'రూ.లక్ష లోపు పంట రుణాలకు వడ్డీ రాయితీ' | Prattipati Pulla Rao happy to introduce Agriculture Budget | Sakshi
Sakshi News home page

'రూ.లక్ష లోపు పంట రుణాలకు వడ్డీ రాయితీ'

Published Fri, Aug 22 2014 10:47 AM | Last Updated on Thu, Mar 28 2019 5:23 PM

'రూ.లక్ష లోపు పంట రుణాలకు వడ్డీ రాయితీ' - Sakshi

'రూ.లక్ష లోపు పంట రుణాలకు వడ్డీ రాయితీ'

హైదరాబాద్: వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన వ్య వసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఖర్చులు పెరిగి రైతులు అప్పుల పాలయ్యారని ఈ సందర్భంగా అన్నారు.

రానున్న రోజుల్లో వ్యవసాయ ఉత్పత్తులు మరింత పెంచుతామని ఆయన హామీయిచ్చారు. ముఖ్య పంటల ఉత్పాదకత పెరిగేలా చర్యలు చేపడతామన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. వ్యవసాయ రుణాల మాఫీకి అంగీకరించినందుకు సీఎం చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రూ.లక్ష లోపు పంట రుణాలకు పూర్తి వడ్డీ రాయితీ వర్తిస్తుందని మంత్రి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement