ఉద్యానవన పంటలకు రుణమాఫీ వర్తించదు
హైదరాబాద్:ఉద్యానవన పంటలకు రుణమాఫీ వర్తించదని ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. అయినా ఆ పంటలను కూడా రుణమాఫీ జాబితాలో చేర్చాలని సీఎం చంద్రబాబును కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎరువులను, యూరియాను రూ.100 అదనంగా అమ్ముతున్నట్లు సమాచారముందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి శనివారం మీడియాతో మాట్లాడిన ప్రత్తిపాటి.. బ్లాక్ మార్కెట్ పై స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నామన్నారు.
ఎరువుల షాపులపై దాడులు నిర్వహించి.. అధిక ధరలకు విక్రయించే షాపులను సీజ్ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎరువులు, యూరియాలో కొరత లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే టోల్ ఫ్రీ నంబర్ 18001801551 కు ఫోన్ నంబర్ లో ఫిర్యాదు చేయవచ్చన్నారు.