
'చంద్రబాబు తర్వాత లోకేష్ సీఎం అవుతారు'
హైదరాబాద్: రుణమాఫీ నిధుల సమీకరణ కోసమే ఫార్మర్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు సహకరించకపోవడం వల్లే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్పొరేషన్‌ను సెక్యూరటైస్ చేసి రుణమాఫీకి నిధులను తీసుకువస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే 10 ఏళ్లకు సెక్యూరటైస్ చేయడంలో తప్పులేదన్నారు.
20 ఏళ్ల వరకు టీడీపీ అధికారంలో ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు తర్వాత ఆయన తనయుడు లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. సీఎం అయ్యే అర్హతలన్నీ లోకేష్‌కు ఉన్నాయని పుల్లారావు వ్యాఖ్యానించారు.