశారని సమాధానం ఇస్తున్నారు. అక్కడ అరటి, జామ, మొక్కజొన్న తదితర పంటలను వేస్తుంటారు. వీటికి యూరియా అవసరం. ఈ పంట చేతికందిన తర్వాత మళ్లీ వేసే అవకాశం లేకుండా చేయడం , రైతుల భూముల్ని ఖాళీ చేయించాలన్నది అధికారుల ఉద్దేశం. తుళ్లూరు, తాడికొండ మండలాలకు యూరియా సరఫరాను మంత్రులే నిలిపివేయించినట్టు రైతులు ఆరోపిస్తున్నారు.ఈ వ్యవహారాన్ని ఇటీవల వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకువెళ్లినప్పుడు విషయం బయటపడింది. ప్రత్తిపాటి వ్యవసాయ శాఖ జేడీకి ఫోన్ చేసి దీనిపై ప్రశ్నించారు.ఆ అధికారి బదులిస్తూ.. ‘ఈ వ్యవహారం మీకు తెలియందా? మంత్రివర్గంలో వారు చెబితేనే అలా చేయాల్సివచ్చింది’ అని చెప్పడంతో మంత్రి అవాక్కయ్యారు. దీంతో రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. -
సీఆర్డీఏ చట్టంపై ప్రత్తిపాటి పుల్లారావు
-
కలం కబుర్లు...
సీఎం నంబర్ ఇస్తే పోలే! ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రూపంలో తలనొప్పి వచ్చి పడింది. ప్రభుత్వం రైతు రుణ విముక్తి పథకం గురించి గొప్పగా చెప్పుకుంటోందని, ఆ పథకం డొల్ల మాత్రమేనని విమర్శించిన రఘువీరారెడ్డి ఈ పథకంపై సందేహాలుంటే నేరుగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఫోన్ చేయాలని నేరుగా మంత్రి సెల్‌ఫోన్ నంబరు వెల్లడించారు. దీంతో మంత్రికి క్షణం తీరిక లేకుండా వరుసగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఫోన్లు శరపరంపరగా వస్తూనే ఉన్నాయి. రుణ మాఫీ సంగతేంటంటూ ప్రతి ఒక్కరూ ఫోన్ చేయడమే కాకుండా కనీసం పావుగంట సేపు మాట్లాడుతున్నారట. వారు మాట్లాడే సమయంలో మధ్యలోనే కట్ చేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయన్న భయంతో కొన్ని ఫోన్లు మాట్లాడారట. ఇక లాభం లేదనుకున్న మంత్రివర్యులు ఫోన్లకు సమాధానం చెప్పేందుకు ప్రత్యేకంగా పీఏను కేటాయించారు. అయితే, సందేహాలు తీర్చుకునేందుకు ఫోన్ చేసిన రైతులు పీఏ చెప్పిందంతా విన్న తరువాత మీరెవరని ప్రశ్నించి.. పీఏ అన్న సమాధానం రాగానే రైతులు మంత్రిగారేమయ్యారంటూ నిట్టూరుస్తున్నారట. ఈ విషయం ఆయనే మీడియాకు చెప్పుకోగా, అది విన్న టీడీపీ సహచరుడొకరు విరుగుడు మంత్రం బోధించారు.. మంత్రిగారికెందుకు తంటాలు..! అదేదో ముఖ్యమంత్రి ఫోన్ నంబర్ ఇస్తే పోలే..! మౌనం వెనుక బావ..! ఏపీ శాసనసభ లాబీల్లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట కలపకుండా మౌనంగా ఉంటున్నారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో తనదైన శైలిలో మాట్లాడుతున్న బాలయ్య.. మీడియా ప్రతినిధుల మాట మాత్రం వినిపించుకోనట్లు ఉంటున్నారు. దీని వెనుక ఆయన బావ, టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ స్వతహాగా మనసులో ఏమీ దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంటారు. విలేకరులు పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై ప్రశ్నిస్తే బాలకృష్ణ సమాధానాలతో పార్టీకి, ప్రభుత్వానికి ఏ తంటా వస్తుందోనన్న ఆందోళనతో.. శాసనసభ సమావేశాల్లో నోరు మెదపొద్దని సీఎం స్పష్టంగా చెప్పటంతో మాట్లాడించేందుకు ఏ విలేకరి ఎంత ప్రయత్నించినా నోరు మెదపడం లేదని ఎమ్మెల్యేలు చెవులు కొరుక్కుంటున్నారు. ‘తెల్గీ’దేశం ఆఫీసుకు వెడదామా..? స్టాంపుల కుంభకోణం కేసులో మూడేళ్లు జైలు శిక్ష అనుభవించి వచ్చిన సి.కృష్ణాయాదవ్ ఇప్పుడు హైదరాబాద్ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడయ్యారు. మధ్యలో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కృష్ణాయాదవ్‌ను ఇప్పుడు హైదరాబాద్ పార్టీ అధ్యక్ష పదవి వరించింది. కానీ, ఆయన నాయకత్వం నచ్చనివారు నగర టీడీపీ కార్యాలయా న్ని ‘తెల్గీ ఆఫీసు’ అంటున్నారు. స్టాంపుల కుంభకోణంలో ప్రధాన నిందితుడు అబ్దుల్ కరీం తెల్గీతో పాటు కృష్ణాయాదవ్ చాలాకాలం పూణే జైలులో ఉన్నారు. దానిని దృష్టిలో ఉంచుకుని తెలుగు తమ్ముళ్లు ఆ పార్టీ ఆఫీసును కాస్త తెల్గీ ఆఫీసు అంటూ పేరును కుదించారు. ఇది తెలియని తమ్ముళ్లు తెలుగును కుదించి ‘తెల్గీ’ అని పిలుచుకుంటున్నారా.. ? అంటూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. హమ్మయ్య.. మన సీఎం సారేనట! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు హెలికాప్లర్లు పెద్దశబ్దంతో ఆకాశంలో ఎగురుతూ వస్తుంటే.. ఆ పల్లె వాసులు భయపడ్డారు. ఒక్క హెలికాప్టర్ కిందకు దిగుతుంటేనే పెద్ద శబ్దం వస్తుంది, అలాంటిది నాలుగు హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో ఆకాశంలో దూసుకువస్తుంటే భయపడరా....మరి? ఇటీవల రాచకొండ ప్రాంతాన్ని సందర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, సహచర మంత్రులు, ఉన్నతాధికారులు నాలుగు హెలికాప్టర్లలో అక్కడికి వెళ్లారు. మామూలుగా వాహనాల శబ్దం కూడా పెద్దగా ఉండని రాచకొండ పల్లెల్లో ఈ నాలుగు హెలికాప్టర్ల రాకను చూసి పల్లీయులు చాలా కంగారు పడ్డారట. మళ్లీ నక్సలైట్లు ఏమైనా వచ్చి ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేసుకున్నారా ...? అదితెలిసి పోలీసులు వస్తున్నారేమో అని పల్లెవాసులు ఉలిక్కిపడ్డారట. వచ్చింది ముఖ్యమంత్రి అని తెలిసి‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నారట. ఈ విషయం ఓ ఉన్నతాధికారే స్వయంగా సహచర అధికారులకు చె బుతూ కడుపుబ్బ నవ్వించారు. -
ఐదేళ్లలో రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తా
త్వరలోనే గోదావరి, కృష్ణానదుల అనుసంధానం చిత్తూరు సభలో ఏపీ సీఎం రైతు రుణవిముక్తి పత్రం విడుదల సాక్షి, చిత్తూరు: కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసి వచ్చే ఐదేళ్లల్లో రాయలసీమతోపాటు రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. జాతీయస్థాయిలో నదులు అనుసంధానం చేయాలని అనుకున్నప్పటికీ ముందు రాష్ట్రంలో దీనికి శ్రీకారం చుడుతున్నట్ల్లు చెప్పారు. చిత్తూరులో గురువారం నిర్వహించిన రైతు సాధికారిక సదస్సులో సీఎం పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి రైతు రుణవిముక్తి పత్రాన్ని విడుదల చేశారు. అంతకుముందు బాబు పలు శంకుస్థాపన శిలాఫలాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... గోదావరి నీళ్లు ఏడాదిలో 3వేల టీఎంసీలకుపైగా సముద్రం పాలవుతున్నాయని చెప్పారు. పోలవరం పూర్తిచేసి కుడి కాలువ ద్వారా కృష్ణానదికి 70 టీఎంసీల నీటిని తరలిస్తామన్నారు. అక్కడినుంచి హంద్రీ-నీవా, గాలేరు-నగరి, సోమశిల, కండలేరు ద్వారా రాయలసీమకు తరలించి రతనాల సీమ చేయడమే తన కల అని చెప్పారు. రూ.500 కోట్లు ఖర్చుచేస్తే గోదావరి నీటిని కృష్ణా నదిలో కలపవచ్చునన్నారు. ప్రణాళికా సంఘాలు సరిగ్గా పనిచేయడం లేదని ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. ప్రణాళిక సంఘాల స్థానంలో ముఖ్యమంత్రుల మండలి ఏర్పాటుచేయాలని సూచించినట్లు చెప్పారు. 2050 నాటికి అమెరికా, చైనా కంటే భారతదేశం ముం దుంటుందన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా రుణమాఫీ చేసి రైతుల భారాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్నానని చెప్పారు. హంద్రీ-నీవా పూర్తయితేనే చిత్తూరు బాగుపడుతుందన్నారు. చెరువులు, చెక్‌డ్యాములు, కాలువలను ఆధునికీకరించి భూగర్భ జలాలు పెరిగేలా చూస్తానని చెప్పారు. సౌర విద్యుత్తును అభివృద్ధి చేసి రైతులకు ఏడు గంటల కరెంట్‌ను పగటి పూటే ఇస్తామన్నారు. -
ఘనంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమార్తె వివాహం
-
ఇప్పటికి 50వేల లోపున్న రుణాలకే..!
-
రుణమాఫీపై 4న సీఎం ప్రకటన: ప్రత్తిపాటి
-
రుణమాఫీపై 4న సీఎం ప్రకటన: ప్రత్తిపాటి
హైదరాబాద్: వ్యవసాయ రుణాల మాఫీపై ఈనెల 4న సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. 20 శాతం నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, మిగిలిన మొత్తారికి సర్టిఫికెట్లు జారీచేస్తామని చెప్పారు. అర్హులైన వారికి ముందుగా నగదు జమ చేస్తామన్నారు. వివరాలు సమర్పించేందుకు మరింత ఇచ్చామని చెప్పారు. 82 లక్షల ఖాతాలకు గానూ ఇప్పటికి 43 లక్షల ఖాతాలకు సంబంధించిన వివరాలు మాత్రమే అందాయని వెల్లడించారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అమలుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. రూ. 50 వేలలోపు రుణం ఉన్నవారిని దీన్ని వర్తింపజేయాలా, వద్దా అనే దానిపై గురువారం ప్రకటన చేస్తామన్నారు. -
'తుపాను నష్టంపై నివేదిక అందజేశాం'
విశాఖ: హుదూద్ తుపాను వల్ల రూ. ఇరవై వేల కోట్లకు పైగా నష్టం జరిగినట్లు కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నాలుగు జిల్లాల్లో తుపాను నష్టం రూ. 21, 908 కోట్లు జరిగినట్లు అంచనా వేసి ఆ నివేదికను కేంద్ర కమిటీలోని సభ్యులకు అందజేశామన్నారు. ఇప్పటి వరకూ రూ. 7,500 కోట్లను రిలీఫ్ ఫండ్ కింద ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించనున్నట్లు ప్రత్తిపాటి స్పష్టం చేశారు. కేంద్ర బృందాలు తుపానుతో నష్టపోయిన జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కేంద్ర బృందాలు గురు, శుక్రవారాల్లో తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో పర్యటించాయి. -
శనగ రైతుపై వేలం వేటు
సాక్షి, ఒంగోలు: జిల్లాలో శనగ రైతులు భగ్గుమంటున్నారు. రుణాల మాఫీ అమలులో సర్కారు దోబూచులాటపై విరుచుకుపడుతున్నారు. ఆర్భాటపు ప్రకటనలతో మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోన్న అధికారపార్టీ నేతల మెడపై కత్తి పెట్టేందుకు సిద్ధమయ్యారు. తాజాగా, జిల్లాకు చెందిన శనగ పంట రైతులు ఆదివారం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇంటిని ముట్టడించడం చర్చనీయాంశమైంది. కొన్ని మాసాలుగా శనగ రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈవిషయంపై అనేకమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిశారు. అయితే, వారికి ఎక్కడా స్పష్టత లభించలేదు. పైగా, వారు కోల్డ్‌స్టోరేజీల్లో దాచుకున్న శనగల నిల్వలను బహిరంగ వేలం వేసి రుణాల రికవరీ చేస్తామని బ్యాంకర్లు నోటీసులిచ్చారు. ఈనెల 25వ తేదీ నుంచి 29 వరకు జిల్లాలో రుణాలు తీసుకుని బకాయి పడిన రైతులకు చెందిన 17 లక్షల క్వింటాళ్ల శనగలను బహిరంగ వేలం వేస్తామని బ్యాంకర్లు ప్రకటించడంతో వ్యవహారం రాజుకుంది. ఇదేవిషయంపై కిందటి నెల 27న వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రవాణామంత్రి శిద్ధా రాఘవరావుతో పాటు తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరాం నేతృత్వంలో రైతులు ముఖ్యమంత్రిని కలిశారు. వారంలో సమస్యను పరిష్కరిస్తామని అప్పట్లో చంద్రబాబు హామీనిచ్చినా ఫలితం దక్కలేదు. నోరువిప్పని అధికార పార్టీ నేతలు.. శనగ రైతులంతా టీడీపీకి ఓట్లేసి గెలిపించాలని.. గిట్టుబాటు ధరపై న్యాయం చేస్తామని అన్ని జిల్లాల్లో ఆపార్టీ నేతలు ఎన్నికల సమయాన విస్తృత ప్రచారం చేశారు. అప్పట్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారానికొచ్చినప్పుడు శనగ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, రైతు రుణమాఫీపై స్పష్టమైన హామీనిచ్చారు. ప్రస్తుతం అధికారం చేపట్టాక కూడా వారిని ఆదుకునే ప్రయత్నాల్లో ఆపార్టీ ప్రజాప్రతినిధులు వెనుకంజ వేస్తున్నారు. ప్రకాశం, కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాలోని నరసరావుపేట డివిజన్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో శనగ పంటను రైతులు సాగుచేస్తున్నారు. సరైన గిట్టుబాటు ధర లేక ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో మొత్తం 30 లక్షల క్వింటాళ్ల శనగలు కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వలున్నాయి. అందులో ప్రకాశం జిల్లాలోనే 20 లక్షల క్వింటాళ్లు నిల్వలుండటం గమనార్హం. ఏటా సీజన్ ప్రారంభంలో క్వింటాలు రూ.5 వేలకు పైగానే ధరపలికే శనగలు... సరుకు చేతికొచ్చే నాటికి క్వింటాలు రూ.2600 దిగజారింది. గిట్టుబాటు కాని ధరకు అమ్ముకోలేక, నిల్వలను కోల్డ్స్టోరే జ్ల్లోనే ఉంచుకున్నారు. స్టోరేజీల్లో ఉన్న సరుకు నిల్వలకు బ్యాంకర్లు అప్పటి ధరపై 75 శాతం రుణాలిచ్చారు. ప్రస్తుతం తీసుకున్న రుణాలకన్నా ..నిల్వచేసుకున్న సరుకుకు విలువ తక్కువగా ఉండటంతో.. మిగిలిన సొమ్ము వెంటనే చెల్లించాలని బ్యాంకర్లు రైతులను ఒత్తిడి చేస్తున్నారు. రెండేళ్లుగా శనగల నిల్వలు పేరుకుపోవడంతో రుణాల రికవరీ చేయని రైతులపై బ్యాంకర్లు వేలం నోటీసులిచ్చారు. ఇప్పటికే జిల్లాలో 2 వేల మంది రైతుల శనగలను రుణాల రికవరీ పేరిట వేలం వేశారు. తాజాగా, ఈనెల 25 నుంచి అత్యధిక మంది రైతుల శనగలను వేలం వేసేందుకు బ్యాంకర్లు సంసిద్ధం కావడంతో.. భగ్గుమన్న రైతాంగం వ్యవసాయ మంత్రి ఇంటిని చుట్టుముట్టాల్సి వచ్చిందని ప్రకాశం జిల్లా శనగ రైతుసంఘం అధ్యక్షుడు నాగ బోయిన రంగారావు తెలిపారు. వేలం నిలిపివేతపై కలెక్టర్‌కు ఆదేశాలు: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇంటిని ముట్టడించిన క్రమంలో బాధిత రైతులు బ్యాంకర్ల వేలం నోటీసులను చూపించారు. వ్యవసాయ రుణాల మాఫీ అమలుపై జాప్యంతో పాటు తాము పండించిన శనగలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. శనగల గిట్టుబాటు ధరపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని.. ఈవిషయంలో కేంద్రసహకారం కోరతామని చెప్పగా.. ఆయన సమాధానంపై రైతులు శాంతించలేదు. అనంతరం వారంతా కలిసి చిలకలూరిపేట - ఒంగోలు జాతీయ రహదారిపై బైఠాయించగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకాశం జిల్లా కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడి తక్షణమే బ్యాంకర్లను పిలిపించి వేలం ప్రక్రియను నిలువరించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
ప్రత్తిపాటికి శనగ సెగ!
పంటకు మద్దతు ధర కోసం ఏపీలో అన్నదాతల కన్నెర్ర మంత్రి నివాసం ముట్టడి చిలకలూరిపేట: ‘ఆదుకుంటామంటూ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు. అధికారం చేపట్టాక మా సమస్యలు పట్టించుకోవటం లేదు. బ్యాంకు అధికారులు శనగలను వేలం వేస్తామంటున్నారు. మాకు ఆత్మహత్యలే శరణ్యం’ అంటూ ఏపీలో శనగ రైతులు ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎదుట ఆందోళనకు దిగారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పలువురు రైతులు ఆదివారం చిలకలూరిపేటలోని మంత్రి ఇంటిని ముట్టడించారు. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.3,100 మద్దతు ధర లభిస్తోందని, ఈ ధరకు అమ్మితే రైతులు దివాళా తీస్తారని ఆక్రోశించారు. మూడేళ్లుగా గిట్టుబాటు ధరలేక ప్రకాశం జిల్లాలోనే 17 లక్షల క్వింటాళ్లు నిల్వ ఉన్నాయని మంత్రి దృష్టికి తెచ్చారు. బ్యాంకులు ఈనెల 24నుంచి వీటిని వేలం వేయటానికి సిద్ధమైనట్లు చెప్పారు. రైతువద్ద నిల్వ ఉన్న శనగలను క్వింటాల్‌కు రూ.5 వేల చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేయాలని, వేలం వేయటాన్ని నిలుపుదల చేయాలని డిమాం డ్ చేశారు. దీనిపై సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ప్రత్తిపాటి హామీ ఇచ్చారు. 25న రాస్తారోకోలు... మంత్రి హామీతో సంతృప్తి చెందని రైతులు శనగపంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చిలకలూరిపేటలోని జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈనెల 25 తేదీన గ్రామాల్లో రాస్తారోకోలు నిర్వహించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తేవాలని శనగ రైతులు కార్యాచరణను రూపొందించారు. -
ఉద్యానవన పంటలకు రుణమాఫీ వర్తించదు
హైదరాబాద్:ఉద్యానవన పంటలకు రుణమాఫీ వర్తించదని ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. అయినా ఆ పంటలను కూడా రుణమాఫీ జాబితాలో చేర్చాలని సీఎం చంద్రబాబును కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎరువులను, యూరియాను రూ.100 అదనంగా అమ్ముతున్నట్లు సమాచారముందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి శనివారం మీడియాతో మాట్లాడిన ప్రత్తిపాటి.. బ్లాక్ మార్కెట్ పై స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నామన్నారు. ఎరువుల షాపులపై దాడులు నిర్వహించి.. అధిక ధరలకు విక్రయించే షాపులను సీజ్ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎరువులు, యూరియాలో కొరత లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే టోల్ ఫ్రీ నంబర్ 18001801551 కు ఫోన్ నంబర్ లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
రైతులు ఆందోళన చెందాల్సిన పన్లేదు
-
'చంద్రబాబు తర్వాత లోకేష్ సీఎం అవుతారు'
హైదరాబాద్: రుణమాఫీ నిధుల సమీకరణ కోసమే ఫార్మర్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు సహకరించకపోవడం వల్లే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్పొరేషన్‌ను సెక్యూరటైస్ చేసి రుణమాఫీకి నిధులను తీసుకువస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే 10 ఏళ్లకు సెక్యూరటైస్ చేయడంలో తప్పులేదన్నారు. 20 ఏళ్ల వరకు టీడీపీ అధికారంలో ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు తర్వాత ఆయన తనయుడు లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. సీఎం అయ్యే అర్హతలన్నీ లోకేష్‌కు ఉన్నాయని పుల్లారావు వ్యాఖ్యానించారు. -
అక్టోబర్ 2 నుంచి 9 గంటల విద్యుత్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ అవసరాల కోసం ప్రస్తుత పరిస్థితుల్లో 7 గంటలపాటే విద్యుత్ ఇస్తామని ప్రభుత్వం శాసనమండలిలో ప్రకటించిన 24 గంటలు గడవకముందే అక్టోబర్ 2 నుంచి రైతులకు 9 గంటల పాటు విద్యుత్ ఇస్తామని శుక్రవారం శాసనసభలో వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. వ్యవసాయ పద్దుపై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇకపై భూములకూ హెల్త్‌కార్డులు ఇస్తామని, పేదలకు ఉచితంగా వైద్యం అందించినట్టే భూములకు ఇచ్చే హెల్త్‌కార్డుల ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు.. : కేఈ ఇకపై.. భూములను ఎక్కడి నుంచైనా రిజిస్టర్ చేయించుకునేలా చర్యలు చేపట్టినట్టు రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. దీనికోసం వెబ్‌ల్యాండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖకు, రెవెన్యూ శాఖకు మధ్య అనుసంధానం చేసి, రిజిస్ట్రేషన్ చేసిన 10 నిముషాల్లో రెవెన్యూ శాఖకు వివరాలు తెలిపే విధంగా చేస్తామన్నారు. రెవెన్యూ శాఖ పద్దుపై ఆయన సభ్యుల ప్రశ్నలకు సభలో సమాధానమిచ్చారు. -
ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా?: గడికోట
సాక్షి, హైదరాబాద్: మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. పదే పదే వైఎస్ రాజశేఖరరెడ్డిని దూషిస్తూ సాగిన మంత్రుల ప్రసంగంపై శ్రీకాంత్‌రెడ్డి ఆక్షేపణ తెలిపారు. 1994 నుంచి 2004 వరకూ మీ హయాంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టారో దానిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ప్రతి ప్రాజెక్టుపైనా తాము చర్చకు సిద్ధమని, దీనికి టీడీపీ సభ్యులు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. రైతును రాజుగా చూసేందుకే వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టారని, వైఎస్ హయాంలో రూ.47 వేల కోట్లు ఖర్చు చేస్తే మీరు లక్షకోట్లు అంటూ దుష్ర్పచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంతలోనే మంత్రి ప్రత్తిపాటి... తల్లి కాంగ్రెస్, పిల్లకాంగ్రెస్ అని సంబోధించగానే, శ్రీకాంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేస్తూ, రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉందని, ఆ తర్వాత టీడీపీ అలయెన్స్ ప్రభుత్వమే అధికారంలో ఉందని అన్నారు. రాజశేఖరరెడ్డి వారసులుగా ఐదేళ్ల ఆయన పదవీ కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకునేందుకు గర్వపడుతున్నామన్నారు. ఆయన మరణానంతరం అధికారంలో ఉన్న తెలుగు కాంగ్రెస్‌తోనే ప్రజ లకు కష్టాలు మొదలయ్యాయన్నారు. ఉమామహేశ్వరరావు పదే పదే తెలుగు గంగ ఎన్టీఆర్ హయాంలో చేపట్టారని చెబుతూండగా... టీడీపీ ఏదిచేసినా ఎన్టీఆర్ చేశారని చెప్పుకోవచ్చుగానీ, చంద్రబాబు ఏదైనా ప్రాజెక్టు కట్టారని ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. మీరు రైతుల ప్రభుత్వమని మాట్లాడుతున్నారు... మీ ముఖ్యమంత్రే తిన్నది అరక్క రైతులు ధర్నాలు చేస్తున్నారని అన్నారని గుర్తుచేశారు. -
‘చిక్కరు... దొరకరు... కనపడరు’
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు పార్లమెంటు సభ్యుడు, ఇద్దరు మంత్రులు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారారు. వారి గురించి ‘చిక్కరూ, దొరకరు, కనపడరని’ ఆ పార్టీ కార్యకర్తలే సరదా కామెంట్లు విసురుతున్నారు. పార్లమె ంటు సమావేశాలు ముగిసి పది రోజులు దాటినా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. రాష్ట్ర మంత్రుల్లో ప్రత్తిపాటి పుల్లారావు అడపాదడపా వస్తున్నా, రావెల కిషోర్ దొరకడం లేదు. నిత్యం అందుబాటులో ఉంటామని, సమస్యలు పరిష్కరిస్తామని, ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తామని, పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి చేస్తామని ఎన్నికల సమయంలో హామీలు గుప్పించిన ఈ నేతలు వాటిని పూర్తిగా విస్మరించారు. కనీసం ఫోన్‌కాల్స్‌కు కూడా స్పందించడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. * ప్రత్తిపాటి పుల్లారావుకు జిల్లాలో కేరాఫ్ అడ్రస్ అంటూ ఒకటి ఉందని, రావెల కిషోర్, గల్లా జయదేవ్‌లకు కేరాఫ్ అడ్రస్‌లు లేకపోవడంతో ఎక్కడ కలుసుకోవాలో అర్థం కావడం లేదని ప్రజలు, కార్యకర్తలు వాపోతున్నారు. * ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల పనితీరుపై నిఘా ఉందని, దాని ఆధారంగా మార్కులు ఉంటాయని, ప్రజా సమస్యల పరిష్కారానికి తమ టీమ్ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పడమే కాని ఆ పరిస్థితులేవీ జిల్లాలో కనపడటం లేదు. * ఇటీవల నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తి పలు మార్లు మంత్రి రావెలకు ఫోన్ చేసినా స్పందించ లేదు. చిన్నపాటి బదిలీలు, సమస్యలు పరిష్కరించు కోలేని దుస్థితిలో ఉన్నామని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ అందుబాటులో ఉన్నా స్థానిక నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని లోలోన రగిలిపోతున్నారు. * ఎంపీ గల్లా జయదేవ్ పరిస్థితి మరీ విచిత్రం. ఆయనకు గుంటూరులో స్థిర నివాసం లేదు. కుటుంబ సభ్యులూ ఇక్కడ ఉండరు. దాంతో ఆయన రాకపోకల సమాచారం పార్టీ ముఖ్యనేతలకీ తెలియడం లేదు. * సామాన్య ప్రజలకు ఆయన కార్యాలయ గడప తొక్కే పరిస్థితే లేదు. ఖరీదైన కారుల్లో వచ్చే వారికి మాత్రమే అక్కడ ప్రవేశం ఉంటోంది. * సాగునీటి సమస్య ఎదుర్కొంటున్న రైతులు ఎంపీ జయదేవ్ అందుబాటులో లేకపోవడంతో ఎంపీటీసీ, జెడ్సీటీసీ సభ్యులను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. * ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం, జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని హామీలు ఇచ్చిన గల్లా చివరకు గుంటూరులో ఇల్లు కూడా ఏర్పాటు చేసుకోలేదని, ఇక ఈయనేం అభివృద్ధి చేస్తారని ఆ పార్టీ కార్యకర్తలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. * మంత్రి పుల్లారావు జిల్లాకు వచ్చినప్పుడు కలిసేందుకు వెళ్లిన సామాన్య ప్రజలు, కార్యకర్తలను సెక్యూరిటీ సిబ్బంది బయటకు నెట్టివేస్తున్నారు. కనీసం మంత్రి బయటకు వచ్చినప్పుడైనా తమవైపు చూడకపోతారా అని వేచి చూసే కార్యకర్తలకు నిరాశే మిగులుతోంది. * చివరకు హైదరాబాద్‌లో కలుద్దామని వెళ్లినా అక్కడా చుక్కెదురవుతో ంది. కేవలం నిమిషం సమయం కేటాయించి ఇక్కడి వరకు రావాలా...నియోజవర్గంలోనే కలుద్దాం అంటూ మంత్రి వారిని సున్నితంగా తిప్పి పంపుతున్నారు. * ఓట్లు వేసి గెలిపించుకున్న తమ నాయకుడు మంత్రి అయ్యారనీ, తమ కూ మేలు చేస్తారని కలలు కంటున్న టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో అంతర్మథనం ఆరంభమైంది. -
రూ.13 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ సుస్థిరత, స్వయంసమృద్ధి, అధికోత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం శాసన సభలో తొలిసారి వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2014-15 సంవత్సరానికి ప్రతిపాదించిన ఈ బడ్జెట్ మొత్తం 13,109.39 కోట్ల రూపాయలు. ఇందులో ప్రణాళిక వ్యయం కింద రూ. 6,735.44 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ. 6,373.95 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ మొత్తంలో రూ. 5 వేల కోట్లు రుణమాఫీకి కేటాయించారు. మిగిలిన రూ. 8 వేల కోట్లను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కేటాయించారు. ప్రస్తుతానికి రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్‌తో సరిపెట్టింది. భవిష్యత్‌లో 9 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని మంత్రి చెప్పారు. అప్పుడు గొడవ చేశారే.. :సీఆర్ వ్యవసాయానికి ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సభా నిబంధనలు అనుమతిస్తాయా? అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది అసలు బడ్జెట్ భాగమా.. ప్రభుత్వ విధాన ప్రకటన అన్నది తేల్చాలని నిలదీశారు. శుక్రవారం శాసనమండలిలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. ఆయన బడ్జెట్ ప్రసంగానికి సిద్ధమైన సమయంలో రామచంద్రయ్య జోక్యం చేసుకుంటూ ప్రత్యేక బడ్జెట్ పేరుతో దీనిని ప్రవేశపెట్టడానికి సభా నిబంధనలు అంగీకరించవని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే.. అంచనాల కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, దీంతోపాటు సభలో కొన్ని నిబంధలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వాటిని పాటించకుండా ప్రత్యేక బడ్జెట్ ను ఎలా ప్రవేశపెడతారని ప్రశ్నించారు. పొంతనేది?: బొత్స ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలకు.. బడ్జెట్ కేటాయింపులకు ఏమాత్రమూ పొంతనలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం ఆరోపించారు. వ్యవసాయ రంగం నుంచి ప్రత్యేకంగా ఆదాయం లేనప్పుడు బడ్జెట్‌గా ఎలా పరిగణిస్తామన్నారు. చంద్రబాబు బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టినా మొక్కుబడిగానే ఉంటుందని ఎద్దేవా చేశారు. -
'రూ.లక్ష లోపు పంట రుణాలకు వడ్డీ రాయితీ'
హైదరాబాద్: వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన వ్య వసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఖర్చులు పెరిగి రైతులు అప్పుల పాలయ్యారని ఈ సందర్భంగా అన్నారు. రానున్న రోజుల్లో వ్యవసాయ ఉత్పత్తులు మరింత పెంచుతామని ఆయన హామీయిచ్చారు. ముఖ్య పంటల ఉత్పాదకత పెరిగేలా చర్యలు చేపడతామన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. వ్యవసాయ రుణాల మాఫీకి అంగీకరించినందుకు సీఎం చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రూ.లక్ష లోపు పంట రుణాలకు పూర్తి వడ్డీ రాయితీ వర్తిస్తుందని మంత్రి చెప్పారు. -
ఇంకా తీరని ‘చింత’
‘మాది రైతు ప్రభుత్వం.. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసి ఆగస్టు 15 కల్లా 11 టీఎంసీల నీటిని నిల్వ చేస్తాం.. ఆయకట్టుకు నీరందిస్తాం.. పునరావాస కేంద్రాల్లో పూర్తి స్థారుు సౌకర్యాలు కల్పిస్తాం.. ముంపు గ్రామాల నుంచి నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తాం..’ - ఇవీ సీఎం చంద్రబాబు, జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పలు సందర్భాల్లో ఇచ్చిన హామీలు. ... కానీ వీటిలో ఏ ఒక్కటీ నెరవేరలేదు. ప్రాజెక్టు క్రస్టుగేట్ల ఏర్పాటు పూర్తికాకపోవటంతో నీరు వృథాగా పోతోంది. ఫలితంగా ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేదు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు అరకొరగా ఉండటంతో ముంపు గ్రామాలను నిర్వాసితులు వదిలి వెళ్లటం లేదు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి సాగు నీరు వచ్చేస్తుంది.. ఏటా రెండు పంటలు పండించుకోవచ్చన్న డైల్టా రైతుల ఆశలు ఈ యేడాది కూడా ఫలించే అవకాశాలు కనిపించడం లేదు. రైతు సంక్షేమమే ధ్యేయమని గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే దీనికి కారణం. ప్రాజెక్టు పనులు పూర్తిచేసి ఆగస్టు 15 కల్లా 11 టీఎంసీల నీరు నిల్వ చేయూల్సి ఉండగా పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రాజెక్టులో నీటిని నిల్వ ఉంచాలంటే క్రష్ట్ గేట్లు పూర్తిస్థాయిలో పనిచేయాలి. కానీ బిగించిన 24 క్రస్ట్‌గేట్లు సరిగా పని చేయడం లేదు. వీటికి అమర్చిన ఆటోమేటిక్ జనరేటర్ సిస్టమ్, రబ్బర్ సీల్స్ సక్రమంగా పనిచేయకపోవడంతో నీరు వృథాగా పోతోంది. * ప్రాజెక్టులో నీటిని నిల్వ ఉంచాలంటే ముందుగా ముంపు గ్రామాలను ఖాళీ చేయించి నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు పంపాలి. అలా పంపాలంటే పునరావాస కేంద్రాల ఏర్పాటు పూర్తి కావాలి. కానీ అది జరగలేదు. * ఇటీవల ప్రాజెక్టులో కొద్దిపాటి నీరు చేరితేనే కోళ్లూరు, పులిచింతల గ్రామాలను వర ద నీరు తాకింది. 11 టీఎంసీల నీటిని నిల్వ ఉంచితే బెల్లంకొండ మండలంలోని కోళ్లూరు, పులిచింతల, గొల్లపేట, కేతవరం గ్రామాలు పూర్తిగా మునిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. * పులిచింతల, కోళ్లూరు గ్రామస్తుల కోసం అచ్చంపేట మండలం చిగురుపాడు పంచాయతీ పరిధిలో పునరావాసకేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ 208 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించగా 126 కుటుంబాలే ఇళ్లు నిర్మించుకుంటున్నాయి. సకాలంలో బిల్లులు రాకపోవడంతో చాలా ఇళ్లు వివిధ స్థారుుల్లో ఆగిపోయూయి. * విద్యుత్, తాగునీరు వంటి కనీస వసతులు లేక నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గొల్లపేట గ్రామస్తులకు చౌటపాపాయపాలెం, రాజుపాలెం గ్రామాల్లో పునరావాస కేంద్రాలను కేటాయించారు. కేతవరం గ్రామస్తులకు అచ్చంపేట మండలం నీలేశ్వరపాలెం పంచాయతీ పరిధిలోని 28 ఎకరాల విస్తీర్ణంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. * ఇక్కడ 320 కుటుంబాలకు 5 సెంట్లు చొప్పున కేటాయించి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, గ్రంథాలయం, పశువైద్యశాల, ప్రాథమిక పాఠశాల, కమ్యూనిటీ హాలు, అంగన్వాడి కేంద్రాలను నిర్మించారు. అరుునా నిర్వాసితులు గ్రామం వదిలి రాలేదు. దీంతో ప్రభుత్వ భవనాల్లోని సామగ్రి పోతోంది. -
రుణాలపై దిక్కుతోచని స్థితిలో రైతాంగం...
-
ఇది వంచన కాదా?
* రుణ మాఫీపై పూటకో మాట చెప్తూ ప్రభుత్వం అదను దాటించేసిందని రైతాంగం ఆవేదన * మరో రెండు మూడు మాసాల్లో రుణ మాఫీ చేస్తామంటున్నారు.. ఇప్పుడు అప్పులు పుట్టడం లేదు..ఈలోగా సీజన్ దాటిపోతుంది * మీరే రుణాలు చెల్లించుకోండి అని రైతులకు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి సలహా ఇస్తున్నారు * మాకు స్తోమత లేదనేగా మీరు రుణ మాఫీ వాగ్దానం చేసింది.. ఆ వాగ్దానాన్ని నమ్మే కదా మేం ఓట్లేసింది.. ఇప్పుడిలా మాటమార్చడమేమిటని ప్రశ్నిస్తున్న రైతులు * ఈ ప్రభుత్వాన్ని నమ్ముకున్నందుకు వడ్డీ భారం మీద పడింది * ఆ వడ్డీ ఎవరు కడతారో కూడా స్పష్టత లేదంటూ రైతన్నల ఆవేదన సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రైతులకు ఖరీఫ్ సీజన్ కష్టాలు తప్పలేదు. అప్పుల బాధ తీరుతుందని గంపెడాశతో ఎదురుచూసిన రైతులకు ఈ సీజన్లో అసలు అప్పులే లేని పరిస్థితుల్లోకి నె ట్టేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు రైతులకు రుణాలు లభించే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, వాటి కష్టాలను ప్రత్యక్షంగా చూశానని.. తాను అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కమిటీలు, రీషెడ్యూలు అంటూ కాలయాపన చేయడంతో రైతులకు అసలు రుణాలే దక్కని పరిస్థితి ఏర్పడింది. పాత అప్పులు చెల్లించి కొత్త రుణాలు తీసుకోవాలని స్వయంగా వ్యవసాయశాఖ మంత్రి చెప్పడంతో రైతులు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ‘రుణాలు చెల్లించలేని స్థితిలో ఉన్నామనే కదా చంద్రబాబు రుణమాఫీ హామీ ఇచ్చింది... ఆయన మాటలు నమ్మే కదా మేము ఓటేసింది. తీరా.. ఏరు దాటాక ఇదేం పద్ధత’ంటూ రైతన్నలు వాపోతున్నారు. మరోవైపు బ్యాంకులు సైతం పాతవి కట్టనిదే కొత్త రుణాలు ఇవ్వబోమని తేల్చిచెప్తున్నాయి. ఆలస్యంగానైనా వర్షాలు కురుస్తుంటే సాగు కోసం అవసరమైన పెట్టుబడికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూలైలో మొదలయ్యే ఖరీఫ్ కొంత ఆలస్యమైనప్పటికీ చివరగా ఈ నెల 15 లోపు పంటలు వేయకపోతే ఇక ఈ సీజన్‌పై రైతులు ఆశలు వ దులుకోవలసిందేనని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనాల కారణంగా వర్షాలు కురిసినప్పటికీ రుణాలు లేక పంట వేయలేని నిస్సహాయ స్థితిలో రైతులున్నారు. బ్యాంకులకు సమాధానం ఎవరు చెప్పాలి? రుణ మాఫీ భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న ప్రభుత్వం వాటిపై ఇప్పట్లో ఎటూ తేల్చే పరిస్థితి కనిపించడం లేదు. రుణాల రీషెడ్యూలు విషయంలో కూడా రిజర్వు బ్యాంకు అడిగిన వివరాలు అందించడంలో మీనమేషాలు లెక్కిస్తున్న కారణంగా రీషెడ్యూలు కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ సీజన్లో రుణాల రీషెడ్యూలు అయ్యే అవకాశాలే లేవని బ్యాంకర్లు ఇప్పటికే ప్రకటించారు. పైగా ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చకుండా కొత్త రుణాలు ఇవ్వలేమని కూడా బ్యాంకర్లు చాలా స్పష్టంగా చెప్పారు. మొత్తంమీద ఈ దోబూచులాట మధ్య రైతులకు కొత్త రుణాలు లేకపోగా వారి నెత్తిన అదనంగా 13 శాతం వడ్డీ భారం పడింది. అంటే లక్ష రూపాయలు అప్పు తీసుకున్న రైతుకు గడచిన ఏడాదికే 13,000 రూపాయల వడ్డీ పడింది. ఈ సంవత్సరానికి మళ్లీ అంతే వడ్డీ చెల్లించాలి. చంద్రబాబు మాటలు నమ్మి సకాలంలో అప్పు చెల్లించని పాపానికి వడ్డీ రూపంలో మా నడ్డి విరిగిందని రైతులు వాపోతున్నారు. రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు వాటిని చెల్లించాలని చెప్తుంటే.. అదనపు వడ్డీ కట్టాల్సిందేనంటున్న బ్యాంకులకు సమాధానం ఎవరు చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. రుణాలపై దిక్కుతోచని స్థితిలో రైతాంగం... ఇదిలావుంటే.. కృష్ణా వాటర్ బోర్డు సమావేశంలో నిర్ణయించిన మేరకు డెల్టా నారుమళ్లకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించి ఆ మేరకు నీటి విడుదల ప్రక్రియ ప్రారంభం కాగా 13 లక్షల ఎకరాల్లో సాగుకు పరిస్థితి సానుకూలమైంది. ఈ పరిస్థితుల్లో రైతాంగానికి పెట్టుబడి చాలా కీలకంగా మారింది. ఈ అదను తప్పిన తరువాత రుణాలిస్తామన్నా ప్రయోజనం ఉండదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 87,617 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు, 14,208 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు కావస్తున్నా ఆ హామీలపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పైగా ఇప్పుడు సీజన్ దాటిపోయే పరిస్థితుల్లో చివరి అంకంలో కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా కల్పించకపోవడంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆర్బీఐ పైకి నెపం నెడుతూ సర్కారు కాలక్షేపం... పైగా రుణాల రీషెడ్యూలు కూడా కనీసంగా మరో రెండు నెలలు పడుతుందని ప్రభుత్వం తాజాగా చెప్పడంతో ఇక ఈ సీజన్లో రైతులకు బ్యాంకుల నుంచి అప్పులు పుట్టవని తేలిపోయింది. వనరుల సమీకరణ కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ మరో రెండు నెలల వరకు నివేదిక ఇచ్చే పరిస్థితులు లేవని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య నేతృత్వంలో వేసిన కమిటీ కోసం నెలన్నర గడువు తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు వనరుల సమీకరణ కోసం వేసిన కమిటీ నివేదిక కోసం, మరోవైపు రీషెడ్యూలు కోసం ఆర్బీఐపై నెపం నెడుతూ కాలయాపన చేస్తుండటాన్ని బట్టి ఈసారి ఏపీ రైతులకు బ్యాంకుల నుంచి కొత్త అప్పులు ఉండవని పరోక్షంగా తేల్చిచెప్పినట్టేనని అధికారులు చెప్తున్నారు. -
రుణమాఫీ భారాన్ని ప్రభుత్వాలు భరిస్తే తప్పేంటి?
హైదరాబాద్: చేపల పెంపకం వైపు దృష్టి సారించాలని వ్యవసాయ రైతులకు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్చేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. 17వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని 60వేల కోట్లకు రూపాయలకు పెంచేందుకు ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. వెసులుబాటున్న రైతులు రుణాలు చెల్లించి కొత్త రుణాలు తీసుకోండి అని ప్రత్తిపాటి విజ్క్షప్తి చేశారు. కొత్త రుణాలు ఇవ్వలేమన్న ఆంధ్రాబ్యాంక్‌కు లేఖ రాశామని ఓ ప్రశ్నకు సమాధానామిచ్చారు. రుణమాఫీ భారాన్ని వచ్చే ప్రభుత్వాలు భరిస్తే తప్పేముందన్నారు. బ్యాంకుల నుంచి వివరాలు వచ్చాక రుణమాఫీ ప్రక్రియ ఆరంభమవుతుందని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. -
ఏపీలో వ్యవసాయ బడ్జెట్ లేనట్టే?
హైదరాబాద్: ఈ ఏడాదికి ఏపీలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉండే అవకాశాలు కనిపించడంలేదు. కర్ణాటకను ఆదర్శంగా తీసుకుని గతేడాది ప్రవేశపెట్టిన ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ తరహాలోనే ఈ ఏడాది కూడా వ్యవసాయానికి ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశ పెడతామని ఏపీ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇటీవల వెల్లడించారు. అయితే, ఇప్పటికే ఆర్థిక బడ్జెట్ ప్రతిపాదనలు ఊపందుకున్నప్పటికీ వ్యవసాయ బడ్జెట్‌పై ఎలాంటి ప్రతిపాదనా లేకపోవడాన్నిబట్టి ఈసారికి లేనట్టేనని సమాచారం. రాష్ట్ర సాధారణ బడ్జెట్ కసరత్తు సోమవారం నుంచి మొదలైంది. వివిధ శాఖల అధి కారులతో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చర్చల ప్రక్రియను ప్రారంభించారు. -
మంత్రి గారూ.. గోడు వినరూ
సాగు జాప్యంతో ఖరీఫ్ రైతు ఆందోళన జీవనోపాధి కోల్పోతున్న మత్స్యకారులు కొలిక్కిరాని కొల్లేరు సమస్యలు నేడు జిల్లాకు రానున్న వ్యవసాయ మంత్రికి సమస్యలు నివేదించనున్న నేతలు కైకలూరు : రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం మొదటిసారిగా జిల్లాకు రానున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని మత్స్యకారులు, రైతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చేందుకు ఆయా సంఘాల నేతలు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర చేపల రైతుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ మాగంటి బాబులతో పాటు ఆయనకు కైకలూరులో ఆదివారం సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా రైతులు, మత్స్యకారులు, చేపల రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లనున్నారు. సాగు.. బహు జాగు... జిల్లాలో వరి రైతు పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఖరీఫ్ ముంచుకొచ్చేసినా అదునులో వర్షాలు లేకపోవడం, తీవ్ర నీటి కొరతతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా మొత్తం మీద 8.81 లక్షల పంట సాగుకు ప్రణాళిక సిద్ధమైంది. ఇందులో వరి 6.34 లక్షలు, పత్తి 1.41 లక్షలు, చెరుకు 36 వేలు, మిర్చి 25 వేలు, మొక్కజొన్న ఇతరత్రా పంటలు 43 వేల 892 ఎకరాల్లో సాగు చేయడానికి రైతులు సిద్ధమయ్యారు. సాధారణంగా జూన్ మొదటి వారం దాటాక రైతులు నారుమడులు పోస్తారు. జూలై మొదటి వారంలో నాట్లు ప్రారంభిస్తారు. తీవ్ర వర్షభావం ప్రభావంతో జూన్ నెలాఖరు కావస్తున్నా వ్యవసాయ పనులు ఊపందుకోలేదు. మరోవైపు జాతీయ ఆహార భద్రత పథకం నుంచి జిల్లాను మినహాయించడంతో రాయితీపై విత్తనాలు అందే పరిస్థితి లేదు. కొద్ది రోజుల క్రితం కేంద్రం సాధారణ రకం ధాన్యంపై క్వింటాలుకు మద్దతు ధర రూ.50 పెంచింది. ప్రస్తుతం క్వింటాలు పంటకు రూ. 2,104 ఖర్చవుతుండగా, మద్దతు ధర రూ.1400 మాత్రమే ఉందని, ఇది రైతులకు ఏ విధంగా మేలు చేస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రోత్సాహకాలు కరువు... జిల్లాలో 111 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. మొత్తం లక్షా 15 వేల మంది మత్స్యకారులు ఉన్నారు. వీరిలో 40 వేల మంది సముద్రపు వేటపై ఆధారపడ్డారు. ప్రభుత్వం నుంచి ప్రొత్సహకాలు లేకపోవడంతో జీవనోపాధి కోల్పోతున్నారు. వీరికి సముద్రపు వేట ఆశాజనకంగా లేదు. ఎన్ఎఫ్డీబీని సీమాంధ్రలో ఏర్పాటు చేయాలి... మత్స్యరంగం అభివృద్ధికి కేంద్ర స్థాయిలో సాయమందించే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్డీబీ) కార్యాలయం హైదరాబాదులో ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్ఎఫ్డీబీని కోస్తాంధ్రకు మార్పు చేయాలని ఇక్కడి ఆక్వా రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యశాఖలో అన్ని కేటగిరీలకు సంబంధించి 1,400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన 500 మంది విడిగా వెళ్లారు. కార్యాలయం కూడా రెండుగా విడిపోయింది. కోస్తాంధ్రలో విస్తరించిన ఆక్వా రంగాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్ఎఫ్డీబీని ఇక్కడ ఏర్పాటు చేయాలనే డిమాండ్ రైతుల నుంచి వస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా ఉత్పత్తులను నిల్వ చేసుకోడానికి ప్రభుత్వపరంగా ఒక్కటంటే ఒక్క కోల్డ్‌స్టోరేజీ కూడా అందుబాటులో లేదు. గతంలో బ్రాకిష్ వాటర్ ఫిష్ ఫార్మర్స్ ఏజెన్సీ (బీఎఫ్డీఏ), ఫ్రెష్ వాటర్ ఫిష్ ఫార్మర్స్ ఏజెన్సీ (ఎఫ్ఎఫ్డీఏ)ల ద్వారా కేంద్రం సబ్సిడీపై రైతులకు నిధులు అందించేది. పదేళ్లుగా అవి మనుగడలో లేవు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తే రైతులకు మేలు జరగటంతో పాటు రాష్ట్రంపై భారం తగ్గుతుందని ఆక్వా రైతులు చెబుతున్నారు. మత్స్యకారుల సమస్యలివీ... సముద్రంలో చేపల వేటకు ఉపయోగించే మర బోటులకు ప్రభుత్వం అందించే డీజిల్ సబ్సిడీని రూ.6 నుంచి రూ.10కి పెంచాలని మత్స్యకారులు కోరుతున్నారు. 2002 ఏడాదికి ముందు ఇంజన్ బోట్లకు మాత్రమే డీజిల్ సబ్సిడీ అందిస్తామనే మెలిక పెడుతున్నారు. అందరికీ సబ్సిడీ అందించాలి. ఏటా 50 శాతం సబ్సిడీతో వలలు పంపిణీ చేయాలి. ఎకో టూరిజం ద్వారా సముద్రంలో తిరిగే విహార బోట్లకు మచిలీపట్నంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలి. హార్బర్ పూడుకుపోవడంతో వేటకు వెళ్లిన మత్స్యకారులు పోటు సమయం వరకు వేచివుండాల్సి వస్తోంది. కొల్లేరు వాసుల కష్టాలివీ... కొల్లేరు ప్రాంత మత్స్యకారులు వేటకు ఉపయోగించే వెదురు గెడల పంపిణీ రెండేళ్లకోసారి చేసేవారు. పంపిణీ నిలిచిపోవడంతో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. కొల్లేరు సొసైటీలకు అందించే వలల పంపినీ పథకం వివాదాల వల్ల నిలిచిపోయింది. కొల్లేరులో వేటకు ఉపయోగించే తాటి దోనెల స్థానంలో ఫైబర్ దోనెలు అందించాలని కొల్లేరు మత్స్యకారులు కోరుతున్నారు. చేపల ఉత్పత్తులను విక్రయించేందుకు ఉపయోగించే మోటారు సైకిళ్లు, ఐస్ బాక్సుల పంపిణీ జరగడం లేదు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో ధ్వంసం చేసిన జిరాయితీ భూములకు నష్టపరిహారం చెల్లించలేదు. మత్స్యశాఖలో సిబ్బంది కొరత కారణంగా సేవలు సన్నగిల్లుతున్నాయి. తీవ్ర తాగునీటి ఎద్దడి కొల్లేరు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
30 లోపు రుణమాఫీపై స్పష్టత
హైదరాబాద్: ఈ నెల 30వ తేదీ లోపు రైతుల రుణాల మాఫీపై స్పష్టత ఇస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. రుణమాఫీకి వ్యతిరేకంగా రిజర్వ్ బ్యాంక్ లేఖ రాయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రుణమాఫీ అమలు బ్యాంకర్ల ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీస్తుందని, రుణాలు సక్రమంగా చెల్లించేవారికి మాఫీ అంశం అన్యాయం చేయడమే అవుతుందని ఆర్బిఐ పేర్కొంది. రుణమాఫీని నగదు రూపంలో చెల్లిస్తేనే అంగీకరిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీలను ఆమోదించేది లేదని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయశాఖ, ఆర్థికశాఖ శాఖాధికారులతో సమావేశమయ్యారు. పరిస్థితులను సమీక్షించారు. అనంతరం మంత్రి పుల్లారావు మాట్లాడుతూ ఈ నెల 22న రుణమాఫీ కమిటీ నివేదిక వస్తుందని తెలిపారు. 30వ తేదీ లోపన రుణమాఫీపై ఒక స్పష్టత ఇస్తామని చెప్పారు. కేంద్రానికి, ఆర్బిఐకి తక్షణమే లేఖలు రాస్తున్నట్లు మంత్రి తెలిపారు.